లేదు లేదంటూనే వైసీపీ ముందస్తు జాతర.. జగన్ కు అంత తొందరెందుకంటే..!

Publish Date:May 16, 2022

Advertisement

ఐదేళ్లు అధికారంలో ఉండేందుకు జనం మాకు అధికారం ఇచ్చారు? ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెడతాం అంటూ వైసీపీ మంత్రులు ఒక పక్క ప్రకటనలు గుప్పిస్తున్నారు. జగన్ మదిలో ముందస్తు ఆలోచన మెదులుతోందంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల సంకేతాలిస్తారు. ప్రభుత్వం మాత్రం ముందస్తు జాతరను గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో మొదలెట్టేసింది.  అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా నాలుగేళ్లు పూర్తయిన తరువాత ఐదవ ఏడాది ఎన్నికల సంవత్సరంగా భావించి పందేరాలు, ఉచితాలు, ప్రలోభాలతో ప్రజలకు ఎర వేయాలనుకుంటుంది. కానీ జగన్ ప్రత్యేకం..అందుకే అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ పందేరాలు, ప్రలోభాలతో ముందుకు సాగుతూ వచ్చారు. అయితే మూడేళ్లు గడిచేసరికి అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వం ఏ రోజు కారోజు కొత్త అప్పుకోసం వెంపర్లాడే పరిస్థితికి వచ్చేసింది.

ఇంక ఇంత కాలం చేసిన పందేరాలను కొనసాగించలేని పరిస్థితుల్లో ముందస్తు జాతరకు సిద్ధమైపోయింది. ప్రచార జాతరకు తెర తీసేసింది. తన వైఫల్యాలను  ప్రతిపక్ష పార్టీకి ఆపాదించే ప్రణాళికలను అమలులో పెట్టేస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ వైఫల్యాలను విపక్షాలు జనంలో ఎండగట్టడం ఇప్పటి వరకూ అమలులో ఉన్న రివాజు. వైసీపీ దానిని రివర్స్ చేసేసింది. ప్రభుత్వ వైఫల్యాలను కూడా విపక్ష ఖాతాలో వేయడానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రచార వనరులనూ యథేచ్ఛగా వాడేసుకుంటోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో విద్యుత్ కోతలకు తెలుగుదేశం కుట్రే కారణమంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చింది. అందుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కుప్పం పర్యటననే వేదిక చేసుకుంది.

విద్యుత్ కోతల నెపం చంద్రబాబు కుట్రగా అభివర్ణించడానికి గీత దాటేసింది. ఓ ఛానెల్ లో ప్రసారమైన వార్తా కథనం మేరకు కుప్పంలో చంద్రబాబు పార్టీ శ్రేణులతో ముఖాముఖి కార్యక్రమం కొవ్వొత్తుల వెలుగులో జరిపించడాన్ని ఎత్తి చూపుతూ రాష్ట్రంలో విద్యుత్ లేదని చాటేందుకే చంద్రబాబు కుట్రపూరితంగా విద్యుత్ తీయించేశారన్నది ఆ కథనం. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు కుట్రపూరితంగా కుప్పంలో కరెంట్ కట్ చేయించారన్నది  ఆ కథనం సారాంశం. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలే లేవనీ, చంద్రబాబు పర్యటన సందర్భంగా కేవలం కుప్పంలోనే కరెంట్ కట్ అవ్వడం వెనుక ఉన్నది ఆయన కుట్రేనని నమ్మించడం ఆ కథనం ఉద్దేశం. అయితే రాష్ట్రంలో విద్యుత్ కోతల గురించి, విద్యుత్ ఉద్యోగులకు వేతనాలు అందక పడుతున్న ఇబ్బందుల గురించీ ఒక ఏపీలోనే కాదు.. దేశం మొత్తం తెలిసిన విషయమే.

అంతే కాదు రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, విద్యుత్ పరిస్థితి,  సాగునీరందక అల్లాడుతున్న  రైతుల నిస్సహాయ స్థితి గురించి తెలంగాణ మంత్రి నిర్మొహమాటంగా చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవం ఇలా ఉంటే ప్రత్యర్థి పార్టీపై నెపం నెట్టి..పబ్బం గడిపేసుకునే వ్యూహాలను వైసీపీ అమలు చేస్తున్నది.  అలాగే సభ ఏదైనా, సందర్భం ఏదైనా ముఖ్యమంత్రి నుంచి వైసీపీ క్యాడర్ వరకూ విపక్షం వల్లే రాష్ట్రంలో సమస్యలన్నీ అని జనాన్ని నమ్మించే యత్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ ఎన్నికల తొందరలోనేనన్నది పరిశీలకుల విశ్లేషణ. మొత్తంగా రాష్ట్ర ప్రజలకు మాయా బజార్ సినిమా చూపించేసి సమస్యల నుంచి వారి దృష్టిని మరల్చేందుకు వైసీపీ ప్రయాసకు ఇది నిదర్శనమని విశ్లేషణలు చేస్తున్నారు.తెలుగుదేశం. జనసేన పొత్తల ప్రతిపాదనలు, చర్చలపై వైసీపీలో కనిపిస్తున్న గాభరాకు కూడా కారణం ఇదే నంటున్నారు. రాజకీయాలలో పొత్తలు అత్యంత సహజం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి...అధికార పక్షం అత్తెసరు మార్కులతో పాసయ్యే అవకాశాలు లేకుండా చేసేందుకు పార్టీల మధ్య పొత్తులు ఏపీలోనే మొదలు కాలేదు.

ఎమర్జెన్సీ అనంతర ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ల రూపంలో గంప గుత్తగా అప్పటి జనతా పార్టీకే రావడానికి కారణం నిస్సందేహంగా పొత్తులే. యూపీఏ, ఎన్డీయే కూటములు పొత్తల వల్లనే కదా ఏర్పడ్డాయి.  ఏపీలో పొత్తులు తమ అధికారానికి చేటు తెస్తాయన్న భయంతోనే వైసీపీ జనసేన, తెలుగుదేశం పొత్తు మాట వింటేనే బెదిరిపోతున్నదని పరిశీలకులు అంటున్నారు. కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు మోడీ సర్కార్ అధికారంలోకి రావడానికి విపక్షాల అనైక్యతే కారణమన్నది నిర్వివాదాంశం. అందుకే పార్టీలన్నీ కూడా బీజేపీయేతర కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో కూడా తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు చర్చలు, ప్రతి పాదనలకు కూడా వైసీపీకి వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే.    ఆ పొత్తులు పొడవకముందే, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం నిలిచిపోకముందే ఎన్నికలకు వెళ్లి లబ్ధి పాందాలన్న తొందర వైసీపీలో కనిపిస్తోంది. అందుకే రెండేళ్లకు ముందే రాష్ట్రంలో ఎన్నికల జాతర మొదలైపోయిన వాతావరణం కనిపిస్తోంది. 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.