కుప్పంలో తిరుపతి తరహా దొంగ ఓటర్లు! వైసీపీ కుట్రలపై టీడీపీ ఫైర్..
Publish Date:Nov 14, 2021
Advertisement
కుప్పంలో తిరుపతి సీన్ రిపీట్ అవుతోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఇతర ప్రాంతాల నుంచి నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చింది వైసీపీ. ఫేక్ ఓటర్లను టీడీపీ నేతలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో జగన్ పార్టీ బండారం బట్టబయలైంది. వైసీపీ తీరుపై తిరుపతి ఓటర్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయినా వైసీపీ తీరు మాత్రం మారలేదు .ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతి తరహాలోనే అక్రమాలకు తెర తీసింది అధికార పార్టీ. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలో పాగా వేసేందుకు అధికార పార్టీ చేయాల్సిన అన్ని కుట్రలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. నామినేషన్ల పర్వం నుంచే అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు మరింతగా బరి తెగించారు. కుప్పంలో వైసీపీ నేతలు యథేచ్చగా అరాచకలకు పాల్పడుతున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు స్థానికేతరులను తరలిస్తున్నారు. కుప్పంలో పరిస్థితిని సమీక్షిస్తోన్న టీడీపీ నేత అమర్నాథ్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కుప్పంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. బయటి వ్యక్తులను కుప్పం నుంచి పంపకుండా టీడీపీ నేతలపైనే పోలీసులు జులుం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో ఓటర్లకు స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూ.. అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి.. పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. 23వ వార్డులో నాన్ లోకల్‌కు సంబంధించిన వ్యక్తులు వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్,ఆయన తల్లి మాజీ ఎంపీటీసీపై స్థానికేతర వైసీపీ ప్రచార వ్యక్తులు దాడి చేశారు.
http://www.teluguone.com/news/content/ycp-planing-to-fake-voters-in-kuppam-municipal-election-39-126366.html





