మరో నీరో చక్రవర్తి ఫిడేలు రాగాలు...

Publish Date:Nov 20, 2021

Advertisement

అన్నమంతా పట్టి చూడనవసరం లేదు. ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందో లేదో తెలిసి పోతుంది. అలాగే, వ్యక్తుల నైజం ఏమిటో, వారు ఎలాంటి వారో తెలుసు కోవడానికి కూడా లోతుల్లోకి వెళ్లి విశ్లేషణలు చేయనవసరం లేదు. ఈ సూత్రం, ఈ సత్యం, వ్యక్తులకే కాదు, పార్టీలకు కూడా వర్తిస్తుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో మారు రుజువు చేసింది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఆర్టిస్టులు ఎవరికీ కూడా, భాష విషయంలో ఎలాంటి పట్టిపులు లేవన్నది జగద్విదితం. మంత్రులు మొదలు అన్ని స్థాయిల్లో బూతులు మాట్లాడేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారా, అనిపించే విధంగా వైసీపీలో అన్ని స్థాయిల్లో బూతుగణాలు ఉన్నాయి.    

అందుకు వైసీపీ సభ్యులు శుక్రవారం శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అవమానించి పొందిన ఆనందమే నిదర్శనం. అలాగే, రాష్ట్రానికే తలవంపులు తెచ్చిన ఆ సంఘటనపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, స్పందించిన తీరు ఇంకా దుర్మార్గంగా ఉందని సామాన్యులు సైతం, వీళ్ళా మా నాయకులు అని  సిగ్గుతో తలలు వంచుకునున్న్తారు.ఛీ కొడుతున్నారు.   నిజానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు సభ్యత, సంస్కారం గీతలను ఎప్పుడోనే దాటేశారు. కొద్ది రోజుల క్రితం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా, తెలుగునాట దిగజారుతున్న రాజకీయ విలువలు ముఖ్యంగా రాజకీయ నాయకులు వాడుతున్న అసభ్యకర భాష పట్ల అవేదన వ్యక్త పరిచారు. ఈ పరిస్థితి చూస్తుంటే, రాజకీయాలంటేనే విరక్తి కలుగు తోందని అన్నారు.  

ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి. అంతమాత్రాన ఓడిన వారిని చూసి అవహేళన చేయడం, అవమాన పరిచి ఆనందం పొందడం, అయితే రాక్షసత్వం,కాదంటే అజ్ఞానంతో కలిసిన అహంకారం, అనిపించుకుంటుంది. అయినా  అధికార ప్రతిపక్ష సభ్యులు, ఒకరినొకరు విమర్శించుకోవచ్చును.కానీ,కుటుంబ సభ్యులను, అందులోనూ రాజకీయాలతో సంబంధమే లేని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయాల్లో పరాకాష్టగా  సామాన్య ప్రజలు కూడా ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. 

నిజానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గతంలోనూ చాలా సందర్భాలలో సభలో సభా మర్యాద తప్పారు. దేవుడిచ్చిన నోరును దుర్వినియోగం చేశారు.అందుకు తమకంటే ముందు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీనే తమకు ఆదర్శం అంటే, అందులో కొంత నిజం ఉంది. కాదనలేము, కానీ, రాను రాను రాజు గుర్రం గాడిద అవుతోంది, అన్నట్లుగా పరిస్థితి దిగజారడం పట్ల అటో మేథావులు, రాజకీయ నాయకులు ఇటు సామాన్యులు కూడా విచారం వ్యక్త పరుస్తున్నారు.   

గతాన్ని పక్కన పెట్టి తాజా ఉదంతాన్నే తీసుకుంటే, అసెంబ్లీ సమావేశాల తోలి రోజున  బీఏసీ సమావేసంలో ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల విజయ దురహంకారాన్ని ప్రదర్శించారు. కుప్పం ఎన్నికల ఫలితాలను కడుపులో పెట్టుకుని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబాబు సభకు వస్తే చూడాలని ఉందని, వ్యంగ్యంగా, అవహేళన చేశారు. అలాగే, సమావేశాలు ఎంత కాలం నిర్ణయించాలి అనే విషయంలోనూ అచ్చెం నాయుడు చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి మరోమారు అదే రీతిలో అవహేళన చేశారు. అదేదో పిచ్చాపాటి ముచ్చట్లు అనంట్లుగా  పెద్దాయన ముచ్చట పడుతున్నారు, 26 వరకు నిర్వహిద్దామని అన్నారు. అంటే, ముందుగానే సభలో ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నాయకుని అవమానించే ప్రణాళికతోనే ముఖ్యమంత్రి సభను 26 వరకు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారని వేరే చెప్పనక్కరలేదు.

ఓ వంక అకాల వర్షాలు , వరదలు రాష్ట్రాన్ని అతలా కుతలం చేస్తున్నాయి, మరో వంక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీనావస్తకు చేరుకుంది....ఇలాంటి పరిస్థితిలో ... నీరో చక్రవర్తిలా జగన్ రెడ్డి  ఈ ఫిడేలు రాగాలు ఏమిటని రాజకీయ విశ్లేషకులు కూడా విస్తుపోతున్నారు. ‘ఎదుటి వారి వేదనను చూసి నవ్వుకునే నీవు ఏడ్చే రోజు ఒకటి తప్పక వస్తుంద’ని, బైబిల్ చెప్పిదో లేదో కానీ, అది రుజువైన వాస్తవం. ఇదే చంద్రబాబును ఉద్దేశించి, గతంలో ఓ పెద్ద మనిషి, ఈ రోజు నువ్వు మీ అమ్మ కడుపులోంచి ఎందుకు బయటకు వచ్చానా అని గుక్కపట్టి ఏడ్చేలా  చేస్తాను, అని సభలోనే శపధం చేశారు. చివరకు ఆ శపధం చేసిన అయన ఏమయ్యారో అందరికీ తెలుసు ..అలాగే ఆరోజు ఆయన ఆ మాటలు అన్న రోజున చప్పట్లు కొట్టిన పార్టీ ఎక్కడుందో ఏమైందో కూడా తెలుసు .. అందుకే .. దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి అంటుంది బైబిల్ .. జగ రెడ్డికి ఇదైనా తెలిసే ఉండాలి . తెలుసో లేదో .
 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.