అయ్యయ్యో వై నాట్ 175 అంటే అర్థం ఇదా?

Publish Date:Nov 11, 2023

Advertisement

వైసీపీ కనీసం క్యాడర్ నైనా కాపాడుకోవడానికి వైనాట్ 175 అన్న ప్రచారాన్ని గట్టిగా వాడుకుంటోంది. అయితే అదేమంత సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించడం లేదు. ఆ పార్టీ ప్రస్తుతం నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సుయాత్ర కు జనాలు సరే.. పార్టీ కార్యకర్తలు కూడా ముఖం చాటేస్తున్నారు. ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ వైనాట్ 175 అన్న జగన్  నినాదాన్ని నెటిజన్లు సెటైర్లతో ఏకి పారేస్తున్నారు.

సామాజిక బస్సు యాత్ర సభల కోసం పెద్ద సంఖ్యలో కుర్చీలు వేసి ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తుంటే.. ఆ కుర్చీల్లో కూర్చునేందుకు పదుల సంఖ్యలో కూడా జనం ఉండటం లేదు. ఇందుకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వై నాట్ 175 అనడం తరువాత.. ముందు సాధికార బస్సుయాత్ర సభలలో 175 కుర్చీలు నిండటం లేదు చూసుకోండంటూ ఎద్దేవా చేస్తున్నారు. 
వైసీపీ ఇన్ చార్జీలు, పార్టీ స్థానిక నాయకులు, మంత్రులు ఇలా అంతా కలిసి బస్సుయాత్రలు చేస్తున్నా జనం అటుకేసి కూడా చూడటం లేదు.

ఈ తతంగాన్నంతా సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ చేస్తున్న నెటిజన్లు.. జగన్ పదేపదే చెబుతున్న వై నాట్ 175కు అసలైన అర్ధం సామాజిక సాధికార బస్సు యాత్ర సభలలో కనీసం 175 కుర్చీలనైనా నింపండి అనేనా అంటున్నారు. వైసీపీ సభలకు 175 సీట్లు నిండటం లేదు కానీ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో వైసీపీ విజయం సాధించాలంటూ పార్టీ నేతలకు జగన్ ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటే.. ఉట్టికెగరలేనమ్మ సామెత గుర్తుకు వస్తోందంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజనులు.  

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.