Publish Date:Aug 11, 2026
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలో మెగా డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది వైసీపీ హయాంలోని వైఫల్యాలను స్పష్టంగా ఎత్తి చూపింది. ఎందుకంటే ఈ విషయంలో జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో పూర్తిగా విఫలమయ్యారు. దానిని కప్పి పుచ్చుకోవడానికే వైసీపీ మెగా డీఎస్సీలో అవకవకలు, అక్రమాలూ అంటూ ఆరోపణలు గుప్పిస్తూ..రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగిందన్న భావన జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది.
అది పక్కన పెడితే.. ఈ నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి. వైసీపీ నిరసనలకు వైసీపీ నేతలు, కార్యకర్తలు వినా మరెవరూ హాజరు కావడం లేదు సరికదా.. జగన్ కు కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలోనే వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా నిరుద్యోగులు, ఉపాధ్యయులు, విద్యార్థలు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇది మెగా డీఎస్సీపై ప్రజలలో ఇసుమంతైనా ప్రతికూలత లేదనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ కోర్టుకు ఎక్కినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్నది ఆల్రెడీ ఓడిపోయిన యుద్ధమని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతుంది.
Mega, Dsc, protests, People, Avoid, Jagan, Participate
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-fighting-already-lost-battle-25-228633.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.