కుల రాజకీయాలపై వైసీపీ ఫోకస్!

Publish Date:Jun 23, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు  మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల అనంతర పరిణామాలను గమనిస్తే.. వైసీపీ కుల రాజకీయాలపై ఫోకస్ పెట్టిందని స్పష్టమౌతోంది.  ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై  చర్చించారు.

ఈ కాపు శంఖారావం వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగి  ఉందని ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ అన్నారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కాపు సామాజికవర్గ పాకెట్ ను వేదికగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గ ఓట్లను ఏకీకృతం చేయాలన్న వ్యూహంతో వైసీపీ ముందుకు సాగుతున్నట్లు విశ్లేషించారు. ఉమ్మడి కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి అత్యంత బలమైన పట్టు ఉంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి ఎంతటి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం ఉందో, తూర్పుగోదావరిలో కాపులకు అంతటి శక్తి ఉంది. ఈ స్ట్రాంగ్ పాకెట్‌ను వేదికగా చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపు ఏకీకృతం (Consolidate) చేయడమే కాపు శంఖారావం భేటీ ప్రధాన ఉద్దేశమని భరద్వాజ వివరించారు. గతంలో కాపు సామాజిక వర్గం కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య వంటి సీనియర్ నేతలు వయోభారం, అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా జరుగుతున్న తరుణంలో, తోట త్రిమూర్తులు వైసీపీ తరఫున ఈ కొత్త బాధ్యతలను భుజానకెత్తుకున్నట్లు కనిపిస్తోందన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలతో పోలిస్తే తోట త్రిమూర్తులకు ఉన్న ఆర్థిక బలం,  ఇమేజ్   సమన్వయ శక్తి ఈ వ్యూహానికి ప్రధాన బలంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ వ్యూహంలో భాగంగా వైసీపీ నేతలు ప్రధానంగా ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారనీ,  ఇటీవల సాయికృష్ణ మిస్పింగ్ ఉదంతంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరును వైసీపీ కాపు నేతలు తీవ్రంగా తప్పుపట్టడం వెనుక కారణమిదేనని ఆయన అన్నారు. సాయికృష్ణను కేవలం ఒక  రౌడీ షీటర్ గా అభివర్ణిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలను, పోలీసుల వైఫల్యాలను ప్రశ్నించకపోవడాన్ని కాపు సమాజం జీర్ణించుకోలేకపోతోందని వారు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తానే స్వయంగా  నన్ను కేవలం కాపు నాయకుడిగా చూడొద్దు  అని అంటున్నప్పుడు..  మనం కూడా ఆయన్ను మన నాయకుడిగా గుర్తించాల్సిన అవసరం లేదనే భావనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందనీ,  చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కాపులకు శత్రువేనని, ఇప్పుడు చంద్రబాబుతో అంటకాగుతున్న పవన్ కూడా కాపు వ్యతిరేకిగా మారిపోయాడన్న నేరేషన్ ను బలంగా ముందుకు తీసుకురావడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందని భరద్వాజ చెప్పారు.  పూర్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి నలుగుతున్న  కాపులను బీసీల్లో చేర్చే పాత డిమాండ్‌ను చంద్రబాబు గతంలో హామీ ఇచ్చి నెరవేర్చలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఆ హామీలపై నిలదీయాలని వైసీపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు కాపులకు ఏ చిన్న సమస్య వచ్చినా బాధ్యత తీసుకుంటామని వైసీపీ ప్రకటించడం కూడా ఇందులో భాగంగానే చూడాలన్నారు. 

అయితే వైసీపీ వ్యూహం కేవలం కాపులకే పరిమితం కాలేదు. సమాంతరంగా దళిత ఓటు బ్యాంకును, మరీ ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు మరో వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఎంఆర్పీఎస్   నాయకుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య ఉదంతాన్ని వైసీపీ  పోలీసుల వేధింపులకు ముడిపెట్టడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.   అప్పటివరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ, లోకేష్‌తో సైతం మంచి సంబంధాలు ఉన్న వెంకటేశ్వరరావు ఇంటికి వైసీపీ ముఖ్య నేతలు వెళ్లి పరామర్శించడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. గాజ సాయికృష్ణ ఎపిసోడ్ ద్వారా కాపులను, క్రాంతి కుమార్ ఉదంతం ద్వారా మాదిగ ఓటు బ్యాంకును కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలనేది వైసీపీ వ్యూహంగా ఆయన వివరించారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అనే పాత ముద్రను మళ్లీ తెరపైకి తెస్తూ, గత 15 రోజుల్లో విజయవాడ కేంద్రంగా జరిగిన పోలీసు శాఖ వైఫల్యాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటున్నారు. ఈ విధంగా ఏపీలో మళ్లీ కులాల వారీగా ఓటు బ్యాంకులను ఏకీకృతం చేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని భరద్వాజ అన్నారు. 

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.