గతం మరిచారా జగన్?

Publish Date:Jul 21, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కరోనా కాలం నాటి తీవ్ర కలకలానికి కారణమైన డాక్టర్ సుధాకర్ ఉదంతం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా  చర్చనీయాంశంగా మారింది.   కొవిడ్ సమయంలో తాము అందించిన వైద్య సేవలు, ఆరోగ్య రంగానికి చేసిన మేలు గురించి ప్రకటనలు చేయడంతో  పాటు రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదంటూ వైసీపీ విమర్శలు గుప్పించడంతో డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ నెటిజనులు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

 గతంలో కరోనా మహమ్మారి తొలి విడత ఉధృతంగా ఉన్న సమయంలో, నర్సీపట్నం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ కే. సుధాకర్ రావు ప్రభుత్వ వైద్యులకు, సిబ్బందికి ప్రాథమిక రక్షణ పరికరాలైన ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో లేవని బహిరంగంగా విమర్శించారు. ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు కనీస రక్షణ కల్పించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటి వైసీపీ సర్కార్..    సమస్యను పరిష్కరించాల్సింది పోయి, డాక్టర్ సుధాకర్ పై  సస్పెన్షన్ వేటు వేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే నెపంతో వేధింపులు ప్రారంభించింది.  

మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని,  చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి. పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేయడమే కాకుండా, ఆయన మానసిక స్థితి సరిగా లేదంటూ కేజీహెచ్‌కు, ఆ తర్వాత మానసిక చికిత్సాలయానికి తరలించారు. ఈ దారుణ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించి, పోలీసుల దాష్టీకంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ వేధింపులు, మానసిక ఒత్తిడి తాళలేక చివరకు సుధాకర్ గుండెపోటుతో కన్నుమూశారు. 

ఇక ప్రస్తుతానికి వస్తే.. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ కొవిడ్ సమయంలో తాము అద్భుతంగా పనిచేశామని, వైద్య కళాశాలలు నిర్మించామని చెప్పుకుంటూ.. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్నా అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ వైసీపీ విమర్శల పర్వం మొదలు పెట్టింది.  మందులు లేవు.. మాస్కులు లేవు అంటూ వైసీపీ సొంత మీడియా సోషల్ మీడియా కథనాలు వండి వారుస్తోంది.  కరోనా కేసులో క్రమంగా పెరుగుతున్నా పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు, ఏర్పాట్లు, వాక్సినేషన్ వంటివి ఏర్పాటు చేయలేదని, ఈ కారణంగా కరోనాతో చనిపోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆ కథనాల్లో పేర్కొంటోంది. దీంతో గతం మరిచారా జగన్ అంటూ.. డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ycp carona comments, netizens remember, sudhakar, incident

By
en-us Political News

  
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.