జగన్.. పదవి పోయింది.. పార్టీ పొమ్మంటోంది!

Publish Date:Aug 5, 2024

Advertisement

కేవలం ముఖ్యమంత్రి కావాలన్న  లక్ష్యంతోనే జగన్ రాజకీయ ప్రవేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జగన్ ను ఆయన తండ్రి స్థానంలో సీఎం పదవిలో కూర్చోపెట్టేందుకు అంగీకరించని ఒకే ఒక కారణంతో ఆయన సొంత కుంపటి వైసీపీని ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీ అధ్యక్షుడిగా ఆయన అనుక్షణం ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలన్న ఏకైక లక్ష్యంతో పని చేశారు. తొలి ప్రయత్నంలో విఫలమైనా, మలి ప్రయత్నంలో అంటే 2019 ఎన్నికలలో ఆయన ఆ లక్ష్యాన్ని సాధించగలిగారు.

ఇక ఆ క్షణం నుంచి ఆ పదవిలో తాను శాశ్వతంగా ఉంటానన్న భ్రమలలోనే గడిపారు. సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యానికి ఒక రాజు, ఏం అనుకుంటే అది చేసేయచ్చు. నచ్చిన వాళ్లు తప్ప మరెవరూ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు అన్నట్లుగా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. అంతే కాదు.. పార్టీలో కూడా తానే సర్వాధికారి అని భావించారు. ఎవరైనా తన అధికారాన్ని ప్రశ్నిస్తారన్న భయంతోనే పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఒక తీర్మానాన్ని కూడా పార్టీతో ఆమోదింపచేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానంటూ ఆయన పంపిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం తోసి పుచ్చింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లు బాటు కాదని విస్పష్టంగా తేల్చేస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క వైసీపీ అనే కాదు ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత పదవులు అనేవి ఉండవని పేర్కొంది.  దీంతో  అప్పట్లో ప్లీనరీ వేదికగా వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు పార్టీ రాజ్యాంగాన్ని కూడా సవరించి మరీ  చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. పార్టీ ఆరంభించిన క్షణం నుంచీ కూడా జగన్ కు తన అధ్యక్ష పదవిని ఎవరైనా తన్నుకుపోతారేమోనన్న భయమే పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తానే ఉండాలన్న నిర్ణయం తీసుకునేందుకు కారణమైంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ రెండేళ్ల కోసారి పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు కేసి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ నింబంధనను వైసీపీ ఎన్నడూ పాటించకపోయినా, పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని ఈసీ విస్పష్టంగా  తేల్చేసింది.

ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటారా? తన పార్టీ చెప్పుచేతల్లో ఉంటుందో ఉండదో, సీఎం పదవి ఎల్లకాలమూ తానే పట్టుకు వేళాడగలుగుతానో లేదో అన్న భయం జగన్ కు తొలి నుంచీ ఉందని చెప్పడానికే..   పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా తన ఎన్నిక అనే లాంఛనాన్ని పూర్తి చేసుకుని, ఆ తరువాత అధికార బలంతో తిమ్మిని బెమ్మిని చేసైనా ఎన్నికల గండాన్ని దాటేసి సీఎంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి జగన్ తన శాయశక్తులా ప్రయత్నించారు. అయితే ఆయన ప్రయత్నాలను 2024 ఎన్నికలలో జనం తిప్పి కొట్టారు. ముఖ్యమంత్రిగానే కాదు, కనీసం విపక్ష నేతగా కూడా తగవు అంటూ వైసీపీకి ఘోర ఓటమిని కట్టబెట్టారు. సరే సీఎం పదవి ఎలాగూ లేదు.. కనీసం వైసీపీ అధినేతగానైనా ఉంటారా అంటే పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆ అవకాశం కూడా లేదని అనిపిస్తోంది. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ సీనియర్ నేతలంతా దాదాపుగా సైలెంట్ అయి పోయారు. చాలా మంది తన ఆనుపానులు కూడా అధినేతకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే దాదాపుగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.

ఇక యువనేతలైతే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జగన్ తీరుపై, వ్యవహార శైలిపై, అహంకార పూరిత వైఖరిపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ ఓటమి తరువాత తొట్టతొలిగా జక్కంపూడి రాజా మొదట్లోనే జగన్ తీరుపై  విమర్శలు గుప్పించారు. ఆయన తీరు కారణంగా తాను నిండా మునిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తరువాత రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు మార్గాని భరత్ జగన్ వ్యవహారశైలిని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. మద్యం విధానం లోపభూయిష్టంగా తయారవ్వడానికి, తప్పులు జరగడానికి జగన్ అజ్ణానమే కారణమన్న అర్ధం వచ్చేలా మీడియా సమావేశంలో మాట్లాడారు. అదే కోవలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి,  ధర్మవరం   మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు జగన్ కారణంగా తమ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడిందని బాహాటంగానే చెబుతున్నారు. మొత్తం మీద జగన్ పై పార్టీలో తిరుగుబాటు మొదలైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ తిరుగుబాటు రానున్న రోజులలో మరింత ఉధృతం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

వైసీపీలో మెజారిటీ నేతలు, కార్యకర్తలు జగన్ తీరుపై అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాకు ఎక్కే పరిస్థితి నెలకొంది. దీంతో పార్టీ నుంచి జగన్ ను బహిష్కరించి కొత్త నేతను ఎన్నుకుంటారా? లేక వైసీపీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలలోకి చేరుతారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా వరకూ వైసీపీ నేతలకు జగన్ తీరు, ఆ తీరును సమర్ధించిన కారణంగా ఇతర పార్టీలలోకి ఎంట్రీ లేకుండా పోవడంతో వైసీపీనే జగన్ కు దూరం చేయాలన్న దిశగా ఆలోచిస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. 

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.