మునిసిపోల్స్ లో ఘోర పరాజయం: అంబటి నోట పరాజయం మాట: ఓటమి ఒప్పుకోలు.!

Publish Date:Nov 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌  మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయం చవిచూసిందని  వైసీపీ  సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు  అన్నారు.  ఎన్నికల్లో అధికార తెలుగుదేశం కూటమి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూనే, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల ఫలితమే ఇప్పుడు  అనుభవిస్తున్నామని చెప్పారు. తద్వారా గతంలో తాము అక్రమాలు చేశామని అంగీకరించారు. విశేషమేంటంటే.. ఆయనీ ఓటమి ఒప్పుకోలు హైదరాబాద్‌లో ఈడీ విచారణకు హాజరై బయటకు వచ్చిన తరువాత జరిగింది. ఈడీ విచారణ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన అంబటి,   రాష్ట్రంలో ఏ ఎన్నికలు నిర్వహించినా ప్రజల నుంచి ఇదే రకమైన తీర్పు వస్తుందని, ఫలితాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని చెప్పారు.

వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓ వైపు వైసీపీ అధినేత జగన్.. ఎన్నికల్లో అక్రమాలు, అధికార తెలుగుదేశం కూటమి దౌర్జన్యాల కారణంగానే ఫలితాలు ఇలా వచ్చాయనీ, పోలీసులు, ఎన్నికల సంఘం, బాబు టీమ్ గా ఏర్పడి మునిసిపోల్స్ ను ఎలక్షన్ గా కాకుండా సెలక్షన్ గా మార్చేశారని విమర్శిస్తుంటే, ఆ పార్టీ సీనియన్ నాయకుడు, కీలక నేత అంబటి.. మాత్రం ప్రజాక్షేత్రంలో వైసీపీపై ఉన్న వ్యతిరేకత కారణంగానే ఓటమి పలయ్యామని అంగీకరించడం గమనార్హం. జరిగిన పరిణామాలే నేడు పార్టీకి ఈ గతి పట్టించాయని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కాగా ఇదే సందర్భంగా  మద్యం రవాణాకు సంబంధించిన ఈడీ విచారణ వివరాలను కూడా అంబటి వెల్లడించారు.  తన నియోజకవర్గ పరిధిలోని వైకాపా నాయకులు సుబ్బారెడ్డి, పురుషోత్తంలకు మద్యం రవాణాకు సంబంధించి సబ్ కాంట్రాక్టులు ఇప్పించేందుకు తాను సిఫారసు చేసినట్లు  అంగీకరించారు. ఈ విషయమై అప్పట్లో వాసుదేవరెడ్డితో మాట్లాడానని కూడా అంగీకరించారు.  ఈ వ్యవహారానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈడీ అధికారులకు   వివరించినట్లు చెప్పారు.

తాను సిఫారసు చేసిన వ్యక్తులకు కాంట్రాక్టులు దక్కాయని, వాటిని సుమారు ఐదేళ్లపాటు నిర్వహించగా రూ.16 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు టర్నోవర్ నమోదైందన్న అంబటి,   అయితే ఈ ఆర్థిక లావాదేవీలలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో అధికారుల దర్యాప్తులో భాగంగానే తాను విచారణకు హాజరైనట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా అధికారులు తన ఆధాన్, పాన్ కార్డు వివరాలను సేకరించారని తెలిపారు. 

రాష్ట్ర రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒకవైపు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో, అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే నేడు పార్టీ ఓటమికి కారణమని విపక్ష నేత స్వయంగా అంగీకరించడం గమనార్హం. ఒకవైపు ఈడీ విచారణ ఎదుర్కొంటూనే మరోవైపు ఎన్నికల పరాజయంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.  

[Ambati Rambabu On AP Municipal Elections, Accepts YCP Defeat, Ambati Rambabu ED Inquiry Hyderabad, Andhra Pradesh Politics, Telugu One] 

By
en-us Political News

  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.