వైసీపీ నుంచి వలసల వరద.. గేట్లెత్తేసినట్లేనా?

Publish Date:Aug 11, 2023

Advertisement

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆశావహులు పార్టీలు మారడం అత్యంత సహజమైన అంశం. అయితే, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే నేతల పార్టీల మార్పు భారీగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే వచ్చిన కొన్ని సర్వేల ఫలితాలు, ప్రతిపక్ష నేతల రోడ్ షోలకు సభలకు తండోపతండాలు వస్తున్న జనాలను చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో క్లియర్ కట్ గా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఈసారి వైసీపీ నుండి భారీగా వలసలు ఉండడం గ్యారంటీగా కనిపిస్తున్నదని రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తుంది. ఒక్కో నియోజకవర్గంలో పడకేసిన అభివృద్ధితో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉండగా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సరైన సమయం కోసం చూస్తున్నారని . ఒక్కసారి ఎన్నికల మూడ్ మొదలైతే వీరంతా పొలోమని వలసలు మొదలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. 

వైసీపీ నుండి బహిష్కరణకు గురైన నలుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరడం ఖరారైనట్లే. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి ఇప్పటికే సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలవగా నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర బాధ్యతలను కూడా చూసుకున్నారు. ఇ దే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా లోకేష్ పాదయాత్రలో పాల్గొనగా.. మేకపాటి ఈసారి టీడీపీ నుండి ఉదయగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే అని కూడా లోకేష్ ప్రకటించారు. మరోవైపు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీ నేతలతో టచ్ లోనే ఉన్నారు. కాగా, ఇప్పుడు తాజాగా మరో బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏకంగా గుంటూరు నుండి ఉత్తరాంధ్రకి వెళ్లి మరీ చంద్రబాబును కలిసిన శ్రీదేవి లోకేష్ పాదయాత్ర తన నియోజకవర్గంలోకి వచ్చే సమయానికి తన కార్యాచరణ ప్రకటిస్తానని కూడా చెప్పారు.

కాగా వైసీపీ ఈ నలుగురు ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు సందర్భంగా ఇంకా ఇటువంటి వారు 56 మంది వరకూ ఉన్నారని పార్టీ వర్గాలలోనే గట్టిగా చర్చ జరిగింది. కచ్చితంగా సంఖ్య ఇదీ అని చెప్పకుండా ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పార్టీలో అసంతృప్తుల గురించి ప్రస్తావించారు. సరే వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురి దారి తెలుగుదేశం పార్టీ వైపే అని తేలిపోయింది. ఇక ఇప్పుడు పార్టీలో అసంతృప్తులుగా ఉన్నారని చెబుతున్న మిగిలిన 56 మంది పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వైసీపీ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్నారు. వారంతా కూడా పార్టీని వీడటం ఖాయమేనా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈసారి  వైసీపీకి భారీ ఝలక్ తప్పేలా లేదు. ఇప్పటికే టీడీపీలో ఉన్న మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నారాయణలతో పాటు ఇప్పుడు సీనియర్లు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తోడైతే జిల్లాలో  వై ఎట్ లీస్ట్ వన్ సీట్ అన్న పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికలలో ఈ జిల్లాలో పది పది స్థానాలలో వైసీపీ విజయం సాధించింది.   కావలి నుండి బీద రవిచంద్ర తన సతీమణిని రంగంలోకి దింపనుండడం.. సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ పై అసంతృప్తితో ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఆయనను దూరం పెట్టడం అన్నీ వెరసి ఇక్కడ ఈసారి టీడీపీ ఉమ్మడి జిల్లాను క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పార్టీకి దగ్గరైన ముగ్గురితో పాటు మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీతో టచ్ లో ఉన్నట్లు ఇప్పటికే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు.

ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన సిద్దా రాఘవరావు, ఆయన తనయుడు సుధీర్, మరో నేత కదిరి బాబురావు ఇప్పటికే టీడీపీతో టచ్ లోకి వచ్ాచరు. వారు ఇక కండువా కప్పుకోవడమే తరువాయి అంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కలిపిన కందుకూరు నుండి ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉండగా అసలు జిల్లాకే పెద్దన్నయ్య పాత్ర పోషించిన బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీయే పొమ్మనలేకపోగ బెట్టడంతో ఆయనా ఆంటీ ముట్టనట్లే ఉంటున్నారు. గిద్దలూరు ఆనం రాంబాబుకు అధిష్టానమే టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా ఇచ్చినా ఆయన గెలిచే పరిస్థితి లేదని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. చీరాల నుండి ఆమంచి తన సోదరుడిని ఇప్పటికే జనసేనకు పంపగా.. తాను కూడా సరైన సమయం కోసం చూస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సీనియర్ నేత కరణం బలరాం మళ్ళీ టీడీపీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నట్లు జిల్లా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

ఇక, ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలలో అయితే వైసీపీ నుండి భారీగా వికెట్లు పడడం గ్యారంటీగా కనిపిస్తున్నది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే లాంటి వారే ఈ మధ్య పత్తా లేకుండా పోగా.. ఉండవల్లి శ్రీదేవి, వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే టీడీపీకి టచ్ లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారితో సహా మరో ఏడెనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఉత్తరాంధ్ర నుండి కూడా ఈసారి భారీగా వలసలు ఉండే అవకాశం ఉంది. శ్రీవాణి, అప్పల నాయుడు, అప్పల నరసయ్య, వీరభద్రస్వామి, గొల్ల బాబురావు, ఉమా శంకర్ గణేష్ ఇలా చాలా పేర్లు వలసల జాబితాలో వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి అవంతి పార్టీ జంప్ చేసినా ఆశ్చర్యం లేదన్నది ఉత్తరాంధ్ర రాజకీయాలలో ఆసక్తికరంగా వినిపిస్తున్న మాట.

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.