షర్మిల షాక్ తో  వైసీపీలో వణుకు మొదలైందా?

Publish Date:Jan 5, 2022

Advertisement

ఒకప్పుడు ఆమె జగనన్న వదిలిన బాణం, కానీ, ఆమె ఇప్పుడు కాదు. ఇద్దరి మధ్య దూరం పెరగడమే కాదు, అగాధమే ఏర్పడిందని అంటున్నారు.అన్న జగన్ చెల్లీ షర్మిల మధ్య సాగుతున్నది అస్తుల తగువే కావచ్చును. కానీ, అది అక్కడితో ఆగలేదు. రాజకీయ విద్వేషంగా మారిన సంకేతాలు స్పష్టమవుతున్నాయి. నిజా నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, అన్నా చెల్లలి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొందనే వార్తలు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. అంతే కాదు, జగన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిలా పావులు కడుపుతున్నారని, అన్న ఓడించడమే లక్ష్యంగా ఆమె ఏపీలోనూ కాలుపెట్టే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. 

ఈ నేపధ్యంలో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ... ఎపీలోనూ పార్టీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన సంకేతాలు, వైసీపీ నేతలను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. ఆమె ఇంకా పార్టీ పెడతాను అని అనలేదు. అందుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన ఏదీ చేయలేదు.ఇటీవల ‘క్రిస్మస్’ సందర్భంగా ఇడుపులపాయ వేదికగా, అన్నా, చెల్లీ మధ్య తెరపై కొచ్చిన ఆస్తుల తగవు  నేపధ్యంగా, విలేకరుల సమావేశంలో ఏపీలో పార్టీ పెడతారా అని అడిగిన  ప్రశ్నకు సమాధానంగా..షర్మిల రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎక్కడైనా పెడతాం.. అక్కడ పెట్టకూడదని ఏమైనా రూల్‌ ఉందా అంటూ, మర్మగర్భంగా ప్రశ్నకు ప్రశ్ననే సమాధానంగా ఇచ్చారు. అయినా, అంతమాత్రానికే, వైసేపీ నాయకులు కలవర పడి పోతున్నారు. కంగారు పడుతున్నారు. షర్మిలపోటీకి దిగితే, జగన్ రెడ్డి ప్రధాన ఓటు బ్యాంకులో చీలిక వస్తుంది. అందుకే, షర్మిల పార్టీ ప్రస్తావన రాగానే వైసేపీలో కలకలం మొదలైంది. 

ఈనేపధ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆసక్తికరంగా మారాయి. వైఎస్‌ షర్మిల ఎవరైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఏపీలో పార్టీ పెడతానని షర్మిల చెప్పలేదని బాలినేని అన్నారు. అదంతా అసత్య ప్రచారం అంటూ తేలిగ్గా కొట్టేశారు. అంతవరకు ఓకే అయితే.. అయితే, అదే సమయంలో, మంత్రి బాలినేని, పాత చుట్టరికాలను పైకి తెచ్చారు. “షర్మిల వేరు మేము వేరు కాదు. మేమంతా ఒక్కటే కుటుంబం,  వైయస్సార్ కుటుంబం” అంటూ వ్యాఖ్యనించారు. 
అంటే, షర్మిల నిజంగానే, ఏపీలోనూ సొంత పార్టీ పెడితే, ఏమి జరుగుతుందో, అన్న భయం   వైసేపీ నాయకుల్లో మొదలైందని అనుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అందుకే, చుట్టరికాన్ని అడ్డు పెట్టుకుని, షర్మిలను బుజ్జగించే ప్రయత్నాలకు మంత్రి బాలినేని శ్రీకారం చుట్టారని అంటున్నారు. 

ఇక షర్మిల ఏపీలోనూ పార్టీ ఏర్పాటు చేస్తారా? రక్త సంబంధాన్ని కాదని జగన్ రెడ్డిని దెబ్బ తీయడమే లక్ష్యంగా పని చేస్తారా?అంటే , రాజకీయాల్లో రక్త సంబంధాలు పని చేయవని, అందుకు, జగన్ రెడ్డే సాక్షమని అంటున్నారు. అయన జైల్లో ఉన్న రోజుల్లో పార్టీని  బతికించింది, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల. షర్మిల పాదయాత్రతోనే వైసీపీ బతికి నిలిచింది. అయినా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి జరిగిందో.. ఏమి జరుగుతోందో కళ్ళముందే కనిపిస్తోంది. సో ... రాజకీయాల్లో ఎవరికి ఎవరూ ఏమీ కారు .. అధికారమే ముఖ్యం, అంటారు. అదే మరో మారు రుజువుతోంది.

By
en-us Political News

  
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.