నందిగం సురేష్ అరెస్ట్.. పరారీలో జోగి రమేష్, దేవినేని అవినాష్

Publish Date:Sep 5, 2024

Advertisement

వైసీపీ నేతలు తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అరాచకాలు, పాల్పడిన అక్రమాలు, దౌర్జన్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో అరెస్టు అనివార్యం అని గ్రహించి అజ్ణాతంలోకి వెళ్లిపోవాలని నందిగం సురేష్ చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత అరెస్టు చేసి మంగళగిరికి తీసుకువచ్చారు.

అంతకు ముందు నందిగం సురేష్ కోసం ఆయనే నివాసానికి వెళ్లిన పోలీసులకు ఆయన పరారైపోయారని అర్ధమైంది. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి మరీ నందిగం సురేష్ పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు విఫలయత్నం చేశారు. నందిగం సురేష్ హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆయనను అరెస్టు చేసి విచారణ నిమిత్తం మంగళగిరికి తీసుకువచ్చారు. 

కాగా తెలుగుదేశం కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులకు సంబంధించి ఇతర వైసీపీ నేతలు జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిన రఘురామ్ లు పరారీలో ఉన్నారు.  వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి , చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో నిందితులైన దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంలు తమను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు వారి బెయిలు పిటిషన్ ను కొట్టేసింది. కనీసం సుప్రీం కోర్టును ఆశ్రయించేవరకూ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలన్న వారి వినతిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో వీరి అరెస్టు అనివార్యం అయిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రాఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్‌, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌లు, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడు.

కాగా తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇదే కేసులో విజయవాడ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు  చేపట్టారు. నందిగం అరెస్టుతో తమ అరెస్టు కూడా తథ్యమన్న భయంతో జోగి రమేష్, దేవినేని అవినాష్ లు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. వారి కసం కూడా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.