కడప కోట బద్దలు.. వైసీపీ క్యాడర్ కకావికలు!?

Publish Date:Dec 17, 2024

Advertisement

కడపలో వైసీపీ ఉనికి మాయం అయిపోతోందా? ఆ పార్టీకి నేతలేలేకుండా పోతున్నారా? కడప జిల్లాలో తొలి నుంచీ ఉన్న వైఎస్ కుటుంబం పట్టు సడలుతోందా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఎవరైనా ఔననే సమాధానం ఇస్తారు. జగన్ వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచీ కడపలో ఆ పార్టీదే హవా. అంతకు ముందు అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం కడప జిల్లా ఆయన గుప్పిట్లో ఉండేది. అందుకే కడప జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. అయితే వైఎస్ మరణం తరువాత జిల్లా మొత్తం జగన్ వెంట నిలిచింది.

అయితే 2024 ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయంతో అంత వరకూ జగన్ కు పెట్టని కోటగా నిలిచిన కడపలో ఆయన పలుకుబడి మసకబారింది. ఎన్నికలలో ఆ పార్టీ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ కేవలం మూడంటే మూడు స్థానాలలో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. కడప పార్లమెంటు స్థానంలో వైసీపీ అభ్యర్థి, జగన్ పదే పదే చెబుతూ వస్తున్న చిన్న పిల్లోడు అవినాష్ రెడ్డి విజయం కూడా ఆ నియోజకవర్గం నుంచి షర్మిల రంగంలో నిలవడం వల్లనే సాధ్యమైందని పరిశీలకులు ఫలితాలు వచ్చిన అనంతరం విశ్లేషించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోవడమే అవినాష్ రెడ్డి విజయానికి దోహదం చేసిందనడంలో సందేహం లేదు. ఇక పులివెందుల నుంచి పోటీ చేసిన జగన్ రెడ్డి విజయం సాధించినా మెజారిటీ అనూహ్యంగా తగ్గింది. అన్నిటికీ మించి కడప జిల్లా నుంచి వైసీపీ గెలిచిన మూడు స్థానాలలో ఒకటి జగన్ పోటీ చేసిన పులివెందుల కాగా, మరోటి కూటమి పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా   బిజెపి పోటీ చేసిన స్థానంలో అభ్యర్థి బలహీనుడు కావడం వల్ల వచ్చింది. 

సరే ఆ ముచ్చట పక్కన పెడితే  ఇటీవల పులివెందులలో జరిగిన నీటి సంఘాల ఎన్నికలలో తెలుగుదేశం  క్లీన్ స్వీప్ చేసింది.  దివంగత వైయస్ఆర్ స్వస్థలమైన బలపనూరులో కూడాతెలుగుదేశం తిరుగులేని విజయం సాధించింది. ఇక కడప కార్పొరేషన్ సైతం వైసీపీ చేజారడం ఖాయమైపోయింది. వైసీపీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో ఆ పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరారు.  అసలు కడప జిల్లాలో వైసీపీని ముందుండి నడిపించేందుకు నాయకుడే లేని పరిస్థితి ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గతంలో అంటే వైఎస్ వివేకానందరెడ్డి బతికి ఉన్న కాలంలో ఆయనే అన్నీ చూసుకునే వారు.  అయితే ఆయనను పక్కన పెట్టి జగన్ అవినాష్ రెడ్డిని ప్రోత్సహించారు. సరే 2019 ఎన్నికల ముందు  వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక ఉన్నది అవినాష్ రెడ్డే అన్నఆరోపణలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిలుపై ఉన్నారు.  అది పక్కన పెడితే  గత ఐదు సంవత్సరాలలో, అవినాష్ రెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అయితే ఐదేళ్లూ  వైసీపీ అధికారంలో ఉండటం వల్ల పార్టీ కోట బీటలు వారుతున్న విషయాన్ని కప్పి పుచ్చి జిల్లాలో తనకు, పార్టీకి తిరుగులేదన్న బిల్డప్ ఇవ్వగలిగారు. అయితే ఎన్నికలలో పరాజయం తరువాత ఒక్కసారిగా అవినాష్ రెడ్డికి పార్టీని నడిపే సమర్థత ఇసుమంతైనా లేదన్న విషయం బహిర్గతమైంది.  ఇప్పుడు జిల్లాలో పార్టీ అటు లీడర్, ఇటు క్యాడర్ లేకుండా పోయింది. చివరాఖరుకు జగన్ కూడా పులివెందులలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.  

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.