యుగపురుషుడి విగ్రహంపైనే దాడినా? వైసీపీ పతనానికి నాందినా? 

Publish Date:Jan 3, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంటిపైకే వైసీపీ ఎమ్మెల్యే దాడికి దిగడం గతంలో కలకలం రేపింది. అసెంబ్లీ వేదికగా నారా భువనేశ్వరిపై అందరూ తలదించుకునేలా అసభ్యకర కామెంట్లు చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. టీడీపీ కార్యకర్తలు దేవాలయంగా కొలుచుకునే పార్టీ ప్రధాన కార్యాలయంపైనా వైసీపీ అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయి. ఇవన్ని వైసీపీ నేతలు, కార్యకర్తల దురాగాతాలకు కొన్ని ఉదాహారణలు మాత్రమే.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలే టార్గెట్ గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ కార్యాలయాలపైనా దాడులు జరిగాయి. టీడీపీ నేతలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఏకంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. మాచర్ల నియోజకవర్గంలోని దుర్గిలో పట్టపగలే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు వైసీపీ నేత. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.

దుర్గి ఘటనకు నిరసనగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపిచ్చింది. మాచర్లకు వెళ్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ నేతల అరెస్టులపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్ర‌భుత్వంపై వెల్లువెత్తుతోన్న‌ ప్ర‌జాగ్ర‌హాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు దివంగ‌త‌  తార‌క‌రామారావు విగ్ర‌హాల ధ్వంసానికి వైసీపీ తెగ‌బ‌డ‌టం చాలా దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. దుర్గి, తాడికొండలో మ‌హానాయకుడు ఎన్టీఆర్ విగ్ర‌హాలని విద్వేషంతో ప‌గ‌ల‌గొట్టారన్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌తిప‌క్షంపైనా, ప్ర‌శ్నించే ప్ర‌జ‌ల‌పైనే కాదు.. దేవతామూర్తులు, మ‌హ‌నీయుల విగ్ర‌హాల‌పైనా దాడులు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయని నారా లోకేష్ విమర్శించారు. ఎన్టీఆర్ విగ్ర‌హాల విధ్వంసంతో వైసీపీ త‌న ప‌త‌నాన్ని తానే కొని తెచ్చుకుంటోందన్నారు. అధికార‌ మ‌దంతో ర‌హ‌దారిపై ఉన్న విగ్ర‌హాల‌ను కూల‌గొడుతున్న జ‌గ‌న్‌రెడ్డి అండ్ కో... ప్ర‌జ‌లు త‌మ గుండె గుడిలో క‌ట్టుకున్న ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఎప్ప‌టికీ కూల‌దోయ‌లేరని నారా లోకేష్ అన్నారు. 

దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేత ధ్వంసం చేయడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  రాష్ట్రంలో నీ తండ్రి విగ్రహాలు తప్ప మహానుభావులవి ఉండకూడదా అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడి, మారణాయుధాలతో ప్రజలను భయపెట్టిన వారిపై ఐపీసీ 294, 427 లాంటి నామమాత్రపు కేసులు పెట్టారన్నారు. హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.  విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళన తెలిపిన వారిపై క్రిమినల్ కేసులు బనాయిస్తారా అని మండిపడ్డారు. టీడీపీ వారిపై పెట్టిన కేసులను తక్షణమే పోలీసులు వెనక్కి తీసుకుని, అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పరిపాలన చేతగాక దుర్మార్గాలకు సీఎం జగన్ విధ్వంసాలకు పాల్పడుతున్నాడన్నారు. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని రంగంలోకి దించి రాష్ట్రంలో విధ్వంసాలకు కుట్ర చేస్తున్నారన్నారు. తాడికొండ, దుర్గి లలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం... చిత్తూరులో టీడీపీ దిమ్మె ధ్వంసం వంటి ఘటనలే దీనికి సాక్ష్యమని ప్రత్తిపాటి పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బెదిరించాలని చూస్తే భయపడేది లేదన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను దేబ్బతీయడమేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. వైసీపీ విధ్వంసక చర్యల కొనసాగింపుగానే విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. జగన్ ఆటవిక పాలనలో సామాన్యులతో పాటు మహానుభావుల విగ్రహాలకూ రక్షణ కరవైందన్నారు. సీఎం జగన్ తెలుగు ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పి, ప్రభుత్వ ఖర్చుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. 

దుర్గి గ్రామంలో అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టపగలు జనం చూస్తూ ఉండగా ఇనుప మలాట్‌తో పగులకొట్టడం అమానుషమని టీడీపీ పొలిట్‌‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. అక్కడ పోలీసులు ఏమీ చేయరన్న ధైర్యంతో చేసిన పని అది అని అన్నారు. స్థానిక పోలీసులు అధికార పార్టీతో కుమ్ముక్కవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక అధికారులపై  జిల్లా ఎస్పీ విషాల్ గున్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్‌ఐపై ఇప్పటికే చాల ఆరోపణలున్నాయని వర్ల రామయ్య తెలిపారు.  

By
en-us Political News

  
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.