చాలు బాబూచాలు.. ప్రభుత్వ సలహాదారు నియామకాలపై పార్టీ శ్రేణుల్లోనే పెదవి విరుపు !

Publish Date:Nov 23, 2022

Advertisement

ఈ కలికాలంలో దేవుడు కరుణిస్తాడో? లేదో? కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం అస్మదీయులను తెగ కరుణించేస్తున్నారు. అయితే ఆయన కరుణ.. వైసీపీ శ్రేణుల్లోనే ఒకింత అసంతృప్తికి కారణమౌతోందంటున్నారు. సలహారుల పేరిట జగన్ ఎడాపెడా చేస్తున్న నియామకాల పట్ల వైసీపీలోనే చిర్రుబుర్రులు మొదలయ్యాయని అంటున్నారు.

తాజాగా గాయని మంగ్లీని.. శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌(ఎస్వీబీసీ)లో సలహాదారుగా నియమించడం పట్ల  వైసీపీలోనే  విస్మయం  వ్యక్తమౌతోంది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నటులు ఆలీ, పోసాని కృష్ణమురళీలకు ఇటీవల జగన్ ప్రభుత్వం.. సలహాదారు పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పలువురు సలహాదారుల నియామకాలు జరిగాయి. ఈ సలహాదారు నియామకాల పట్ల విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లల చెల్లింపులకు ఎగనామం పెట్టి, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వాలన్న ధ్యాసే లేకుండా వ్యవహరిస్తున్న సర్కార్ అస్మదీయులకు ఎడాపెడా లక్షల రూపాయల వేతనాలతో సలహాదారు పదవులు పందేరం చేయడమేమిటని వైసీపీ శ్రేణుల్లోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

జగన్ సర్కార్ బిల్లులు ఎగ్గొట్టిన కాంట్రాక్టర్లలో వైసీపీ వారూ ఉన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు.  తాజాగా మంగ్లీకి సలహాదారు పదవిని కట్టబెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు.  అయితే ఈ నియామకాల వెనుక పెద్ద కథే ఉందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  గతంలో అంటే.. 2019 ఎన్నికల వేళ.. అలీ, పోసాని, మంగ్లీలు ముగ్గురూ కూడా  వైసీపీ కోసం పని చేశారనీ.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలలో కూడా వీరి సేవలు వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వీరికీ పదవులను కట్టబెట్టారని అంటున్నాయి.

ఒక వేళ పదవులు ఇవ్వకుంటే వారు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయరన్న భయంతోనే జగన్ ముగ్గురికీ సలహాదారు పదవులు కట్టబెట్టారని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో అలీ, పోసానిలకు మంచి స్థానాలు కల్పిస్తానని జగన్ వాగ్దానం చేశారనీ, అందుకే సలహాదారు పదవులను వారికి కట్టబెట్టినా వారు ఒకింత అసంతృప్తితోనే ఉన్నారనీ, ఈ పరిస్థితుల్లో వారు వచ్చే ఎన్నికల్లో గతంలోలా పార్టీ కోసం చురుగ్గా పని చేసే అవకాశాలు అంతంత మాత్రమేనని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఇక మంగ్లీ విషయానికి వస్తే అలీ, పోసానిలకు పదవులు ఇచ్చి.. మంగ్లీని వదిలేస్తే ఆమె చిన్నబుచ్చుకుంటుందన్న ఉద్దేశంతోనే ఆమెకూ ఒక పదవి ఇచ్చారని అంటున్నారు. 

అదీకాక.. వచ్చేది ఎన్నికల సీజన్.. ఇప్పటికే జగన్ ఫ్యామిలీలోని వారంతా దాదాపుగా దూరం జరిగిపోయారని.. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున, పార్టీ కోసం సెలబ్రిటీల ప్రచారం లేకుంటే.. ఓట్లు రాలే పరిస్థితులు లేవన్న బెదురు జగన్ లో ఏర్పడిందంటున్నారు. అందుకే ఇప్పటికీ పార్టీనే అంటిపెట్టుకుని అసంతృప్తిని పెదవుల బిగువున అదిమిపెట్టుకుని సహనంతో వేచి చూస్తున్న ముగ్గురికీ సలహాదారు పదవులు కట్టబెట్టారన్న చర్చ అయితే పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ మాత్రం పదవులైనా ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో వీరు కూడా పార్టీ ప్రచారానికి అందుబాటులోకి రారన్న జంకే వారికి పదవులు కట్టబెట్టేలా చేసిందని అంటున్నారు. లేకపోతే మూడేళ్ల పాటు వారిని పూర్తిగా విస్మరించిన జగన్ ఇప్పటి కిప్పుడు హడావుడిగా సలహాదారు పోస్టులను వారి కట్టబెట్టి ఉండరని అంటున్నారు. అదలా ఉంచితే.. మంగ్లీకి ఎస్వీబీసీ సలహాదారు పోస్ట్ కట్టబెట్టడంతో.. గత ఎన్నికల సందర్భంగా ఆమె జగన్ కోసం ప్రచారం చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే గత ఎన్నికల వేళ ప్రచారం చేసినందుకు...  దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఆలీ, పోసాని, మంగ్లీలకు పదవులిచ్చి జగన్ వచ్చే ఎన్నికల్లో   పార్టీ కోసం పని చేస్తామన్ వాగ్దానం తీసుకున్నారని అంటున్నారు.  

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. జగన్ సలహాదారుల నియామకాలు మరింత జోరందుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే జగన్ సలహాదారులుగా నియమిస్తున్న వారి ప్రచారం రానున్న ఎన్నికలలో పార్టీకి ఎంత వరకూ మేలు చేస్తుందన్న అనుమానాలు పార్టీ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. అలీ కానీ, పోసాని కానీ, చివరాఖరికి మంగ్లీ కానీ పెద్దగా ప్రజాకర్షణ శక్తి ఉన్నవారు కాదని వారీ సందర్బంగా అంటున్నారు.  

By
en-us Political News

  
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.