చర్య తీసుకోవాలా వద్దా? గోరంట్ల మాధవ్ విషయంలో వైసీపీ మల్లగుల్లాలు

Publish Date:Aug 4, 2022

Advertisement

ఏదో సినిమాలో లవ్ చేయాలా వద్దా అని ఓ పాట ఉంది. హీరోయిన్ ను ప్రేమించాలా వద్దా అన్న సందిగ్ధంలో హీరో ఆ పాట పాడతాడు. కానీ ఇప్పుడు వైసీపీ కూడా ఒక సందిగ్ధంలో ఉంది. అది సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయిన దగుల్బాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకోవాలా వద్దా అన్నదే ఇప్పుడు వైసీపీ సందిగ్ధత. మహిళలో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయిన ఎంపీ మాధవ్ ను క్షణం ఆలస్యం చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, చర్య తీసుకోవాలా, తీసుకుంటే ఏ చర్య తీసుకోవాలి అంటూ గురువారం(ఆగస్టు4) సాయంత్రం నుంచి  వైసీపీ అధినేత జగన్ మల్ల గుల్లాలు పడుతున్నారు.

పార్టీ సీనియర్లతో మాధవ్ పై చర్య తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలాంటి చర్య తీసుకోవాలి అని ఎడతెగకుండా చర్చిస్తున్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించి దొరికిపోయిన గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకునే విషయంలో ఇంతగా తర్జన భర్జన పడుతున్న వైసీపీ అధినేత జగన్.. తనపైనా, తన సర్కార్ పైనా సామాజిక మాధ్యమంలో విమర్శిస్తూ పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయించే విషయంలో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  తొలుత సీఎంవో నుంచి గోరంట్ల మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు లీకులు ఇచ్చారు.

మళ్లీ కొద్ది సేపటికే ఆయన చేత రాజీనామా చేయించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అది కూడా ఖరారు కాలేదు. అసలు చర్య తీసుకోవాలా వద్దా అన్న విషయంపైనే జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోగా ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియా ముందుకు వచ్చి.. గోరంట్లపై చర్య తీసుకోవాలా వద్దా అన్ని నిర్ణయానికి ఇంకా రాలేదనీ, ఆయన ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఖండించారనీ, మార్ఫింగ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారనీ చెప్పారు. ఒక వేళ ఆ వీడియో మార్ఫింగ్ కాలేదని తేలితే మాధవ్ పై కఠిన చర్యలు తప్పవని మీియా ముందు సజ్జల చెప్పారు.  పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని తొలుత నేతలు లీకులిచ్చారు. అయితే మాధవ్‌తోనే రాజీనామా చేయించాలని కొందరు నేతలు సూచించారనీ, దాంతో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.

 కాగా ఎంపీ గోరంట్ల మాధవ్ఓ మహిళ తో గోరంట్ల న్యూడ్ గా వీడియో కాల్ లో మాట్లాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమం ద్వారా వెలుగులోనికి రావడంతో ఆయన పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి  తెలిసిందే. గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లు కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి దొరికిపోయిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలకు మహిళల పట్ల గౌరవం లేదనడానికి గతంలో అంబటి, అవంతి శ్రీనివాస్ లు, ఇప్పుడు గోరంట్ల మాధవ్ లే నిదర్శనమని సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.