రాయలసీమలో వైసీపీ ఖాళీ.. జనసేన వ్యూహం అదేనా?

Publish Date:Jul 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.  ముఖ్యంగా  రాయలసీమ పరిధిలోని ఉమ్మడి ఆరు జిల్లాలలో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతోంది. ఇందుకు కారణం ఈ ప్రాంతంపై  పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించడమే అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే జనసేన  ఆపరేషన్ ఆకర్ష్‌ కు తెరలేపి.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే.. తాజాగా  జనసేనలోకి  చేరికలను సమీక్షించడానికి 14 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి చేరికల కమిటీని జనసేనాని ఏర్పాటు చేశారు.   ఈ కమిటీలో ఇటీవలే వైసీపీని వీడి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి  కీలకమైన బాధ్యతలను అప్పగించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రాజకీయాలపై బాలినేనికి ఉన్న పట్టును ఉపయోగించుకుని..  ఆయా జిల్లాలలో వైసీపీ అసంతృప్తి నేతలను జనసేనలోకి ఆకర్షించాలన్న వ్యూహంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  

గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఆరు ఉమ్మడి జిల్లాల నుంచి కనీసం  పాతిక నుంచి ముఫ్ఫై మంది వరకు వైసీపీ ద్వితీయ శ్రేణి, అలాగే పది మంది వరకూ సీనియర్, కీలక వైసీపీ నేతలు జనసేనలోకి చేరుందుకు ఇప్పటికే మాటాముచ్చటా జరిగిందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.  బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ నేతలతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారని తెలుస్తోంది.  గత ఎన్నికలలో కేవలం కొన్ని స్థానాలకే పరిమితమైనప్పటికీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోయిన జనసేనకు ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోవడినికీ, మరీ ముఖ్యంగా రాయలసీమలో పాగా వేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని చెబుతున్నారు. ఓటమి తరువాత వైసీపీలో నైరాశ్యం కమ్ముకుంది. అటు క్యాడర్, ఇటు లీడర్ కూడా పెద్దగా యాక్టివ్ గా ఉంటున్న దాఖలాలు కనిపించడంలేదు. 

దీంతో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళనలో పడ్డ వైసీపీ నేతలు, పార్టీ వీడే యోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలలోచర్చ జరుగుతోంది. అలా పార్టీని వీడాలనుకునే వారికి ఉన్న ఆప్షన్లు తెలుగుదేశం, జనసేన మాత్రమే. అయితే తెలుగుదేశంలో చేరికకు అవకాశం లభించినా, అక్కడ ఇప్పటికే సీనియర్లు చాలా మంది ఉండటంతో తమకు సముచిత స్థానం లభించే విషయంలో అనుమానాలు ఉన్న వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా పార్టీలోకి చేరికలకు పచ్చ జెండా ఊపారు.  

Pawan Kalyan, Balineni Srinivasa Reddy, Greater Rayalaseema, YSRCP Leaders, Telugu One

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.