ఉత్తరాంధ్ర వైసీపీలో ఎవరికి వారే యమునా తీరే!

Publish Date:Apr 22, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముఖద్వారంగా భావించే ఉత్తరాంధ్రలో  వైపీపీ ప్రభ పూర్తిగా మసకబారింది. గతంలో ఈ ప్రాంతంపై   పట్టు సాధించిన వైసీపీ ప్రస్తుతం చతికిలపడింది. పొలిటికల్ గా ఉత్తరాంధ్రలో ఆ పార్టీ ఇసుమంతైనా ప్రభావం చూపలేని పరిస్థితులకు దిగజారింది.   గత ఎన్నికలలో ఓటమి తరువాత ఆ పార్టీ ఉత్తరాంధ్ర నేతలలో అంతర్గతవిభేదాలు ఈ ప్రాంతంలో పార్టీ కుదేలయ్యేలా చేశాయి.  

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో  పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత  స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు. దీంతో ఆయన చేసేదేం లేక చేతులెత్తేసి విశాఖ నగరానికే పరిమితమయ్యారు. 
 
శ్రీకాకుళం జిల్లాలో  వైసీపీ పూర్తిగా ధర్మాన సోదరులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వంటి నేతలను స్థానిక నాయకత్వమే పక్కన పెట్టింది. ఇందుకు విరుద్ధంగా, కింజరాపు కుటుంబం నేతృత్వంలో టీడీపీ జిల్లా వ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. జనసేన మద్దతు కూడా తోడవడంతో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఇక పుంజుకోవడం కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అదే విధంగా విజయనగరంలోనూ వైసీపీ కుదేలైంది. ఒకప్పుడు జిల్లాపై గట్టి పట్టున్న బొత్స సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో  పార్టీ ముక్కలు ముక్కలుగా చీలిపోయి వర్గపోరు పరాకాష్టకు చేరుకుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  కాగా జిల్లాలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఐక్యంగా పని చేస్తుండటంతో జిల్లాలో కూటమి బలం పెరిగింది.  

 ఇక విశాఖ జిల్లాలో వైసీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. అక్కడ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు గుడివాడ అమర్నాథ్ కు పార్టీ అధిష్టానం ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. ఇక మిగిలిన స్థానిక నేతలు కూడా పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో జిల్లాలో వైసీపీ పరిస్థితి ఉండీ లేనట్లుగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏ రకంగా చూసినా  ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో వైసీపీ వర్గపోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కీలక నేతల మధ్య ఉన్న విభేదాలు, సమన్వయ లేమి కారణంగా ఆ పార్టీ క్యాడర్ నిస్తేజంగా మారిపోయింది.   తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే ఈ ప్రాంతంలో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.