ఆత్మసాక్షి ’సాక్షి’గా ఏపీలో వైసీపీ’ అవుట్.. మూడ్ ఆఫ్ ఏపీ చెప్పిన సత్యం

Publish Date:May 23, 2022

Advertisement

ఇప్పటి కిప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏమవుతుంది?  అధికార వైసీపీ సీట్ల సంఖ్య సగానికి సగం తగ్గుతుంది. ప్రస్తుతమున్న 151 స్థానల్లో వైసీపీ కేవలం 75 నుంచి 77 స్థానాలు మాత్రమే నిలుపుకుంటుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 23 నుంచి ఇంచుమించుగా మూడు రెట్లు పెరుగుతుంది, 60 నుంచి 62 స్థానాల్లో  టీడీపీ విజయ కేతనం ఎగరేస్తుంది. గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న జనసేన ఈసారి 6 నుంచి 7 సీట్లు గెలుచుకుంటుంది. ఇతరులకు ఒక సీటు దక్కుతుంది.  మరో 18 నుంచి 21 స్థానాల్లో వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా నేనా, అన్న విధంగా గట్టి పోటీ ఉంటుంది. అంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నీ, ఎవరికీ వారు ఒంటరిగా పొటీ చేస్తే, హంగ్ అసెంబ్లీ అనివార్యమవుతుంది.
అవును, ఇది జోస్యం కాదు, శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ శాస్త్రీయంగా నిర్వహించిన సర్వే ఫలితమే.. అయిత అదేదో అంతగా ఊరు పేరు లేని అనామక సంస్థ చేసిన సర్వే ఫలితం కాదు. 2019 ఎన్నికలలో, వైసీపీకి  139 నుంచి 142,( వాస్తవంగా వచ్చింది 151)  టీడీపీకి 22 -28, ( వాస్తవంగా వచ్చింది 23) జనసేనకు 0-2 ( వాస్తవంగా వచ్చింది 1) సీట్లు వస్తాయని, ఎగ్జిట్ పోల్ ఆధారంగా, వాస్తవానికి దగ్గరగా ఫలితాలను పసిగట్టిన, అప్పటి ఆత్మ సాక్షి, ఇప్పటి శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్, నిర్వహించిన,  ‘మూడ్ ఆఫ్ ది ఏపీ’ తాజా సర్వే ప్రకారం 19.05.2022 నాటికీ రాష్టంలో ఉన్న రాజకీయ ముఖచిత్రం ఇది. 

శ్రీ ఆత్మ సాక్షి ( ఎస్ఎఎస్)  ఏదో సర్వే చేశాం అంటే చేశాం అన్నట్లు కాకుండా, ఇంచు మించుగా ఐదు నెలలలో ఐదు విడతల్లో క్షేత్ర స్థాయిలో, అన్ని వర్గాల ప్రజలను, మరీ ముఖ్యంగా అధికార పార్టీ ఆశలు పెట్టుకున్న ప్రభుత్వ పథకాల లబ్దిదారులను వ్యక్తిగతంగా కలిసి, 43 అంశాలకు సమబందించి  సేకరించిన ప్రజాభిప్రాయం అధాంగా శాస్త్రీయంగా నిర్వహించిన సర్వే ఫలితం. ఓటర్లను విభిన్న ప్రాతిపదికల ఆధారంగా  20 వర్గాలుగా విభజించి ప్రతి నియోజక వర్గంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను ప్రాధాన్యతా క్రమలో సేకరించి సర్వే నిర్వహించామని నిర్వాహకులు సర్వే ఫలితాల విడుదల సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.   

మరో వంక ముందస్తు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకున్న ప్రస్తుత పరిస్థితులలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజక వర్గాల్లో, నిర్వహించిన మూడ్ ఆఫ్ ఏపీ’ సర్వే వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, ఇప్పటికే అధికార పార్టీ బలాన్ని సగానికి సగం దించేసే స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత పవనాలు ఇంత బలంగా వీస్తున్నాయంటే, ఎన్నికల నాటికి పరిస్థితి మరింత దిగజారి, అధికార పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే, తెలుగు దేశం, జనసేన పొత్తు ఇంచుమించుగా ఖాయమైన నేపధ్యంలో, రెండు పార్టీల ఓటుతో పాటుగా తటస్థ ఓటు కలిస్తే, వైసీపీకి బొమ్మ కనిపించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

అదలా ఉంటే గత ఎన్నికలలో పోలిస్తే, వైసీపీ ఏకంగా నాలుగు శాతానికి పైగా (4.7 శాతం) ఓట్లను కోల్పోతోంది. 2019 ఎన్నికలలో ఇంచుమించుగా 50 ( 49.95) శాతం ఓట్లు పొందిన వైసీపీ ఓటు షేర్ ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే, 45.25 శాతానికి పడిపోతుంది. టీడీపీ ఓటు  షేర్, గత ఎన్నికలలో పోలిస్తే మూడు శాతానికి పైగా(3.48 శాతం) పుంజుకుని, 39.26 శాతం నుంచి 42.75 శాతానికి చేరుతుందని సర్వే సూచిస్తోంది. అదే విధంగా, జనసేన ఓటు షేర్ కూడా ఇంచుమించుగా రెండు శాతానికి పైగా (2.05 శాతం) వరకు పెరుగుతోంది.

గత ఎన్నికలో 6.7 శాతం ఓట్లు మాత్రమే పోలైన జనసేనకు, ఈసారి 8.75 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే స్పష్టం చేసింది. అంటే,సర్వే లెక్కల ప్రకారం చూస్తే, వైసీపే కోల్పోయే ప్రతి ఓటు, నేరుగా టీడీపీ లేదా జనసేన ఖాతాలో చేరుతోంది. అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటర్ల పై బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రభావం ఏమాత్రం ఉండదని సర్వే గణాంకాలు సూచిస్తున్నాయి. మరో వంక 1.75 శాతంగా ఉన్నఎటు పోతుందో తెలియని నిశ్శబ్ద ఓట ( సైలెంట్ ఓటు ఫోర్సు, ఎస్ఓపీ), బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల ఖాతాలో చేరే ఆయా పార్టీల సంప్రదాయ ఓటు (1.5శాతం)  కీలకంగా మారుస్తుంది శ్రీ ఆత్మ సాక్షి సర్వే సూచిస్తోంది .

సహజంగా, సైలెంట్ ఓటు, గెలిచే పార్టీ వైపు మొగ్గు చూపుతుంది.  సో .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి  పోటీ చేస్తే, వైసీపీ అధికారం కోల్పోవడమే కాదు, అసలు అడ్రస్ గల్లంతు అయినా ఆశ్చర్య పోనవసరం లేదని  విశ్లేషకులు పేర్కొంటున్నారు. శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ జిల్లాల వారీగా, ఎమ్మెల్యేల పనితీరును విశ్లేషించింది. 30 శాతం కంటే తక్కువ మార్కులతో సామర్ధ్య పరీక్షలో ఫెయిల్ అయిన ఏమ్మేలలో, కొత్త, పాత మంత్రులు కూడా ఓ 20 మది వరకు ఉన్నారని సర్వే చెపుతోంది.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.