రాజకీయ లబ్ధి కోసం వైసీపీ శవరాజకీయం!

Publish Date:Dec 29, 2022

Advertisement

అధికార వైసీపీలో హుందాతనం కనుమరుగైంది. విపక్ష సభలకు జనం పోటెత్తడం ఆ పార్టీకి కంటగింపుగా మారింది. జనం విపక్ష నేతకు బ్రహ్మరథం పడుతుంటే.. జీర్ణించుకోలేక కారాలూ, మిరియాలూ నూరుతోంది. జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉన్న చంద్రబాబునాయుడి పర్యటనల్లో కనీస పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయకుండా.. ఆయన ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టడానికి వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలోనే కందుకూరు ఘటన విషయంలో భద్రతా ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నా ఎదురు విమర్శలతో రాజకీయ పబ్బం గడిపేసుకోవాలని ప్రయత్నిస్తున్నది.   కుందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇది వాస్తవం. ఎనిమిది నిండు ప్రాణాలు బలైపోయాయి. ఇదీ వాస్తవమే. మాటల కందని మహా విషాదమిది.  ఈ ఘటనపై అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా స్పందించారు. చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తెలుగుదేశం మృతుల  కుటుంబాల బాధ్యత తీసుకుంటామని ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి తొలుత . పది లక్షల సాయం ప్రకటించింది. ఆ తరువాత దానిని పదిహేను లక్షలకు పెంచింది. అలాగే మరో ఎనిమిది లక్షల రూపాయలు తమ వంతుగా ఆందజేస్తామని నాయకులు ప్రకటించారు. మొత్తం తెలుగుదేశం పార్టీ మృతుల కుటుంబాలకు 24లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఏపీ సర్కార్ కూడా మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అయితే ప్రకటించింది.. కానీ జరిగిన సంఘటన నుంచి రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాటను కూడా మొదలెట్టేసింది.  తొలుత సమాజిక మాధ్యమంతో మొదలెట్టి.. అధికార వైసీపీ మంత్రులు, నాయకులు దుర్ఘటన నుంచి రాజకీయ లబ్ధి కోసం శవరాజకీయాలకు తెరలేపారు. కందుకూరులో తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యుడు అంటూ.. అధికార పార్టీ ప్రచారం ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడినప్పుడు తొక్కిసలాట వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిది. పెద్ద సభ లేదా రోడ్ షో జరుగుతున్నప్పుడు పోలీసులు బందోబస్తు విధుల్లో కనిపించాలి. చిన్న చిన్న కార్యక్రమాలలోనే పోలీసుల పెద్ద సంఖ్యలో మోహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేత, అందునా జడ్ ప్లస్ కేటగరి భద్రత ఉన్న చంద్రబాబునాయుడు పాల్గొంటున్న సభ కు మరింత జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే కందుకూరులో అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. పోలీసుల సంఖ్య అతి స్వల్పంగా ఉంది. తొక్కిస లాట సమయంలో పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. తొక్కిసలాటకు ముందు చంద్రబాబు తన ప్రసంగంలో పదే పదే ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. తోసుకోవద్దు, వాహనాలు ఎక్కిన వారంతా కిందకు దిగాలి అని విజ్ణప్తి చేశారు. అయితే ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన ప్రభుత్వం మాత్రం ఘోరంగా విఫలమైంది. పైపెచ్చు రాజకీయ నేతల సభలో దుర్ఘటన జరగడం ఇదే మొదటి సారి అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తోంది. అయితే 
ఇటీవల విజయవాడలో వైసీపీ నిర్వహించిన జయహో బీసీ సభలో భోజనల దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుని ఒకరు చనిపోయారు. కనీసం ఆ కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించలేదు  అస్వస్థతతో చనిపోయాడని ప్రచారం చేసి చేతులు దులిపేసుకుంది.  అలాగే గోదావరి జిల్లాలో జరగిన సభలో ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆమె కుటుంబానికి కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇక జగన్ పాదయాత్రలో తొక్కిసలాటల గురించి చెప్పనే అక్కర్లేదు. జగన్ పాదయాత్ర తొలి రోజే తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. అయితే ఆ ఏ సందర్భంలోనూ అటువంటి విషాద సంఘటనలపై తెలుగుదేశం కానీ, మరే ఇతర పార్టీలు కానీ రాజకీయ విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కానీ కందుకూరు దుర్ఘటనలో తప్పు ప్రభుత్వం వైపు ఉన్నా.. తెలుగుదేశం తప్పిదమని చెప్పడానికి బురద రాజకీయం ప్రారంభించేసింది.   మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే దుర్ఘటన జరగడానికి చంద్రబాబే బాధ్యుడన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ దుర్ఘటన సాకుగా చూపి భవిష్యత్ లో చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వవద్దంటూ పోలీసులకు సూచనలు చేశారు. ఈ సంఘటనకు లింకు పెట్టేసి లోకేష్ పాదయాత్రను కూడా అడ్డుకోవాలన్న కుట్రలకు తెరలేపారు. అయితే వాస్తవంగా కందుకూరు దుర్ఘటన ప్రభుత్వ వైఫల్యమని పరిశీలకులు చెబుతున్నారు. కనీస బందోబస్తు కూడా లేకపోవడం, ఉన్న కొద్ది మంది పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం వల్లే తొక్కిసలాటలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారంటున్నారు.  విపక్ష నేత సభ జరిగే ప్రదేశంలో బారికేడ్లు పెట్టి తొక్కిసలాటలు వంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన పోలీసులు.. రోడ్డుకు ఆనుకునే ఎలాంటి రక్షణ గోడ లేకుండా ఉన్న కాలువ వద్ద కనీసం బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడ మేమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రచారయావ వల్లే ఇరుకు రోడ్లలో సభలు నిర్వహిస్తూ జనం అశేషంగా వచ్చారని చెప్పుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్న మాటలు అసంబద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రచార యావ అంటే రైతులకు ఇచ్చే భూమి పట్టాలపై   ఫొటో ముద్రించుకోవడాన్ని మించి ప్రచార యావ ఎక్కడైనా ఉంటుందా అని సామాన్యలే ప్రశ్నిస్తున్నారు. ఇక కందుకూరు సభకు వచ్చిన జనం కనిపిస్తూనే ఉన్నారు. వారిని తరలించడానికి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదు. స్కూలు బస్సులను బలవంతంగా తీసుకోలేదు. వచ్చిన వారంతా స్వచ్ఛందంగా వచ్చిన వారే. విపక్ష నేత ప్రభుత్వ విధానాలను విమర్శించేందుకు ప్రజల ముందుకు రావడాన్ని ఎవరూ ప్రశ్నించజాలరు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత లేకుంటే ఆ సభలకు జనం రారు. విశాఖ సహా పలు చోట్ల బలవంతంగా సమీకరించినా జగన్ సభ నుంచి జనం వెళ్లిపోతున్న దృశ్యాలు ప్రసార మాధ్యమాల ద్వారా అందరూ చూశారు. సభ నుంచి వెళ్లిపోయే వారిని ఆపడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలూ కనిపించాయి. కందుకూరు సభకు వచ్చిన వారు అలా తరలించిన వారు కాదు. ఎక్కడైనా సభలూ సమావేశాలూ జరిగితే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులదీ..ఇక్కడే ప్రభుత్వం, పోలీసులూ విఫలమైంది. కందుకూరు దుర్ఘటన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. జగన్ పర్యటనలకు పరదాలు కప్పేసే పోలీసులు.. జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు సభకు కనీసం బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. రక్షణ గోడ లేని కాలువ వద్ద కనీసం పోలీసులనైనా పెట్ట లేదు. ఆ కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులే చెబుతున్నారు. అయినా ఒక విషాదం జరిగినప్పుడు రాజకీయ విమర్శలను పక్కన పెట్టి సహాయ కార్యక్రమాలకు చేయి అందించడం కనీస ధర్మం. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ విషాద ఘటనపై  దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతుంటే అధికార వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా రాజకీయ లబ్ధి కోసం ఆరాట పడుతూ.. ప్రభుత్వ తప్పిదాన్ని విపక్షంపై రుద్దడానికి ప్రయత్నిస్తోంది.

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.