రాజకీయాల్లోకి నా కుటుంబాన్ని లాగొద్దు: కొడుకు పోటీపై అక్బరుద్దీన్ క్లారిటీ.!

Publish Date:Oct 9, 2026

Advertisement

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగవద్దని స్పష్టం చేశారు. చాంద్రాయణగుట్ట నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్నది జమాత్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. జమాత్ పోటీ చేయాలని ఆదేశిస్తే బరిలోకి దిగుతానని, వద్దని చెబితే ఆ నిర్ణయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు. తన కుమారుడు చాంద్రాయణగుట్ట నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారంపైనా అక్బరుద్దీన్ స్పందించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో ప్రచారం చేసినవారే.. ఇప్పుడు తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తన కుమారుడు ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడని, అక్కడే కొనసాగుతాడని తెలిపారు. తన రాజకీయాలతో కుటుంబ సభ్యులకు సంబంధం కల్పించవద్దని కోరారు.

తన రాజకీయ భవిష్యత్తుపై వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోనని, జమాత్ సూచనల మేరకే ముందుకు వెళ్తానని అక్బరుద్దీన్ పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో చాంద్రాయణగుట్ట నుంచి ఆయన మరోసారి పోటీ చేస్తారా? లేదా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మరోవైపు, తన సేవా కార్యక్రమాల గురించి కూడా అక్బరుద్దీన్ కీలక విషయాలు వెల్లడించారు. తన కుమార్తె వివాహానికి ముందే స్థానిక అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. వారి భవిష్యత్తుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పిల్లల బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.2 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.

ఏ ఒక్క వ్యక్తి చేసిన తప్పు కారణంగా మొత్తం పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించడం సరికాదని అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. వ్యక్తుల చర్యలను మొత్తం పార్టీకి ఆపాదించకూడదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచింది తన నిజాయితీతోనేనని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాలు, జమాత్ సూచనలకు అనుగుణంగానే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.మొత్తంగా, తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారంపై అక్బరుద్దీన్ స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తుపై జమాత్ నిర్ణయమే కీలకమని వెల్లడిస్తూ.. తన కుటుంబాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని స్పష్టమైన సందేశం ఇచ్చారు.

 

 

 

[ Akbaruddin Owaisi, AIMIM, AIMIM MLA, Akbaruddin Owaisi Latest News, Chandrayangutta, Akbaruddin Owaisi Son, Political Entry, Telangana Politics, Hyderabad Politics, Jamaat Decision, AIMIM Politics, Akbaruddin Owaisi Statement, Election News, Orphan Children, Rs 2 Crore Donation, Telangana News ]
 

By
en-us Political News

  
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.