వైసీపీ బస్సుయాత్ర.. మరో పరాభవం తప్పదా?

Publish Date:Aug 27, 2023

Advertisement

ఏపీలో వైసీపీకి ఉక్కపోత మొదలైంది. ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నది. కుంటుపడిన అభివృద్ధి, నెరవేరని హామీలు, కక్ష పూరిత రాజకీయాలు, పన్నుల బాదుడు, పెరిగిన ధరలు, భూ కబ్జాలు, నేతల రౌడీయిజం, ఎదిరించిన వారిపై బెదిరింపులు ఇలా ఒక్కటేమిటి అన్నీ కలిసి ఇప్పుడు ప్రజలలో వైసీపీ నేతలు పలుచన అయిపోయారు. ప్రశాంతంగా జీవనం సాగించాల్సిన ప్రజలు శాంతిభద్రల లేమితో బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన రావడం, అభివృద్ధి కుంటుపడి  ఉపాధి కరవై వలసలు అనివార్యం కావడంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అదే సమయంలో ప్రతిపక్ష నేతలు తమకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో ప్రజలలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్లేందుకు మొహం చాటేస్తున్నారు. నాలుగేళ్ళలో చేసిందేంటని ప్రజలు నిలదీస్తుండడంతో వైసీపీ నేతలు సహనం కోల్పోతున్నారు. దీంతో కొందరు వైసీపీ నేతలు ప్రజలపై చిందులేయడంతో ప్రజలు వెనకా ముందు లేకుండా కడిగిపారేస్తున్నారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గడపగడపకు ప్రభుత్వం, ఏపీ నీడ్స్ జగన్ లాంటి కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికీ ఈ కార్యక్రమాలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అయితే, పలు చోట్ల ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలకు మొహం చాటేశారు. ప్రజల ఆగ్రహాన్ని చవిచూసిన నేతలు ఏదో మొక్కుబడిగా ఈ కార్యక్రమాలను మమా అనిపించేశారు. కాగా, ఇప్పుడు సీఎం జగన్ మరో కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు. పాజిటివ్ నెగటివ్ ప్రజల నుండి ఎలాంటి స్పందన  వచ్చినా  ఇందుకోసం వంద రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వైసీపీ బస్సు యాత్రగా దీన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తున్నది. 

వైసీపీ ఈ వంద రోజుల బస్సు యాత్రను ఏ జిల్లాకు ఆ జిల్లా అధ్యక్షుల అధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంచార్జిలు అందరూ పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది. బస్సుయాత్ర ద్వారా అందరు వైసీపీ నేతలు నియోజకవర్గాలను చుట్టేసి అన్ని వర్గాలను కలవాలన్నది ఆలోచన. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను దగ్గర నుండి ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారాలను కూడా వాళ్ళ ద్వారానే తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ మొదటి వారం నుండి వంద రోజుల పాటు నేతలంతా ప్రజలలో ఉండాలని.. ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన నిర్ణయాలకు వెనకబడబోమని వైసీపీ పెద్దల నుండి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తున్నది. ప్రజల స్పందనను కూడా ముందే ఊహించిన కార్యక్రమ రూపకర్తలు.. ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చినా కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరాల్సిందేనని డిసైడ్ చేశారట.

అయితే, ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ నేతలకు మరో సినిమా తప్పదా అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాలలో  వ్యక్తమౌతున్నాయి. కేవలం ప్రజల నుండి మాత్రమే కాదు గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నేతలలో కూడా కొందరు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సంక్షేమ పథకాల పేరిట ఎవరితో ఎలాంటి అవసరం లేకుండా బటన్ నొక్కి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తుండగా.. అభివృద్ధి పనులపై ప్రజల నుండి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని.. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పనులు కావడం లేదని, చేసిన పనులకు కూడా బిల్లులు రాక తీవ్రంగా నష్టపోయామని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులలో వారి వద్దకు వెళ్తే స్పందన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

మరోవైపు ఈ బస్సు యాత్ర జిల్లా అధ్యక్షుల చేతుల మీదగా జరగాలని ఆదేశించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షుల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులతో పాత నేతలకు ఇంకా సమన్వయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షులు పెత్తనం చెలాయించడం పాత నేతలు ఎలా తీసుకుంటారన్నది పలు అనుమానాలకు తావిస్తుంది. పలు ప్రభుత్వ వర్గాలలో కూడా ప్రభుత్వంపై పీకల వరకు కోపం దాగి ఉంది. నిధుల కొరతతో బిల్లులు రాక.. స్థానిక నేతల నుండి తీవ్ర ఒత్తిళ్లు ఉండగా.. ఇప్పుడు అక్కడిక్కడే ఎమ్మెల్యేలు సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలివ్వనున్న నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ప్రశ్నార్ధకమే. మొత్తంగా చూస్తే ఘోర విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్తే ఏమవుతుందన్నది ఆసక్తికరంగా కనిపిస్తుంది.

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.