కుప్పం వైసీపీలో డిష్యుం..డిష్యుం.. రక్తమోడిన విభేదాలు

Publish Date:Sep 1, 2022

Advertisement

సినిమాలో హీరో విల‌న్ వ‌ర్గాలు కొట్టుకుంటారు, వీధిలో రెండు వ‌ర్గాల‌వారు కొట్టుకుంటారు. ఒక్క వైసీపీలోనే వాళ్ల‌లో వాళ్లు కొట్టుకుంటున్నారు.  అయితే వైసీపీలో ఇటీవ‌లి   ప‌రిణామాల దృష్ట్యా ఇదేమీ పెద్ద వింత కాదు. ఈ మ‌ధ్య‌నే అనంత‌పురంలో పోలీసుల స‌మ‌క్షంలో ఏకంగా పోలీస్ స్టేష‌న్‌లోనే వైసీపీకి చెందిన రెండు వ‌ర్గాలు వారు కొట్టుకున్నారు. పోలీసులు అలా సినిమా చూసిన‌ట్టు చూస్తూనే ఉన్నారు. ఎవ‌రినీ నిలువరించడానికి వీలు కాలేదు. అంతా అయ్యాక కేసు రాసుకుని వ‌దిలించుకున్నారు. ఇపుడు తాజాగా మ‌రో కోట్లాట సీన్ తెర మీద‌కు వ‌చ్చింది.  

ఇది ఏకంగా టీడీపీ అధినేత సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో జ‌రిగింది. విప‌క్షానికి చెందిన నియోజ‌క‌వ‌ర్గంలో అధి కార పార్టీ, విప‌క్ష వ‌ర్గీయుల మ‌ధ్య గొడ‌వ‌లో, కొట్లాటో ఉంటాయ‌ని అనుకుంటారు. కానీ   అధికార వైసీపీ ప‌క్షం వారి మ‌ధ్య‌నే గొడ‌వ జ‌రిగింది.  ఈ సంఘటనకు ముందు మూడు రోజుల పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ శ్రేణులుశతథా ప్రయత్నించాయి.

అది అలా ఉంటే.. ఇప్పుడు కుప్పంలో వైసీపీలోనే వర్గపోరు రోడ్డున పడింది. ఇందుకు మూలం ఇటీవల వైసీపీ నియోజకవర్గ సమీక్షలో కుప్పం నియోజకవర్గం నుంచి వైసీపీ  అభ్యర్థిగాఎమ్మెల్సీ భ‌ర‌త్ కుమార్ సీఎం జగన్ ప్రకటించేశారు. అక్కడితో ఆగకుండా.. ఆయన గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని ప్రకటించారు. ఇదంతా వచ్చే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం. అయితే రెండేళ్ల ముందే కుప్పం అభ్యర్థిని జగన్ ప్రకటించిన వ్యూహం వికటించింది.   కుప్పంలో  భరత్ వ్యతిరేక వర్గంలో ఈ ప్రకటనతో అసమ్మతి భగ్గుమంది.

ఈ నేపథ్యంలోనే  భ‌ర‌త్  పీఏ మురుగేశ‌న్‌, వైస్ ఛైర్మ‌న్ మునుస్వామి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. బాబాబాహీ కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో మురుగేశ‌న్ తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రి పాలయ్యారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం అధినేత తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి  నయానో భయానో నియోజక వర్గ ప్రజలను లొంగదీసుకోవాల చూస్తున్నారని వైసీపీ నాయ‌కులు తెలుగుదేశం పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.   మరోవైపు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే దాడులకు పాల్పడుతున్నారంటూ  టీడీపీ  వైసీపీ విమర్శిస్తోంది. వాటికి భిన్నంగా    గురువారం అధికార పార్టీ ఎమ్మెల్సీ భ‌ర‌త్ పిఏ మురుగున్‌పై వైసీపీ వర్గీయులే దాడి చేయడంతో ఆ పార్టీ పరువు అమాంతం గంగలో కలిసింది.  భ‌ర‌త్‌కి  టికెట్ ప్ర‌క‌టించిన ప్ప‌టి నుంచి కుప్పంలో అనేక‌మంది పార్టీ నిర్ణ‌యం ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారనడానికి ఈ సంఘటనే సాక్ష్యమని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.