వైసీపీ నేతల పుష్ఫ డైలాగ్‌లు.. జగన్ మెహర్బానీ కోసమేగా?

Publish Date:Jul 14, 2025

Advertisement

రప్పా.. రప్పా.. డైలాగ్‌పై పేటెంట్ తీసుకున్నట్లు దాన్నే స్లోగన్‌గా మార్చేసుకుంటున్నారు వైసీపీ నేతలు ... జగన్ సైతం ఆ డైలాగ్‌‌ వాడకాన్ని సమర్ధించడంతో ఆయనతో వీరతాళ్లు వేయించుకోవడానికి ఎవరికి వారు ఆ పుష్ఫ డైలాగ్ తెగ రిపీట్ చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు వరకు ఆ డైలాగ్ వాడుతూ కార్యకర్తలను రెచ్చ గొడుతూ.. పోలీసులకు వార్నింగులిస్తున్నారు.

కృష్ణాజిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో పాల్గొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని రప్పా.. రప్పా..డైలాగ్ పై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లోకేష్‌ రెడ్ బుక్ అంటున్నాడు.. మీరు కూడా రప్పా.. రప్పా అంటున్నారు.. ఏదైనా పని చేయాలంటే రప్పా రప్పా అనడం కాదు.. చీకట్లో కన్నుకొడితే పని అయిపోవాలని పేర్నినాని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మూడు నాలుగు రోజులుగా పేర్ని నాని ఎక్కడకు వెళ్లినా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు.

నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తల విస్తృత  సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటాసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి కూడా  సినిమా స్టైల్లో డైలాగులు వల్లె వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు సృష్టిస్తున్నారని..  కూటమి నాయకులకు వత్తాసు పలుకుతున్న అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారీ వార్నింగ్ ఇచ్చారు.  వైసిపి 2.0 అంటే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే టిడిపి నాయకుల  తుకులు ఎలా ఉంటాయో చూస్తాం.. అంటూ అనుచిత బాషలో చెలరేగిపోయారు ఓబుల్‌రెడ్డి.

మరోవైపు  విద్యాశాఖ మాజీమంత్రి ఆదిమూలపు సురేష్‌కు సైతం రప్పా..రప్పా.. పూనకం రావడం విశేషం. ప్రకాశం జిల్లా కొండేపి వైసీపీ ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ పార్టీ  సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలని రెచ్చగొడుతూ  చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుండి కొండేపి నియోజకవర్గంలో మరో లెక్క అంటూ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడి కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కూడా అదే మంత్రం ఎత్తుకున్నారు.. ఆ ఫ్లోలో రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ధ్వజమెత్తిన ఆయన.. రాబోయేది  వైసీపీ ప్రభుత్వమని సిఐని విఆర్ లో  పెట్టిస్తానని.. జైల్లో పెట్టించి, ఊచలు లెక్కిపెట్టిస్తానని హెచ్చరించారు .
ఒకవైపు కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కార్యక్రమాలు నిర్వహస్తోంది. సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు జరిగాయో తెలుసుకొని, అర్హత కలిగి ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల లబ్ది పొందలేని వారికి సంక్షేమ పథకాలను అందజేసేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే,  మంత్రులు వాడవాడకు,ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తో పాటు స్థానిక సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. గెలిచిన తరువాత ఏసీ గదులకు, సొంత కార్యాలయాలకు ... దూరపు నగరాలకు పరిమితం అయిన నేతలు ప్రజల్లోకి వెళ్లటం మొదలు పెట్టారు. దీంతో ప్రజల్లో కూటమి నేతలకు మంచి ఆదరణ లభిస్తోందంటున్నారు. అది గమనించిన వైసీపీ అధిష్టానం టీడీపీ మ్యానిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ పథకాల లో కొన్ని పథకాలను అమలు చెయ్యలేదని దానిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించింది. దీంతో విద్రోహ దినం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితం రాలేదు. 

ఆ క్రమంలో వైసీపీ అధిష్టానం వెంటనే .. బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ .. పేరుతో కార్యక్రమానికి పిలుపునిచ్చి నేతలను ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించింది. దీంతో ప్రజల్లోకి వెళ్లేందుకు వారు ఏ మార్గం దొరక్క  కార్యకర్తలను రెచ్చగొడుతున్నారంట.  వైసీపీ అధ్యక్షుడి కార్యక్రమాల్లో కూడా అదే ఉద్దేశ్యంతో కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేయిస్తుండటం, వాటిని జగన్ సమర్ధిస్తుండటం అందులో భాగమే అంటున్నారు. జగన్ ఎక్కడకు వెళ్లినా అక్కడ భారీ జనసమీకరణతో పాటు ఏదో ఒక గొడవ సృష్టిస్తూ చర్చల్లో నిలవడడమే పనిగా పెట్టుకున్నారు. 

పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఉమ్మడి క‌ృష్ణా జిల్లాలో ఇప్పటికే నాలుగైదు కేసులు నమోదయ్యాయి. పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన కాటసాని ఓబుల్ రెడ్డిపై బనగానపల్లె స్టేషన్లో కేసు నమోదు అయింది. కూటమి నేతలు, పోలీసులను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తానంటున్న పినిపే విశ్వరూప్ వంటి వారిపై కూడా కేసు పెట్టడానికి కూటమి శ్రేణులు సిద్దమవుతున్నాయి. మొత్తమ్మీద ఈ రప్పా.. రప్పా.. రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.