తండ్రి కడసారి చూపుకోసం వచ్చిన ముద్రగడ కుమార్తెను అడ్డుకున్న వైసీపీయులు.!

Publish Date:Jul 15, 2026

Advertisement

కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు అయితే..  ఆయన స్వగ్రామమైన కీర్లంపూడిలో  మాత్రం రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కడసారిగా ముద్రగడ భౌతికకాయాన్ని దర్శించుకుని నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆయన కుమార్తె క్రాంతిని, వైసీపీకి చెందిన కొందరు అడ్డుకోవడంతో  గందరగోళ వాతావరణం నెలకొంది. అంత్యక్రియల సమయంలో ఆయన కుమార్తెను అడ్డుకోవడం పట్ల స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

గత కొన్నేళ్లుగా తండ్రి ముద్రగడ పద్మనాభం, కుమార్తె క్రాంతి మధ్య రాజకీయపరంగా   విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ముద్రగడ వైసీపీలో  క్రియాశీలకంగా కొనసాగగా, ఆయన కుమార్తె క్రాంతి మాత్రం జనసేన  కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో గతంలో తండ్రి వైఖరిపై ఆమె బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో వీరిద్దరి మధ్య రాజకీయ విభేదాలు పీక్స్ కు చేరాయి. తండ్రి మరణవార్త  తెలియగానే ఆమె కుమార్తె క్రాంతి..  తండ్రి కడసారి చూపు కోసం కీర్లంపూడిలోని   నివాసానికి చేరుకోగానే అక్కడున్న వైసీపీ మద్దతుదారులు ఆమె లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. క్రాంతికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గతంలో తండ్రి రాజకీయ విధానాలను, ముద్రగడను తీవ్రంగా విమర్శించిన క్రాంతికి, ఇప్పుడు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించే నైతిక అర్హత లేదని వారు వాదించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కీర్లంపూడిలోని ముద్రగడ నివాసం ప్రాంగణం నిరసనలకు వేదికైంది. కడసారి చూపు కోసం వచ్చిన కుమార్తెను అడ్డుకోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, ఒక బిడ్డగా తండ్రికి చివరిసారిగా వీడ్కోలు పలికే హక్కు ఆమెకు ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు   రంగ ప్రవేశం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరసనకారులను పక్కకు నెట్టివేస్తూ, క్రాంతికి  రక్షణ కల్పించారు. పోలీసు బలగాల పర్యవేక్షణలో ఆమెను సురక్షితంగా ముద్రగడ భౌతికకాయం ఉంచిన ప్రదేశానికి తీసుకెళ్లారు. తీవ్ర భావోద్వేగానికి గురైన క్రాంతి, కన్నీటి పర్యంతమవుతూ తన తండ్రికి చివరి నివాళులర్పించారు. 

గతంలో ముద్రగడ అనారోగ్య సమస్యలపై క్రాంతి చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి. తన తండ్రి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని, ఇంట్లో ఆయనకు సక్రమమైన సంరక్షణ జరగడం లేదని ఆమె ఆరోపించగా, ముద్రగడ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ అంశాలు సైతం రాజకీయ రంగు పులుముకోవడంతో తండ్రీకూతుళ్ల నడుమ దూరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ముద్రగడ మరణాంతరం కూడా ఆయన మద్దతుదారులు ఆ పాత పగలను, రాజకీయ వైరాన్ని మనసులో ఉంచుకుని క్రాంతి పట్ల నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలపై అటు జనసేన, ఇటు వైఎస్సార్సీపీ శ్రేణులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత విషాదకరమైన అంత్యక్రియల సమయంలో ఇలాంటి రాజకీయ ఘర్షణలకు తావు ఇవ్వడం సరికాదని పరిశీలకులు అంటున్నారు. 

Mudragada Padmanabham Death Kirlampudi, Andhra Pradesh Kapu Leader Mudragada, YSRCP Janasena Political Dispute Mudragada

By
en-us Political News

  
లో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు.
భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు.
ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.