పస లేని విమర్శలు, ఆధారాలు లేని ఆరోపణలు.. వైసీపీ నేతలకు ఇదే తెలుసా?

Publish Date:Oct 7, 2023

Advertisement

చిన్న చిన్న విషయాలకు కూడా నానా రాద్ధాంతం చేసే వైసీపీ నేతలు  గత నాలుగు నెలలుగా హఠాత్తుగా మౌన ముద్రలోకి వెళ్లిపోయారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని విపక్షాలు విమర్శలతో చెండాడేస్తున్నా ఖండించేందుకు కూడా మీడియాకు ముఖం చూపించని పరిస్థితి.  అయితే ఇప్పుడు   ఒక్కొక్కరుగా ఎక్కడ మైకు దొరికితే అక్కడ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.   నిన్న మొన్నటి వరకూ   మీడియా సంస్థలు పిలిచినా పలకని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు  కలుగులో నుండి బయటకి వచ్చిన ఎలుకల  మైకులు పట్టుకుని తెలుగుదేశం, జనసేన పై విమర్శలు గుప్పిస్తూ నానా హడావుడి చేసేస్తున్నారు. ముఖ్యంగా స్కిల్  కేసులో చంద్రబాబును దోషిగా ఆరోపిస్తూ మీడియా ముందు మాట్లాడి జగన్ దృష్టిలో పడేందుకు ఎక్కడ లేని ఆత్రం కనబరుస్తున్నారు.

పేరుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు అయినా.. సకల శాఖల మంత్రిగా పెత్తనం, ఆధిపత్యం చెలాయిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు.. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ధర్మాన కృష్ణ ప్రసాద్, ప్రస్తుత మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ఇలా వరసబెట్టి అందరూ మీడియా సమావేశాలలో మాట్లాడేస్తున్నారు. మీడియా సమావేశాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నా ఏదో కూడబలుక్కుని మాట్లాడుతున్నట్లు అందరూ చంద్రబాబు అవినీతి పరుడు అంటూ  ఒక్క ఆధారం కూడా చూపకుండా ఆరోపణలు గుప్పించేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని పనిచేస్తున్నాడంటూ పాత పాటనే, అవే  రొట్ట కొట్టుడు విమర్శలే గుప్పిస్తున్నారు. అదే ఆధారాలులేని ఆరోపణలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తున్నారంటూ  మరో సారి అసత్య ప్రచారానికి తెరలేపారు.  ఏపీలో అలజడులకు తెలుగుదేశం కుట్ర పన్నుతోందని ప్రజలను భయాందోళనకు గురిచేసి,  మళ్ళీ  జగనే కావాలంటూ , రావాలంటూ   ప్రజలను మభ్యపెట్టే వృధా ప్రయత్నం చేస్తున్నారు.

 గత నెల రోజుల వరకూ ఎక్కడా కనిపించని ఈ నేతలంతా ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక్కసారిగా దండయాత్ర మొదలు పెట్టడం వెనుక  చంద్రబాబు అక్రమ అరెస్టుతో  జగన్ పైనా, జగన్ ప్రభుత్వంపైనా వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని ఏదో మేర చల్లార్చి, తమకు అలవాటైన ఎదురుదాడి విధానంతో ప్రజలలో చంద్రబాబును దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. ఇదంతా  వైసీపీ అధిష్టానం నుండి వచ్చిన ఆదేశాలతోనే  జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడపగడపకు అనుభవం తురవాత ప్రజలకు ముఖం చూపించేందుకు కూడా ధైర్యం చేయని మంత్రులు, నియోజవర్గాలను కూడా వదిలేసి పత్తాలేకుండా పోయిన  ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలుగుదేశంపై బురదజల్లేందుకు క్యూకడుతున్నారు.   స్కిల్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులను ప్రస్తావిస్తూ ఊకదంపుడు ఆరోపణలతో ప్రజలను నమ్మించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.  

వాస్తవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా పరిపాలనను ఎప్పుడో పక్కన పెట్టేశారు. కేవలం విపక్షంపై విమర్శలు చేసేందుకే పరిమితమయ్యారు.  ఆ మధ్య పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో తనను కించపరిచారంటూ బయటకి వచ్చిన అంబటి రాంబాబు.. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అరెస్టుపై మాట్లాడేందుకు మాత్రమే బయటకు వచ్చారు. ఆయన శాఖ నీటిపారుదలపై ఒక్క రివ్యూ చేసింది లేదు.. తన శాఖలో ఏ పనులు జరుగుతున్నాయో ప్రజలకు చెప్పింది కూడా లేదు. దాదాపుగా అందరు మంత్రులదీ అదే పరిస్థితి. మంత్రుల బాధ్యత కేవలం ముఖ్యమంత్రి భజన, ప్రతిపక్షాలపై నిరాధార ఆరోపణలు చేయడమేనన్న చందంగా వారి తీరు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు తరువాత జనం ముందు ఎవరైనా జగన్ పేరు, వైసీపీ పేరు ప్రస్తావించడానికే భయపడే పరిస్థితి నెలకొంది.

అంతగా ముఖ్యమంత్రిపైనా, అధికార పార్టీపైనా ప్రజలలో ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. దీంతో అనివార్యంగా  ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మళ్లీ అవే పాత విమర్శలు, ఆరోపణలతో  మంత్రులు, ఎమ్మెల్యేలు భయం భయంగానైనా బయటకు వస్తున్నారు.  జగన్ ఆదేశించారు కనుక.. తమ పదవి ఏంటో, స్థాయి ఏంటో కూడా మరచిపోయిన నేతలు తెలుగుదేశంపై విమర్శలు గుప్పించేసి చేతులు దిలిసేసుకుంటే పోలా అన్నట్లుగా మీడియా ముందు మాటకు ముందు, మాటకు తరువాత చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ పస లేని, ఆధారాలు లేని ఆరోపణలు గుప్పించేస్తున్నారు. 

By
en-us Political News

  
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.