వైసీపీ డర్టీ పిక్చర్!

Publish Date:Aug 26, 2024

Advertisement

వైసీపీపేరు దేశ రాజ‌కీయాల్లో మారుమోగుతోంది. దేశంలో ఏ రాజ‌కీయ పార్టీలోనూ ఇలాంటి త‌ర‌హా నేత‌లు ఉండ‌ర‌ని వైసీపీ నేత‌ల గురించి చ‌ర్చించుకుంటున్నారు. ప‌లు జాతీయ ఛానెల్స్ సైతం వైసీపీ నేత‌ల‌పై ఫోక‌స్ పెట్టాయి. ఏంటీ.. వైసీపీ నేత‌లు అంత గొప్ప ప‌నులు ఏం చేశార‌నుకుంటున్నారా.. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా వారి వ్య‌వ‌హార‌శైలి ఉంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అభివృద్ధిలో ఏపీని దేశంలోనే అగ్ర‌స్థానంలో నిల‌పాల‌ని క‌ష్ట‌ప‌డుతున్నారు. తెలుగుదేశం, జ‌నసేన నేత‌లు రాష్ట్రంలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తూ.. ప్ర‌జ‌ల‌ చేత మ‌న్న‌న‌లు పొందాల‌ని తాప‌త్ర‌య ప‌డుతున్నారు.

కానీ, వైసీపీ నేత‌లు మాత్రం అధికారంలో ఉన్న స‌మ‌యంలోనూ.. అధికారం కోల్పోయి ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనూ అక్ర‌మ సంబంధాలు, రాస‌లీల‌తో ఏపీ ప‌రువును దేశ‌వ్యాప్తంగా మంటగలుపుతున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ వీడియోలు, ఆడియోలు వైసీపీ అధికారంలో ఉండగా వైరల్‌ అయ్యాయి. అయితే, వాటిని మార్ఫింగ్ చేశారంటూ త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. అప్ప‌ట్లో వైసీపీ అధికారంలో ఉండ‌టంతో వారు చెప్పిందే వేదంగా నడిచిపోయింది. కానీ, ప్ర‌జ‌లు మాత్రం వైసీపీ నేత‌లు చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాల‌ని గ్ర‌హించారు. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీకి దిమ్మ‌తిరిగే షాకిచ్చారు. అయినా  ఆ పార్టీ నేత‌ల్లో మార్పు రావ‌డం లేదు. ఇటీవ‌ల కాలంలో వైసీపీ నేత‌ల ఒక్కొక్క‌రి రాస‌లీల‌ల వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌స్తోంది.

ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రించిన వైసీపీ నేత‌ల బండారం ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తోంది. అధికారంలో ఉన్న స‌మ‌యంలో కొంద‌రు వైసీపీ నేత‌లు భూక‌బ్జాలు, ఇసుక‌, మ‌ట్టి దందాల‌కు పాల్ప‌డి పెద్ద‌ మొత్తంలో అక్ర‌మ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. మ‌రి కొంద‌రు భూక‌బ్జాల‌కు పాల్పడ్డారు.. ఇంకొంద‌రు మ‌హిళ‌ల‌ను భ‌య‌పెట్టి రాస‌లీలల‌ వ్య‌వ‌హారాల‌ను న‌డిపించారు. ఇటీవ‌ల కాలంలో వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి రాస‌లీల‌ల వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌భుత్వ మ‌హిళా ఉద్యోగిని లోబ‌ర్చుకొని, ఆమెతో రాస‌లీల‌లు సాగించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అంతేకాదు.. ఆమె ద్వారా పెద్ద‌మొత్తంలో దేవాదాయ శాఖ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హారం స‌మ‌సిపోక‌ముందే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న భార్య‌ా బిడ్డ‌ల‌ను వ‌దిలేసి దువ్వాడ శ్రీ‌నివాస్ వైసీపీకి చెందిన మ‌హిళా నేత‌తో ఉంటున్న‌ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో కుటుంబ స‌భ్యులు దువ్వాడ ఇంటి ఎదుట ఆందోళ‌నకు దిగారు. ఈ వివాదం కొన‌సాగుతూనే ఉంది. ఇదే స‌మ‌యంలో వైసీపీకి చెందిన మ‌రో ఎమ్మెల్సీ అనంత‌బాబు అస‌భ్య‌క‌ర‌ వీడియో వెలుగులోకి వ‌చ్చింది. వ‌రుస‌గా వెలుగులోకి వ‌స్తున్న వైసీపీ నేత‌ల రాస‌లీల‌ల వ్య‌వ‌హారం, అస‌భ్య‌క‌ర వీడియోపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌జ‌రుగుతున్న వేళ మ‌రో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వైసీపీకి చెందిన కీల‌క నేత ముంబ‌యికి చెందిన హీరోయిన్ ను బంధించి చిత్ర‌హింస‌ల‌కు గురిచేసిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌జ‌రుగుతుంది.  

అల్లూరి సీతారామ‌రాజు జిల్లా రంపచోడ‌వ‌రానికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. గతంలో ద‌ళిత వ‌ర్గానికి చెందిన డ్రైవర్‌ను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో అనంత‌బాబు జైలుకెళ్లాడు. కొద్దిరోజుల‌కే జైలు నంచి బ‌య‌ట‌కొచ్చాడు. అయినా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనంత‌బాబును పార్టీ బాధ్య‌త‌ల నుంచి తొల‌గించలేదు. దీంతో జ‌గ‌న్ అండ‌దండ‌ల‌తో అనంత‌బాబు మ‌రింత రెచ్చిపోయాడు. తాజాగా ఆయ‌న సంబంధించిన అస‌భ్య‌క‌ర వీడియో వెలుగులోకి రావ‌డంతో వైసీపీ అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారింది. అనంత‌బాబు త‌న‌పై వ‌చ్చిన వీడియో మార్ఫింగ్ వీడియో అంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసులు ఈ వ్యవహారం బయటకు తీస్తే.. అనంతబాబుకు అసలు షాక్ తగిలే అవకాశం ఉంది. డ్రైవర్ హత్య కేసులో పోలీసులు సరైన సమయంలో చార్జిషీట్ వేయకపోవడం వల్లనే సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ వచ్చింది. లేకపోతే ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడు. ఇప్పుడు ప్రభుత్వం అనంతబాబు వ్యవహారాలన్నింటినీ బయటకు తెచ్చేందుకు ఆయన చేసిన ఫిర్యాదునే ఆధారంగా చేసుకుని పోలీసులతో దర్యాప్తు చేయించే అవకాశం ఉంది. మన్యంలో అరాచకశక్తిగా మారిన అనంతబాబు తనకుతానే గడ్డు పరిస్థితి తెచ్చుకున్నారని చెప్పవచ్చు. అయితే, ఈ వ్య‌వ‌హారంపై వైసీపీ అధిష్టానం స్పందించ‌లేదు.

వైసీపీ నేత‌లు హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించ‌టానికి పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికూడా ఓ కార‌ణ‌మ‌న్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల‌నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది. అధికారంలో ఉన్న‌న్ని రోజులు భూక‌బ్జాలు, అవినీతి అక్ర‌మాల‌తో పార్టీ ప్ర‌తిష్ట‌ను కొంద‌రు నేత‌లు దెబ్బ‌తీశారు. అయినా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వారిని వెనుకేసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఒక్కొక్క వైసీపీ నేత రాస‌లీల‌ల వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌స్తున్నా వారిపై వేటు వేయ‌కుండా జ‌గ‌న్ తాత్సారం చేస్తుండ‌టంతో పార్టీ శ్రేణుల‌ను ఆగ్ర‌హానికి గురిచేస్తుంది. గ్రామ‌, మండ‌ల స్థాయిలో ఎన్నోక‌ష్టాలు ఎదుర్కొని పార్టీ కోసం పని చేస్తుంటే రాష్ట్ర స్థాయి ప‌ద‌వుల్లో ఉన్న కొంద‌రు నేత‌లు పార్టీ ప‌రువును తీసున్నార‌ని పార్టీ శ్రేణులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి. జ‌గ‌న్ ఇప్ప‌టికైనా మేల్కొని రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీ‌నివాస్‌, అనంత‌బాబుల‌పై వేటువేయాల‌ని, త‌ద్వారా పార్టీపై ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతున్న చెడు అభిప్రాయాన్ని తొల‌గించేందుకు జ‌గ‌న్ చర్యలు తీసుకోవాల‌ని పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేస్తున్నారు. జ‌గ‌న్ ఇప్ప‌టికైనా మేల్కోక‌పోతే తాము పార్టీలో కొన‌సాగే ప‌రిస్థితి ఉండ‌ని కొంద‌రు నేత‌లు స్ప‌ష్టంగా చెప్పేస్తున్నారు.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.