కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు.!
Publish Date:Aug 4, 2026
Advertisement
గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు షేక్ మహమ్మద్ ముస్తఫాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుజరాత్‌లో అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కిడ్నాప్ కేసుకు సంబంధించి ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నూజివీడు పోలీసులు, గుజరాత్ వెళ్లి మరీ అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఏలూరు జిల్లాకు చెందిన పొగాకు వ్యాపారి కడిమి సూర్యచంద్రంతో మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు కొన్నాళ్లుగా వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. సూర్యచంద్రం గుంటూరులోని ముస్తఫాకు చెందిన గోదాముకు పొగాకును సరఫరా చేసేవారు. అయితే.. ఇటీవల పొగాకు ధరల విషయంలో ఇరువురి మధ్యా విభేదాలు తలెత్తాయి. సరఫరా చేసిన సరుకుకు తగిన మూల్యం లభించడం లేదని భావించిన వ్యాపారి సూర్యచంద్రం, ముస్తఫా గోదాముకు పొగాకు అమ్మడం నిలిపివేశారు. దీంతో ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ సూర్యచంద్రంపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో సూర్యచంద్రం కుమారుడు అభితో పాటు ఒక డ్రైవర్, మరో ఉద్యోగి గుంటూరుకు పొగాకు బేళ్లను వాహనంలో రవాణా చేస్తుండగా.. నూజివీడు సమీపంలో బషీర్ తన అనుచరులతో కలిసి వారి వాహనాన్ని అడ్డుకున్న ముస్తఫా కుమారుడు బషీర్ తన అనుచరులతో కలిసి అభితో సహా ముగ్గురినీ కిడ్నాప్ చేశారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తేనే కిడ్నాప్ చేసిన వారిని విడుదల చేస్తామని వారు బెదిరింపులకు దిగారు. కిడ్నాప్‌నకు గురైన అభి తండ్రి సూర్యచంద్రమ్‌కు ఫోన్ చేసి, తాము కిడ్నాప్‌నకు సమాచారం అందించాడు. కుమారుడి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో సూర్యచంద్రం నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో భయపడిన నిందితులు బాధితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ పరారయ్యారు. వీరిపై నూజివీడు పోలీసులు కిడ్నాప్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పలు రాష్ట్రాల్లో గాలింపు చేపటాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గుజరాత్‌లో తలదాచుకున్నట్లు గుర్తించిన పోలీసులు గుజరాత్‌కు వెళ్లి, అక్కడి స్థానిక పోలీసుల సహాయంతో ముస్తఫాను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ పై నూజివీడుకు తరలించారు. YCP former MLA arrested, Kidnap Case, Nujiveedu, Gujarat, Shaik Mohammed Mustafa Kidnap Case Guntur East Ex MLA
http://www.teluguone.com/news/content/ycp-former-mla-arrested-36-227958.html





