డబ్బులు పంచినా రాని జనం.. జగన్ బస్సుయాత్ర తుస్సు!

Publish Date:Mar 30, 2024

Advertisement

ముఖ్యమంత్రి సభలకు కూడా జనం మొహం చాటేస్తున్నారు. దీంతో వైసీపీ ఎన్నికల ప్రచారం ఆరంభంలోనే హంసపాదు అన్నట్లుగా తయారైంది. జగన్ ఆర్భాటంగా ఆరంభించిన బస్సు యాత్ర తుస్సు మంటోదన్న భావన వైసీపీ క్యాడర్ లోనే వ్యక్తం అవుతోంది. బస్సు యాత్ర కు జన స్పందన అమోంగా ఉందన్న బిల్డప్ ఇవ్వడానికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలయ్యాయి. మరో వైపు ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి ప్రసంగం వినడానికి కూడా జనం ఇష్టపడటం లేదనడానికి  నిలువెత్తు నిదర్శనంగా  నెల్లూరు జిల్లా సీతారామపురంలో  జరిగిన సంఘటన నిలుస్తోంది. ఉదయగిరి లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం (మార్చి 28) సీతారాంపురంలో పర్యటించారు. తన ప్రచార రథంపై పర్యటించిన ఆయన జనాలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించారో  లేదో జనం లేచి వెళ్లిపోవడం మొదలెట్టారు. దీంతో నేతలు మైకుల్లోనే నాయకుడి ప్రసంగం వినండి, సభ అయిపోయిన తరువాత భోజనాలు కూడా ఉన్నాయి. దయచేసి వెళ్లిపోకండి అని వేడుకోవలసి వచ్చింది. ఇందుకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయింది. 

దీనిపై అధినేత సభలే జనం లేక వెలవెలబోతుంటే ఇంక ఆ పార్టీ నేతల సభల సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవడమెందుకు అంటూ పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. ఇక విషయానికి వస్తే... తొలి రెండు రోజులూ బస్సు యాత్ర తుస్సు మనడంతో వైసీపీ అలర్ట్ అయ్యింది. సీఎం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగన్ బస్సు యాత్రను విజయవంతం చేయడానికి వారు డబ్బు పంపిణీపై ఆధారపడ్డారు. ఎమ్మిగనూరు సభకు వచ్చిన మహిళలకు వైసీపీ నాయకులు డబ్బులు పంచుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.  సీఎం సభ కోసం వచ్చిన మహిళలను వైసీపీ నాయకులు ఓ చోటుకి చేర్చారు. డబ్బులు ఉంచిన కవర్‌లను మహిళలకు పంచారు.

ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు బెదరించ బెల్లించో, సొమ్ములు పంచో, మందు సరఫరా చేసో జనాలను తరలించిన వైసీపీ నేతలకు కోడ్ అమలులోకి వచ్చిన తరువాత అది అంత  ఈజీ టాస్క్ గా కనిపించడం లేదు. కోడ్ అమలుకు ముందు సభకు రాకపోతే పథకాలు ఇవ్వరనో, అక్రమ కేసులు బనాయిస్తారనో, దాడులకు పాల్పడతారనో భయంతో ఇష్టం లేకపోయినా బలవంతపు బ్రాహ్మణార్ధం అన్నట్లు జనం సభలకు వచ్చే వారు. ఎప్పుడైతే కోడ్ అమలులోకి వచ్చిందో జగన్ సభ అంటే చాలా జనమే కాదు, వైసీపీ క్యాడర్ కూడా లైట్ తీసుకుంటోంది.  దీంతో  సీఎం ఎమ్మిగనూరు సభకు ఎలాగైనా సరే జనాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో   బహిరంగంగానే  డబ్బులు పంచుతూ వైసీపీ నేతలు వీడియోకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఈ దృశ్యాలు  వైరల్ గా మారాయి. ఇక ఆ పంపిణీ కూడా సరిగ్గా జరగలేదంటూ పలువురు మహిళలు ఆందోళనకు దిగడంతో వైసీపీ పరువు గంగలో కలిసింది. వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి.. కొందరికి మాత్రమే వెయ్యి ఇచ్చి మిగిలిన వారికి తక్కువ డబ్బులు ఇచ్చారంటూ మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో వైసీపీ నేతలు ఎలాగోలా వారికి సర్ది చెప్పి సముదాయించారు. 

 బస్సులు పెట్టినా, డబ్బులు పంచినామద్యం పారించినా జగన్ సభలకు జనం అంతంత మాత్రంగానే వస్తున్నారు. ఆ వచ్చిన జనం కూడా జగన్ ప్రసంగం వినడానికి ఇష్టపడటం లేదు. డబ్బులు పుచ్చుకున్నాం కనుక వచ్చాం, హాజరు వేయించుకున్నాం ఇక చాలు అన్నట్లు మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నారు.   మరో వైపు పరదాలు లేకుండా జగన్ చేస్తున్న రోడ్ షోలో ఆయన ప్రజా నిరసనను ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. సీఎం ముఖ్యమంత్రి జగన్​కు కర్నూలు జిల్లాలో నిరసన సెగ తగిలింది. కోడుమూరు మండలం రామచంద్రాపురం వాసులు బిందెలతో నిరసన తెలిపారు. ఎమ్మిగనూరు బహిరంగ సభకు వెళుతుండగా మార్గమధ్యంలో  ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగా ఆయన బస్సును అడ్డుకున్నారు.  అలాగే వామపక్షాలు కూడా బస్సు యాత్ర సందర్భంగా నిరసనకు దిగి తాగునీటి సమస్య పరిష్కారం కోసం డిమాండ్ చేశాయి. కాగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.   

కాగా ఒక వైపు జగన్ సభకు జనం రావడం లేదు. అదే సమయంలో నిరసనలకు కూడా దిగుతుంటే మరో వైపు విపక్ష నేత చంద్రబాబు సభలకు జనం స్వచ్ఛందంగా లక్షల సంఖ్యలో తరలిరావడం చూస్తుంటే.. మే 13న జరిగే ఎన్నికలలో జనం   ఓటు ఎవరికో ఇప్పటికే నిర్ణయించేసుకున్నారని తేటతెల్లమౌతోంది. జగన్ ఓటమికి ఆయన బస్సుయాత్ర తుస్సుమనడమే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరో వైపు చంద్రబాబు సభలకు తండోపతండాలుగా జనం వెల్లువెత్తడం చూస్తుంటూ వచ్చే ఎన్నికలలో విజయం ఎవరిని వరించబోతోందన్నది అర్ధమైపోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.