సిట్టింగ్ స్థానాల్లోనూ పట్టు కోల్పోతున్న వైైసీపీ?!

Publish Date:Apr 24, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి, వచ్చే ఎన్నికలలో ఆ సంఖ్యైనా మిగులుతుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణులలోనే వ్యక్తమౌతున్న పరిస్థితి. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం..  వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 11 నియోజకవర్గాల్లో కనీసం నాలుగు స్థానాల్లో వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ గెలవడం సాధ్యం కాదని అంటున్నారు.   సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గత ఎన్నికలలో వైసీపీ విజయం సాధించిన నియోజకవర్గాలలో.. కనీసం నాలుగింటిలో ఇప్పుడు వైసీపీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి పులివెందుల తరువాత అంతటి సురక్షిత స్థానంగా చెప్పుకునే పుంగనూరులో ఆ పార్టీ ప్రస్తుతం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని తెలుస్తోంది. పుంగనూరు పుడింగిగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఎన్నికలలోనే చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా విజయం సాధించారు. 2024 ఎన్నికలలో పెద్దిరెడ్డికి పుంగునూరులో వచ్చిన మెజారిటీ కవేలం 6వేల ఓట్లు మాత్రమే. అయితే ప్రస్తుతం చూస్తే.. ఆ నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని అంటున్నారు. పెద్దిరెడ్డి కేవలం వ్యాపారాలు, కోర్టు కేసులకే పరిమితమై ప్రజలకు దూరంగా ఉండటమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక  కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలోనూ వైసీపీకి గడ్డు పరిస్థితులే ఉన్నాయి. గత ఎన్నికలలో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి సుధ విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఆమె పనితీరు పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. వచ్చే ఎన్నికలలో బద్వేలు వైసీపీ చేజారడం ఖాయమని చెబుతున్నారు.  

అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో కూడా వైసీపీకి గడ్డుపరిస్థితులే నెలకొని ఉన్నాయంటున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు.  అయితే.. ఆయన నియోజకవర్గ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన అక్కడి ప్రజలలో వ్యక్తం అవుతోంది. మరో వైపు తెలుగుదేశం నేత గొట్టిపాటి రవి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. దీంతో వైసీపీ నియోజకవర్గంలో పట్టు కోల్పోయిన పరిస్థితి ఉందని అంటున్నారు. . 

ఇక అరకు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి రేగం మత్స్యలింగం ఇ విజయం సాధించారు. అయితే ఆయన కూడా నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదనీ, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూటమి నేతలు క్షేత్రస్థాయిలో చురుకుగా, చొరవగా పని చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దీంతో అరకులో కూడా ఆ పార్టీకి మరో చాన్స్ దక్కే అవకాశాలు అంతంతమాత్రమే అంటున్నారు.  

అయితే వైసీపీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నా.. ఒక సారి పార్టీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టగానే, గాలి వైసీపీవైపు మళ్లడం ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ క్యాడర్ లో, ప్రజలలో వైసీపీ పట్ల ఒకింత అసంతృప్తి ఉన్నమాట నిజమే అయినా..
జగన్ మోహన్ రెడ్డి త్వరలో చేపట్టబోయే పాదయాత్ర  దానిని పటాపంచలు చేస్తుందనీ, మళ్లీ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నది.   అయితే పరిశీలకులు మాత్రం ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకుని ప్రజలతో మమేకం కాకుండా వైసీపీ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.