వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. టీడీపీ ప్రతిపక్ష హోదా పోవడం ఖాయమా?

Publish Date:May 21, 2020

Advertisement

ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వైసీపీ మళ్లీ ప్రారంభించిందా? టీడీపీ ముఖ్య నేతలపై గురి పెట్టిందా? ఇప్పుడిదే టీడీపీలో చర్చనీయాంశమైంది. ఈ కరోనా కష్టకాలంలోనూ..  ప్రతిపక్ష టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీలను తమవైపు రాబట్టుకునేందుకు అధికారపార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ కి తెరలేపినట్లు సమాచారం. అయితే అధికారపార్టీ నేతల ప్రయత్నాలకు కొందరు టీడీపీ నేతలు బ్రేకులు వేస్తుండగా, ఒకరిద్దరు నేతలు మాత్రం మాటలు కలుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల పార్టీ మార్పు వ్యవహారంపై విస్తృత చర్చ నడుస్తోంది. విషయం తెలుసుకున్న టీడీపీ అధిష్ఠానం కూడా పార్టీ జిల్లా నాయకులకు ఫోన్లు చేసి మాట్లాడటం ప్రారంభించిందని సమాచారం.

ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, ఇతర ముఖ్య నాయకులను టీడీపీకి రాజీనామా చేయించి.. వైసీపీలో చేర్పించేందుకు ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ లకు వైసీపీ అధిష్టానం బాధ్యతలను అప్పజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొందరు టీడీపీ ముఖ్య నేతలు పార్టీ మారే ప్రసక్తే లేదని తెగేసి చెబుతుండగా.. మరి కొందరు మాత్రం అధికార పార్టీ నేతలతో మాటలు కలుపుతున్నారట. ముఖ్యంగా టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా ఆపరేషన్‍ ఆకర్ష్ ప్రారంభించారట. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కూడా వైసీపీలో చేర్పించేందుకు కరణం ప్రయత్నిస్తున్నారని వారితో ఆయన టచ్‍లో ఉంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ మాజీ ఎమ్మెల్యేలతో నిత్యం చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ప్రకాశం జిల్లాలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రధానంగా టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వివిధ వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో వీరిపై ఒత్తిడి ఉందంటున్నారు. మరోవైపు, ఎమ్మెల్యేల‌ పార్టీ మార్పుపై టీడీపీ అధిష్టానం కూడా అలెర్ట్ అయిందని, వారితో అధినేత మాట్లాడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మే 30 కి వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతుంది. మే 30 లోపు పార్టీలో చేర్చుకుని చంద్రబాబుకు ప్రతిపక్షనాయకుని హోదా లేకుండా చేయాల‌నే యోచనలో అధికారపార్టీ ఉందంటున్నారు. అందులో భాగంగానే ముందుగా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిందని అంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ 23 మందిలో ఇప్పటికే ముగ్గురు పార్టీ ఫిరాయించారు. మరో ముగ్గురు కనుక పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే చంద్రబాబుకు ప్రతిపక్షనాయకుని హోదాపోతుంది. దానికి జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముహూర్తంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. ఆరోజు టీడీపీ నుండి కొందరు నేతలు వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఇదంతా పధకం ప్రకారం వైసీపీ ఆడుతోన్న మైండ్‍ గేమ్‍ అని కూడా టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ పార్టీ మారేందుకు సిద్దంగా లేరని అంటోంది. మరి అధికార పార్టీ నిజంగానే ఆపరేషన్‌ ఆకర్ష్ కు తెరలేపిందా? ఆ ఆకర్ష్ కు టీడీపీ నేతలు ఆకర్షితులవుతారా? తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాలి.

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.