కుప్పంలో వైసీపీ బుడగ పేలిపోయింది!

Publish Date:Aug 1, 2024

Advertisement

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో అంటే 2019 నుంచి 2024 వరకూ ఆ పార్టీ అధినేత జగన్ సహా నేతలంతా కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పావులు కదిపారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలలో ధనబలం, అధికార మదంతో దౌర్జన్యాలు చేసి గెలిచారు. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు చంద్రబాబు ముఖం చూడాలని ఉందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైనాట్ కుప్పం అంటూ కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా ఆ నియోజకవర్గ బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఎన్నికలకు చాలా ముందుగానే కుప్పం వైసీపీ అభ్యర్థిగా భరత్ పేరు ప్రకటించి.. భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ జగన్ ప్రకటించారు. కుప్పం నియోజకవర్గ పార్టీ బాధ్యతలను పెద్దిరెడ్డికి జగన్ అప్పగించిన క్షణం నుంచీ కుప్పంలో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు తెరలేచింది. తెలుగుదేశం కార్యకర్తలు, సానుభూతి పరులు లక్ష్యంగా వేధింపులు ఆరంభమయ్యాయి. బెదిరింపులతో తెలుగుదేశం శ్రేణులను భయభ్రాంతులకు గురి చేశారు. బలవంతంగా పార్టీ కండువా మార్పించారు. ఇంకే ముంది కుప్పంలో ఏదో జరిగిపోతోంది. చంద్రబాబుకు నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిపోయింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రశాంతతకు మారుపేరు అయిన కుప్పం నియోజవకర్గం భయానక వాతావరణాన్ని సృష్టించారు. తన సొంత నియోజకవర్గ పర్యటనలకు కూడా చంద్రబాబును అడ్డుకుని దాడులకు తెగబడే పరిస్థితిని పెద్దిరెడ్డి పర్యవేక్షణలో వైసీపీ సృష్టించింది.  

అయితే ప్రజలు కుప్పం నుంచి చంద్రబాబునాయుడిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. చంద్రబాబుకు ప్రత్యర్థిగా పోటీ చేసిన భరత్ ఎన్నికల ఫలితాల తరువాత కుప్పంలో కనిపించడమే మానేశారు. ఎన్నికల ఫలితాల తరువాత కుప్పంలో వైసీపీ బుడగ పేలిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చి, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి 50 రోజులు అయ్యిందో లేదో.. కుప్పంలో  బలవంతపు పార్టీ మార్పిళ్ల బండారం బట్టబయలైంది. వైసీపీ ఖాళీ అయిపోయింది. ఆ పార్టీ కార్యాలయానికి తాళం పడిపోయింది.

ఎన్నికల ముందు వరకూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ కుప్పం అభ్యర్థి ఎన్నికల ఫలితాల తరువాత నిశ్శబ్దంగా కుప్పం వదిలి వెళ్లిపోయారు. పార్టీ క్యాడర్ కు అస్సలు అందుబాటులోకి రావడం లేదు. ఇక కుప్పంలో భరత్ ను గెలిపిస్తాను, చంద్రబాబును నియోజకవర్గంలో అడుగుపెట్టనీయను అంటూ ప్రగల్భాలు పలికిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం పుంగనూరులో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు.   పలువురు వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు తెలుగుదేశం గూటికి చేరిపోయారు. ఇంకా వైసీపీలో ఎవరైనా మిగిలి ఉంటే వారు కూడా రానున్న రోజులలో సైకిల్ ఎక్కేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కుప్పం మునిసిపల్ చైర్మర్ డాక్టర్ సుధీర్ కూడా తెలుగుదేశం గూటికి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే  తెలుగుదేశం క్యాడర్ నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా అది జరగలేదు.  

కాగా ఎన్నికల ముందు కుప్పం తెలుగుదేశం వ్యవహారాల బాధ్యతను పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు చంద్రబాబు అప్పగించింది.  ఎన్నికల ప్రచారం నుంచి, పార్టీ నేతలు, కార్యకర్తలు, కూటమి భాగస్వామ్య పక్షాల క్యాడర్ ను సమన్వయ పరుచుకుంటూ శ్రీకాంత్ ముందుకు సాగారు. ఇక ఇప్పుడు ఆయన కుప్పంలో వైసీపీని ఖాళీ చేయడంపై దృష్టి పెట్టారు.   గత ఏడాది మార్చి లో జ రిగిన తూర్పు రాయ లసీమ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలలో  శ్రీకాంత్ సంచలన విజయం.. అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదన్న సంకేతాలు ఇచ్చింది. అయితే మా ఓటర్లు వేరే ఉన్నారు అంటూ అప్పట్లో వైసీపీ పట్టించుకోలేదు.   అయితే శ్రీకాంగ్ ప్రతిభను గుర్తించిన చంద్రబాబు ఆయనకు వెంటనే కుప్పం బాధ్యతలను అప్పగించారు.  చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టిన శ్రీకాంత్ ఇప్పుడు కుప్పంలో వైసీపీ జెండా పట్టుకోవడానికి కూడా ఎవరూ ఉండకుండా ఖాళీ చేయించే పనిలో ఉన్నారు.  

By
en-us Political News

  
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.