వైసీపీ వైనాట్ 175ధీమా వెనుక భారీ కుట్ర ఓట్ల గల్లంతే!

Publish Date:Oct 24, 2023

Advertisement

వైసీపీ వైనాట్ 175 నినాదం గురించి తెలిసిందే. మూడు నాలుగు నెలల క్రితం వరకూ ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతలు ఈ నినాదాన్ని ఊదరగొట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకూ వైనాట్ 175 అంటూ క్యాడర్ చెవులలో మార్మ్రోగించారు. ఒక దశలో వైనాట్ 175 అనేది ఒక నినాదంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని చూశారు. కానీ, ఆ తర్వాత మెల్లగా వైసీపీ చేయించుకున్న సొంత సర్వేలు, ప్రైవేట్ సంస్థల సర్వేలు, గడప గడపకి వైసీపీ లాంటి కార్యక్రమాలలో ప్రజలలో వ్యతిరేకత చూసిన వైసీపీ నేతలు కాస్త సౌండ్ తగ్గించారు. అయితే, అసలు వైనాట్ 175 అనేంత కాన్ఫిడెంట్ ఎలా వచ్చిందన్న అనుమానాలు రాజకీయ వర్గాలను వెంటాడాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియోజకవర్గం సహా కీలక నేతలు, ఉద్దండులు గల స్థానాలతో సహా మావే అంటూ వైసీపీ ప్రకటించడం ఒక రకంగా దుస్సాహసమే. అయితే, ఇదేదో తమ పనితనాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారనో.. తమ పాలన అంత సుభిక్షంగా సాగడం వలనో.. తమ ప్రభుత్వం ప్రజలను అంత గొప్పగా ఉద్ధరించడం వలనో వచ్చిన కాన్ఫిడెన్స్ కాదన్నది ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నిజం.

 వైసీపీ అందిపుచ్చుకున్న వైనాట్ 175 నినాదం వెనుక అతి పెద్ద కుట్ర ఉందని ఆది నుండి రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. అందులో భాగమే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు కుట్రని ఇప్పుడు బయట పడుతున్నది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం పది వేల తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తే గెలుపు తమదే అన్నది వైసీపీ ధీమా. జగన్ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా చెలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ ప్లాన్ పకడ్బందీగా అమలు జరుగుతున్నదని పరిశీలకులు అంటున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తగా.. ఇద్దరు అధికారులపై వేటు కూడా పడింది. ఎన్నికల విధులకు సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై ఎన్నికల కమిషన్ నిషేధం కూడా విధించింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలలో భారీగా ఈ ఓట్ల తొలగింపు చేపట్టారు. దీంతో అక్కడి తెలుగుదేశం నేతలు ఆందోళనలు వ్యక్తం చేయడంతో పాటు ఈసీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టి బండారం బయటపెట్టారు.

నిజానికి ఈ కుట్రను కూడా వైసీపీ అండ్ కో ఒక ప్లాన్ ప్రకారం నడిపించింది. సజ్జల నేతృత్వంలో ఏర్పాటైన ఓ టీమ్.. వాలంటీర్ల ద్వారా ఓటర్ల సమాచారం సేకరించి ఎన్నికల వ్యూహాలను రచించే ఐ ప్యాక్ టీంకి అందించడం.. ఎక్కడెక్కడ ఓట్లు తీసేయాలో ఐప్యాక్ టీం ప్రణాళిక రెడీ చేసి వైసీపీకి అందించడం.. ఎక్కడిక్కడ వైసీపీ నేతలు ఫామ్ 7లతో దరఖాస్తులు ఇవ్వడం.. వాటిని అధికారులు ధృవీకరించి తొలగించడం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు నియోజకవర్గాలలో ఈ ఓట్ల గల్లంతు వ్యవహారం బయటపడడంతో కలకలం రేగింది. రంగంలోకి దిగిన ఈసీ దర్యాప్తు చేసి అధికారులపై వేటు వేసింది. బదిలీలను నిలిపివేసింది. అయినా ఈసీ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఎడాపెడా బదిలీలు సాగుతున్నాయి. మరోవైపు సమయం చూసి ఇప్పుడు మరోసారి ఓట్ల గల్లంతు వ్యవహారాన్ని ఆచరణలోకి పెట్టినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం తెలుగుదేశం అధినేత అక్రమ అరెస్టుతో ఇటు నేతలు, అటు క్యాడర్ అంతా ఆ వైపే దృష్టి ఉంది. అరెస్టుకు నిరసనగా కార్యక్రమాలు, క్యాడర్ యాక్టివ్ గా ఉండేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి వైసీపీ ఫామ్ 7లతో ఈ ఓట్ల తొలగింపునకు సిద్దమైనట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఓట్లు గల్లంతు అయినట్లు తెలుస్తున్నది. ఈ కొత్త ఓటర్ లిస్ట్ ఈనెల 27న రాబోతుంది. అందులో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు లేపేశారో బయటపడుతుంది. మరోవైపు మరోసారి ఓట్ల తొలగింపుకు సన్నాహాలు సిద్ధం చేసున్నారట. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ ఎలా స్పందించబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ ఓట్ల తొలగింపు వ్యవహారంపై వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ఈసీ కేవలం ఆదేశాలకు మాత్రమే పరిమితమవుతున్నది తప్ప చర్యలు మాత్రం అమలవడం లేదు. మొత్తంగా చూస్తే ఇలాంటి కుట్రలతోనే వైసీపీ వైనాట్ 175 అంటూ రెచ్చిపోతున్నదని రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

By
en-us Political News

  
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.