వైసీపీ ర్యాలీలో కేటీఆర్ ఫ్లెక్సీ.!
Publish Date:Aug 11, 2026
Advertisement
ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.మెగా డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ.. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నేతృత్వంలో జీలుగుమిల్లలో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో వైసీపీ ప్రదర్శించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే.. జీలుగుమిల్లిలో వైసీపీ చేపట్టిన ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఫ్లెక్సీలతో పాటు ఏపీతో ఏ మాత్రం సంబంధం లేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ఫ్లెక్సీ కూడా ప్రదర్శించారు. వైసీపీ ర్యాలీలో పొరుగు రాష్ట్రానికి చెందిన కీలక నాయకుడి ఫొటో కూడా దర్శనమివ్వడం అందరినీ విస్మయానికి గురి చేసింది, ఈ ర్యాలీలో.. రాసి పెట్టుకోండి.. 2029లో మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే" అనే నినాదాలతో ఉన్న ప్లకార్డులను, ఫ్లెక్సీలను వైసీపీయులు ప్రదర్శించారు. అయితే సదరు ఫ్లెక్సీపై వైసీపీ అధినేత జగన్ పక్కన కేటీఆర్ ఫొటో కూడా ఉండటం కలకలం సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం ఇక్కడ ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెటిజన్లు ఈ ఫ్లెక్సీలను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రధాన రాజకీయ పార్టీల నేతల బొమ్మలు ఒకే ఫ్లెక్సీలో దర్శనమివ్వడం వెనుక ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా అన్న కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఏపీ డీఎస్సీ అవకతవకలకు నిరసనగా జరుగుతున్న ర్యాలీలో బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ ఫోటో ఎందుకంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. అయితే ర్యాలీలో కేటీఆర్ ఫొటోపై వైసీపీ నుంచి ఎటువంటి వివరణా రాలేదు. YCP protest rally, Jagan and KTR flexi, Eluru Rally, Former MLA Tellam Balaraju, Andhra Pradesh politics, TeluguOne
http://www.teluguone.com/news/content/ycp-protest-rally-39-228622.html





