పెద్దిరెడ్డి వర్గీయుల అరాచకత్వం!

Publish Date:Oct 22, 2023

Advertisement

ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయనని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఆయన మంత్రివర్గ సహచరులతో సహా అంతా  మూకుమ్మడిగా మీడియా ముందుకొచ్చి ఏపీలో జగనన్న పాలన సుభీక్షంగా, సంతోషంగా ఉందని  చెప్పుకుంటారు. రామరాజ్యం లాంటి జగనన్న రాజ్యంపై ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు కావాలనే బురద జల్లుతున్నాయని మాటల దాడికి దిగుతుంటారు. అయితే వాస్తవంగా   ఏపీలో పరిస్థితులు చూస్తే అసలు రాష్ట్రంలో స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతుంది. అప్పుడెప్పుడో కరోనా సమయంలో మాస్కులు లేవన్న దళిత వైద్యుడి దగ్గర నుండి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తుల వరకూ ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ వేధింపులకు గురి చేశారు. వీరిలో అవమానాలు భరించలేక మరిణించిన వారు కొందరైతే..   వైసీపీ శ్రేణులే దాడులు, చిత్రహింసలకు మరణించిన వారు మరి కొందరు. ప్రశ్నిస్తే దాడులు.. నిరసన తెలిపితే అరెస్టులు.. ఇదీ ఇప్పుడు ఏపీలో పరిస్థితి. 

ఆ మధ్య జరిగిన పుంగనూరు అల్లర్లు రాష్ట్ర ప్రజలెవరూ ఇంకా మరిచిపోలేదు. ఈ అల్లర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమంటూ ఆయనపై కేసులు కూడా నమోదు చేశారు. దీనిపై ఇంకా న్యాయస్థానాలలో విచారణ   కొనసాగుతోంది. నిజానికి ఈ అల్లర్లకు కారణం వైసీపీ నేతలు, కార్యకర్తలే. పక్కా ప్రణాళికతో చంద్రబాబు రాకను అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో రాళ్ళూ, కర్రలతో వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. కానీ, దీన్ని వక్రీకరించి టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అదలా ఉండగా  ఇప్పుడు అదే పుంగనూరులో టీడీపీ కార్యకర్తలను అమానుషంగా వేధించి అర్ధనగ్నంగా మాకంయి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మంత్రి పెద్ది రెడ్డి మనుషేలే ఈ దారుణానికి ఒడిగట్టారు.  

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు పలు నిరసన కార్యకమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందర్ రావు, రమేష్ లు అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి నాడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సైకిల్ యాత్ర ప్రారంభించారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఈ సైకిల్ యాత్ర తలపెట్టారు. మధ్యలో వచ్చే దేవాలయాల్లో చంద్రబాబు పేరిట పూజలు చేస్తూ ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అక్టోబర్ 19) వారి సైకిల్ యాత్ర పుంగనూరు చేరుకుంది.. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పుంగనూరు మండలం సుగాలి మిట్ట వద్ద టీ తాగేందుకు సైకిళ్లు ఆపారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు వారిని చుట్టుముట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు భయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడ నుండి వెళ్లే ప్రయత్నం చేశారు.

కానీ, వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఇది పెద్దిరెడ్డి అడ్డా.. పుంగనూరులో అడుగుపెట్టి వెనక్కి వెళ్ళగలరా? చంద్రబాబునే రానివ్వలేదు. అటువంటిది మీరు టీడీపీ జెండాలతో ఎలా వచ్చార్రా.. అసలు శ్రీకాకుళం నుంచి ఏం పీకేందుకు వచ్చార్రా అంటూ రెచ్చిపోయారు. అంతే కాదు, టీడీపీ జెండాలు, కండువాలు తీయించి, వారితో చొక్కాలు విప్పించి అర్ధనగ్నంగా మార్చి సైకిళ్ళు నెట్టుకుంటూ వెళ్లండని హుకుం జారీ చేసి అక్కడ నుండి పంపించారు. ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుండగా ఏపీలో పరిస్థితులపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు మనం స్వాతంత్య్ర దేశంలోనే ఉన్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడెక్కడో రాయలసీమలో ఉండే ఫ్యాక్షన్ పరిస్థితులను జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తీసుకొచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. అవసరం లేకున్నా రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులకు ఏపీలో ఇంత జరుగుతున్నా కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది వీడియో రూపంలో బయట పడింది కానీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చోటా ఇదే పరిస్థితి ఉందని.. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.