బాధిత కుటుంబాలకు సాయంపై వైసీపీ వికృత రాజకీయం

Publish Date:Jan 20, 2023

Advertisement

ఓ అబద్దాన్ని నిజం చేయాలంటే.. చాలా చాలా చేయాలి. అందుకు చదువు చట్టుబండలు అవసరం లేదు కానీ... కాస్తాంత కపటం, మోసం ఉంటే చాలు. సామిరంగా.. జనాన్ని ఏంటి ప్రతిపక్ష పార్టీలను సైతం రింగ రింగా అంటూ.. అల్లాడించేయచ్చు. స్కూళ్లు‌, కాలేజీల్లో నేర్పని ఈ విద్య.. అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగానే ఒంట పట్టించుకుంది. 

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కందుకూరులో బాదుడే బాదుడు కార్యక్రమంలో   జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించారు. ఈ సందర్భంగా టీడీపీ, ఆ పార్టీ నేతలతోపాటు ఎన్నారైలు సైతం స్పందించి భారీగా నష్ట పరిహారాన్ని చెక్కులుగా అందించారు. అయితే ఎన్నారై కంచర్ల శ్రీకాంత్ ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయంటూ.. మృతుల కుటుంబాలకు నకిలీ చెక్కులు అంటగట్టారంటూ.. వైసీపీ.. సోషల్ మీడియా సాక్షిగా .. తెలుగుదేశం పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తూ.. విషం కక్కుతోంది. 

ఈ విషయంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. అదే సోషల్ మీడియా సాక్షిగా స్పందించారు. నాయకుడు దొంగ పనులు చేస్తే, అనుచరులు వెధవ పనులే చేస్తారు. జగన్ రెడ్డి నోరిప్పితే అబద్దం.. వైసీపీ కార్యకర్తలు చేసేదంతా దుష్ప్రచారం. కందుకూరు మృతుల కుటుంబాలకు ఎన్ఆర్ఐ కంచర్ల శ్రీకాంత్ ఇచ్చిన చెక్కులు క్యాష్ చేసుకున్నాక బౌన్స్ అయ్యాయని జగన్ ఫేక్ గ్యాంగ్ విష ప్రచారం చేస్తోంది. శవాలపైనా, చివరకు మరణించిన వారి కుటుంబాలకు చేసే సాయంపైనా వికృత రాజకీయాలు చేయడం కేవలం వైసీపీకే సాథ్యమంటూ పేర్కొన్నారు. అంతేకాదు.. బాధిత కటుంబాలకు టీడీపీ తరఫున ఇచ్చిన చెక్కు నెంబర్లను సైతం నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఈ మొత్తం ఎపిసోడ్‌పై నెటిజన్లు..  వైసీపీకి చురకలంటిస్తున్నారు. అధికారం అందుకోవడం కోసం.. విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా కోడి కత్తి డ్రామా నడిపినా.. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైనా.. జస్ట్ గుండెపోటుతో ఆయన మరణించారంటూ తొలుత మీడియాకు చెప్పినా... ఈ హత్య కేసు సీబీఐకి అప్పగించినా.. వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి.. సబీఐ ఎదుట ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరెవరో చెప్పినా.. ఈ హత్య కేసు ముందు సాగపోవడం వెనుక ఉన్నది ఎవరనేది ప్రజలందిరికీ తెలిసిందేనని నెటిజన్లు వైసీపీకి చురకలంటిస్తున్నారు. అలాగే విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కోడి కత్తి కేసులో పోడిపించినవాడు తాడేపల్లి ప్యాలెస్‌లో సకల భోగాలు అనుభవిస్తున్నాడని... కానీ కోడికత్తితో పోడిచిన వాడు   గత నాలుగేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని..  నెటిజన్లు అంటున్నారు. 
  
ఈ ఘటనలు గడిచి... నాలుగేళ్లు అయినా.. వీటిపై స్పందించని అధికార వైసీపీ,  కందుకూరు ఘటనలో బాధితులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యారంటూ అబద్దపు వార్తలు..  అదే పనిగా ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అని నెటిజనులు వైసీపీని నిలదీస్తున్నారు. అధికారం అందుకోవడం కోసమే కాదు.. ఆ వచ్చిన అధికారాన్ని నిలుపుకోవడం కోసం.. ఎన్ని చేయడానికికైనా.. ఎంత చేయడానికైనా.. ఎంతటి విషప్రచారానికైనా.. తెగబడడం  జగన్, ఆయన పార్టీ నైజం అన్నట్లుగా పరిస్థితి ఉందని నెటిజన్లు  అభిప్రాయపడుతున్నారు. ఉన్న అధికారాన్ని నిలుపుకోవడం కోసం.. సమాధులనే పునాదులుగా చేసుకుని.. అధికారాన్ని నిలబెట్టుకోవాలనే నైజం జగన్ పార్టీలో కొట్టోచ్చినట్లుగా కనిపిస్తోందని  నెటిజన్లు తమ అబిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదీ కాక.. జనవరి నుంచి జగనన్న ఏమిటో చూపిస్తాడు.. చూడండంటూ.. జగన్ సైన్యం పేరిట.. సోషల్ మీడియాలో గత ఏడాది నవంబర్‌లో జగన్ సైన్యం.. తన ఖాతాలో పోస్ట్ పెట్టిందని.. అది ఇలాంటి వాటి కోసమేనా అని నెటిజన్లు డౌట్ వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసి బస్సులో చిన్నపాటి చిల్లర గొడవ కాస్తా ఊహించని సంఘటనకు దారితీసింది.
గంటకు 140 కి.మీ వేగంతో పెనుగాలులు..అప్రమత్తమైన యంత్రాంగం.!
ఒకవైపు ధరల మంట.. మరోవైపు కృత్రిమ కొరతలు..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.