వైసీపీలో అంతర్గత వైషమ్యాలు, కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీలో రెండు వర్గాలు రోడ్డున పడి కొట్టుకున్నాయి. వైసీపీ మహిళా కార్యకర్తలైతే జుట్టూ జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇక పురుష క్యాడర్ చొక్కాలు చించుకుని మరీ వీరంగమాడారు. ఈ గొడవ ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ కార్యాలయం సాక్షిగా, అదీ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జరిగింది. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కాళ్లు తొక్కుతున్నారంటూ కొంతమంది పురుష క్యాడర్ ను నిలదీశారు. దీంతో అక్కడ రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలతో దాడులకు పాల్పడ్డారు. మహిళలు జుట్టూజుట్టూ పట్టుకుని కొట్టుకుంటే... పురుషులు చొక్కాలు చించుకున్నారు. దీంతో ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో గందరగోళం ఏర్పడింది. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఘర్షణకి దిగడం చర్చనీయాంశంగా మారింది.
YSR, Birth Anniversary, Ongole, Groups, Quarrel
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-members-clashed-in-public-25-225403.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.