మంగళగిరిలో వైసీపీ గాయెబ్!

Publish Date:Jan 1, 2025

Advertisement

మంగళగిరి నియోజకవర్గంలో  ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా వైసీపీ నాయకుడు కనిపించడం లేదు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఏమంత పట్టు లేని నియోజకవర్గం ఇది. 2019 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నారా లోకేష్ పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఓటమి తరువాత నుంచీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా లోకేష్ పని చేశారు. ఆయన శ్రమ, కృషి ఫలించింది. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోటగా మారిపోయింది. 2024 ఎన్నికలలో లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంత వరకూ నియోజకవర్గంలో తోపులం మేమే అంటూ బోర విరుచుకు తిరిగిన వైసీపీ నేతలంతా ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. 

ఈ నియోజకవర్గ పరిధిలోనే వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి ప్యాలెస్ ఉంది. నియోజకవర్గ కేంద్రానికి అతి సమీపంగానే జగన్ నివాసం ఉంది. పార్టీ కార్యాలయం కూడా అదే.  అలాంటి మంగళగిరిలో ఇప్పుడు వైసీపీ ఖాళీ అయిపోయింది. ఆ పార్టీ తరఫున పని చేయడానికి నాయకుడూ, కార్యకర్తా కూడా కనిపించని పరిస్థితి ఉంది. అలాంటి చోట‌. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో వైసీపీ ఫేస్ గా ఫోజులు కొడుతూ తిరిగిన వారంతా ఎంత తొందరగా వైసీపీకి గుడ్ బై కొడితే అంత మేలు అన్నట్లుగా మారిపోయారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా, లోకేష్ కు ప్రత్యర్థిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య.. ఓటమి తరువాత కనిపించడం లేదు. ఆమె అజాపజా లేదు. ఆమె మావ మురుగుడు హనుమంతరావు ఇప్పటికీ వైసీపీలోనే కొనసాగుతున్నా... ఏ మాత్రం క్రియాశీలంగా లేరు. ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అటు నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందా దూకేద్దామన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి 2024కు ముందు వరుస విజయాలు సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అలియాస్ కరకట్ట కమల్ హసన్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తీరు గమనిస్తే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక వీరు కాకుండా వైసీపీలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన గంజి చిరంజీవి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించి భంగపడినా గంజి చిరంజీవి వైసీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ పార్టీ ఘోర పరాజయం తరువాత ఆయన వైఖరి మారింది. పార్టీకి దూరం జరగడమే కాదు.. జనసేనకు దగ్గరయ్యారు. అతి కష్టం మీద పవన్ కల్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొంది జనసేన గూటికి చేరిపోయారు. దీంతో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎంప్టీ అయిపోయింది. పార్టీ కార్యక్రమాలను నడిపించే వారు కాదుకదా అసలా పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఎవరూ లేకుండా పోయిన పరిస్థితి ఉంది.  అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కు నియోజకవర్గంలో రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. ప్రజాదర్బార్ లో ఆయన నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నారు. కష్టంలో ఉన్న ప్రతి వారికీ నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. దీంతో జనం స్వచ్ఛందంగా ఆయన నాయకత్వానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారంతా ఇప్పుడు తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 75 వేల మంది కొత్తగా తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు గడువు ముగిసే సరికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే.. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.