సిద్ధం సభ.. ప్లాప్ అని ఒప్పుకోలేక.. సక్సెస్ అని చెప్పుకోలేక.. పాపం వైసీపీ

Publish Date:Mar 11, 2024

Advertisement

కాలు గడప దాటదు కానీ, మాటలు కోటలు దాటేస్తాయన్నట్లు తయారైంది వైసీపీ పరిస్థితి. బిల్డప్ బాబాయ్ లకే సాధ్యం కాని లెవెల్ లో గంభీర ప్రకటనలు చేయడం.. వాస్తవంలో మాత్రం చెప్పినదానికీ జరిగిన దానికీ ఇసుమంతైనా పొంతన లేకపోవడం జగన్ పార్టీకి పరిపాటిగా మారిపోయింది. రాష్ట్రంలో యుద్ధానికి సిద్ధం కావాలంటూ సిద్ధం పేరిట ఇప్పటికే మూడు బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ  తాజాగా ఆదివారం (మార్చి 10) బాపట్లలో నిర్వహించిన చివరి సిద్ధం సభలో మాత్రం చతికిల పడిపోయింది.

ఆరంభ శూరత్వం తప్ప.. సిద్ధం సభల ద్వారా సాధించిందేమీ లేదని తేటతెల్లమైపోయింది. ఇప్పటి వరకూ ఏమూలో కాస్తో కూస్తో విజయంపై నమ్మకం ఉన్న క్యాడర్ కు కూడా రానున్న ఎన్నికల ఫలితం ఏమిటన్నది కళ్లకు కట్టింది జగన్ చివరి సిద్ధం సభ. 15లక్షల మందికి పైగా వస్తారంటూ ఆర్భాటంగా గొప్పలు చెప్పుకున్న ఆ పార్టీ నేతలు చివరికి కనీస స్థాయిలో కూడా జనాన్ని సమీకరించలేక చేతులెత్తేసి.. ఇక గెలుస్తామంటూ కనీసం మాటవరసకు కూడా చెప్పుకోవడానికి అవకాశం లేని స్థాయికి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేశారు.  తొలి సిద్ధం సభలో యుద్ధానికి సమయం వచ్చేసిందనీ, ఇక చొక్కాలు మడతపెట్టేయాలనీ క్యాడర్ కు పిలుపు నిచ్చిన జగన్ చివరి సిద్ధం సభకు వచ్చేసరికి జనాన్ని కూడా సమీకరించలేని పార్టీ దుస్థితిని అందరికీ చూపించేశారు. 

తాడేపల్లి ప్యాలెస్ దాటి అడుగు బయటపెడితే జనం తన ముఖం చూడరని ఈ సభ ద్వారా తేటతెల్లం చేసేశారు. అందుకే ఇంత కాలం బయటకు వస్తే రోడ్లకు ఇరువైపులా పరదాలు ఏర్పాటు చేసుకున్న సంగతిని దాపరికం లేకుండా ఈ సభ ద్వారా చెప్పేశారు. చివరి సిద్ధం సభ నాటికి కనీసం అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేయలేని దుస్థితిని చాటుకున్నారు. ఎన్నిక మేనిఫెస్టో కూడా ప్రకటించలేని దయనీయ స్థితిని ఎల్లరకూ తెలిసేలా చేయగలిగారు జగన్. 

ఇప్పటి దాకా మైకు పట్టుకుంటే చాలు చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడటం తప్ప తాను ఈ ఐదేళ్ల కాలంలో చేసినది ఇదీ, తన హయాంలో జరిగిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోలేని జగన్.. ఎన్నికల సన్నాహకంలో భాగంగా  అఖరి అంకమైన సిద్ధం సభలో మరోసారి తనకు అధికారం కట్టబెడితే ఇది చేస్తాను అని కూడా చెప్పుకోలేని పరిస్థితి తనదని తేటతెల్లం చేసేశారు. మసిపూసి మారేడు కాయ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన జగన్.. సిద్ధం సభ సందర్భంగా అందులోనూ ఘోరంగా విఫలమయ్యారు. లక్షల మంది హాజరౌతారంటూ ఆర్భాటంగా ప్రకటించుకుని మరీ నిర్వహించిన ఈ సభకు జనాలు రాకపోయినా వచ్చినట్లు బిల్డప్ ఇచ్చుకునేందుకు చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమవ్వడమే కాకుండా పార్టీనీ, జగన్ ను కూడా నవ్వుల పాటు చేసింది. ఇంతకీ జనం హాజరు విషయంలో జగన్ మసిపూసి మారేడు కాయ చేయడానికి చేసిన ప్రయత్నమేంటంటే సభా ప్రాంగణమంతా గ్రీన్ కార్పెట్లు పరిచేసి.. జనం రాకపోయినా ఆ తరువాత వచ్చినట్లుగా కావలసినట్లు మార్చేసుకోవచ్చని చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది వైసీపీ. ఆ ప్రయత్న మంతా సామాజిక మాధ్యమంలో కళ్లకు కట్టినట్లు వచ్చేయడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇక సిద్ధం సభ పూర్తయిన తరువాత వైసీపీ విడుదల చేసిన విజువల్స్ లో జనం ఉన్నట్లుగా చూపించడానికి ఫొటోలను మిక్స్ చేసి చేసిన యత్నం కూడా మీడియాలో ఆధారాలతో సహా వచ్చేసింది.  దీంతో సిద్ధం సభ విషయంలో వైసీపీ పరిస్థితి తేలు కుట్టిన దొంగలా తయారైంది. జనం వచ్చారని చెప్పుకోలేక, రాలేదని ఒప్పుకోలేక నానా ఇబ్బందులూ పడుతోంది. 

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధం సభకు సంబంధించి వైసీపీ మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసిన ఫొటోలను తన ఎక్స్ ఖాతా ద్వారా రివీల్ చేసి  సీఎం జగన్ సిద్ధం సభలకు జనం రాకపోయినా... మార్ఫింగ్ ఫొటోలు వేసుకుంటూ సభ విజయవంతమైనట్టు చెప్పుకుంటున్నారని టీడీపీ యువనేత నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. 

By
en-us Political News

  
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.