ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా బాబాయ్ కు ఇక కడలి ఈతే!

Publish Date:Aug 10, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ బాబాయి, టీటీడీ బోర్డ్   చైర్మన్  వైవీ సుబ్బారెడ్డికి త్వరలో బ్యాడ్ టైం స్టార్ట్ కానుందనే ఓ చర్చ అయితే ఉత్తరాంధ్రలోని పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోన్నట్లు తెలుస్తోంది. 

తిరుమలలో శ్రీవారి సేవ నుంచి ఉత్తరాంధ్రలో వైసీపీ సేవకు వెళ్లేందుకు వై వీ సుబ్బారెడ్డి ముహుర్తం ఖరారు చేసుకొన్నట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా ఆయన పదవి కాలం ఆగస్టు 12తో ముగియనుందని.. దీంతో ఆ వెంటనే... లేదా అమావస్య వెళ్లిన తర్వాత అంటే.. ఆగస్ట్ 17వ తేదీన ఆయన.. తన మకాంను ఉత్తరాంధ్రకు మార్చేయనున్నారనే  చర్చ అయితే  ఆ సర్కిల్‌లో కొనసాగుతోంది. 

ఆ క్రమంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ఆయన  రాజకీయాలపై ఆయన పూర్తిగా ఫోకస్ చేయనున్నారని చర్చ సైతం హల్‌చల్ చేస్తోంది. 

అయితే ఉత్తరాంధ్ర రాజకీయం అంటే  ఆషామాషీ వ్యవహారం కాదని..  ఇప్పటి వరకు తిరుపతిలో లడ్డు, వడ, చక్ర పొంగలి తరహా ప్రసాదాల కోసమో, శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కోసమో, వీఐపీలకు శ్రీవారి దర్శనం కోసమో, ప్రోటోకాల్‌ తదితర అంశాల సిఫార్సు లేఖలు శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ... లేదా.. తిరుమల కొండల చుట్టూతా మాత్రమే ఉంటాయని.. కానీ ఉత్తరాంధ్ర రాజకీయం అంటే మాత్రం లెక్కపక్కా గా ఉంటుందని.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే సదరు ప్రాంతంలో రాజకీయం అంటే పైకి అంతా ఠండా ఠండా కూల్ కూల్ అన్నట్లుగా ఉన్నా.. సదరు జిల్లాల రాజకీయంతో వైవీ సుబ్బారెడ్డి తల బొప్పి కట్టడం మాత్రం ఖాయమ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది.
ఎందుకంటే 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ తల్లి వైయస్ విజయమ్మను ఎన్నికల బరిలో దింపగా... ఆమె ఓటమి పాలైయ్యారని.. ఇక 2019 ఎన్నికల్లో అదీ కూడా ఈ జగన్ వేవ్‌లో విశాఖ ఎంపీ స్థానం ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడినా.. విశాఖపట్నం నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రం సైకిల్ పార్టీ ఖాతాలోకి ఎగిరి పడ్డాయని... మరి వచ్చే ఎన్నికల్లో ఈ మొత్తం స్థానాలు.. హోల్ సేల్‌గా జగన్ పార్టీ ఖాతాలో పడతాయా? అనే ప్రశ్న సైతం ఉత్పన్నమవుతోన్నట్లు తెలుస్తోంది. 


అదీకాక ఇటీవల విశాఖ ఎంపీ, ఫ్యాన్ పార్టీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైందని... ఈ నేపథ్యంలో సదరు ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇక్కడ మాత్రం వ్యాపారం చేయలేనని.. పక్కా రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేసుకొంటానంటూ ప్రకటించేశారని... అదికార పార్టీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యడి పరిస్థితి ఏమిటనే ఓ ప్రశ్న అయితే ఉత్పన్నమైందని ...ద తో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఈ సందర్బంగా తీవ్ర చర్చకు వచ్చినట్లు  సదరు సర్కిల్‌లో ఓ చర్చ వైరల్ అవుతోంది. 
  
ఇక ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ప్యాన్ పార్టీ కీలక నేత పంచకర్ల రమేష్ బాబు ఇప్పటికే అధికార పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాం రాం చెప్పేసి.. మరో పార్టీలోకి వెళ్లీపోయారని.. దీంతో ఉత్తరాంధ్రలోని పలువురు ఫ్యాన్ పార్టీ నేతలు.. పంచకర్ల దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయని ఓ చర్చ సైతం వాడి వేడిగా కొన... సాగుతోంది. 

అలాగే సిక్కోలు జిల్లాలోని ఫ్యాన్ పార్టీలో రేగిన అసమ్మతి సెగ.. నివ్వురుగప్పిన నిప్పులా ఉందని.. సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో వర్గ పోరు తారస్థాయికి చేరిందని.. అలాగే టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా తొలుత దువ్వాడ శ్రీను పేరును గతంలో సీఎం జగన్ స్వయంగా ప్రకటించారని.. ఆ తర్వాత అతడి భార్య దువ్వాడ వాణి పేరు తెరపైకి వచ్చిందని.. అయితే ఇటీవల దువ్వాడ వాణి బూతు పురాణం తాలుక ఆడియో టేపులు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయని.. అలాగే పలాస ఎమ్మెల్యే ప్లస్ మంత్రి సిదిరి అప్పలరాజు వ్యవహారశైలిపై నియోజకవర్గ ప్రజలే కాదు.. జిల్లా ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలుస్తోంది. ఇక పాతపట్నంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కారణంగా.... నియోజకవర్గంలో రేగిన ఆశాంతి అంతా ఇంతా కాదని సదరు వర్గంలో ఓ చర్చ అయితే నడుస్తోంది. ఇక విజయనగరం జిల్లాలో కూడా దాదాపుగా ఇటువంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయనే ఓ ప్రచారం సైతం ఫ్యాన్ పార్టీలో రంజు రంజుగా నడుస్తోంది.   

మరోవైపు టీటీడీ చైర్మన్‌గా సోమవారం అంటే ఆగస్టు 7వ తేదీన పాలక మండలి అధ్యక్షుడి హోదాలో వైవీ సుబ్బారెడ్డి చిట్ట చివరి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ హోదాలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డిని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న భూమన కరుణాకర్ రెడ్డి చేతులు మీదగా ఘనంగా సత్కారించారు. 

అయితే ఇప్పటి వరకు టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా ఉంటూ.. మరోవైపు ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్‌గా వైవీ సుబ్బారెడ్డి వ్యవహరించిన తీరు వేరని.. కానీ ఆయన ప్రస్తుతం టోటల్‌గా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జ్‌గా వ్యవహరించి.. ఈ ప్రాంతంలో సీట్లన్నీ ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడేలా కసరత్తు చేయాలని.. అయితే సదరు జిల్లాల్లో ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం తేడా కొట్టినా.. సదరు బాబాయి గారి వీపు విమానం మోత మోగడం ఖాయమనే ఓ చర్చ సైతం ఉత్తరాంధ్ర పోలిటికల్ సర్కిల్‌లో కొనసాగుతోంది. ఏది ఏమైనా.. ఇప్పటి వరకు టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా బాబాయి వై వీ సుబ్బారెడ్డి చాలా ఆరామ్‌గా గడిపేశారనీ, కానీ తాజాగా ఆయనకు బ్యాడ్ టైం స్టార్ అయిందనే ఓ చర్చ సైతం ఉత్తరాంధ్ర పోలిటికల్ సర్కిల్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

By
en-us Political News

  
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.