వైసీపీ ధనయజ్ణం.. జల భగ్నం.. అదే తెలుగుదేశం ఆయుధం

Publish Date:Aug 3, 2023

Advertisement

మాట తప్పం.. మడమ తిప్పం.. ఒక్కసారి మాట ఇస్తే దానికే కట్టుబడి ఉంటా.. మాట ఇస్తే చేస్తా అంతే. ఇదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి చెప్పిన మాట. కానీ, ఒక్కసారి అధికారం దక్కించుకొని కుర్చీ ఎక్కాక ఆయన రివర్స్ విధానాలలాగే ఆయన నినాదాలు, హామీలూ కూడా రివర్స్ గేర్ లోనే అమలౌతున్నాయి.  అందుకే మద్యపాన నిషేధం, శాసన మండలి రద్దు వంటి వాటిలో నిర్మొహమాటంగా  యూ టర్న్ తీసుకున్నారు. ఇక జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న నవరత్నాలలో మూడు నాలుగు రత్నాలు ఎప్పుడో  కంకరరాళ్లుగా మారిపోయాయి. జగన్ నవరత్నాలలో ఫీజ్ రీఎంబర్స్ మెంట్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, మద్యపాన నిషేధం, రైతు భరోసా, పేదలందరికీ ఇల్లు, రూ.3 వేల పెన్షన్, అమ్మఒడి, ఆసరా చేయూత ఉండగా.. ఇందులో ఇప్పటికి ఏదీ పూర్తిగా అమలు కాలేదు. కావడం లేదు.

పెన్షన్లు ఇప్పటికీ రూ.3 వేలు కాలేదు. రైతు భరోసాలో కేంద్ర వాటా కలుపేసుకుని ఏదో గొప్పగా చేసేస్తున్నామంటూ సొంత జబ్బలు చరిచేసుకుంటున్నారు జగన్. అమ్మ ఒడికి ఇంటికి ఒకరికే అనే వంకలు పెట్టారు. లబ్ధి దారుల విషయంలోనూ భారీగా కోతపెట్టారు. ఇక ఆరోగ్య శ్రీ సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మేడు. బిల్లులు ఇవ్వడం లేదని ఆసుపత్రులలో సేవలు నిలిపేస్తున్నారు. ఫీజ్ రీఎంబర్స్ మెంట్ చెల్లించడం లేదని సంస్థలు విద్యార్థులతో ఫీజులు కట్టించుకొని ప్రభుత్వం ఇచ్చినపుడు తిరిగి చెల్లిస్తామని చెప్తున్నాయి. ఇక మధ్య నిషేధం ఊసే లేదు. ఇక జల యజ్ఞం కాస్తా జల భగ్నంగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ నవరత్నాల్లో 4వ రత్నం జలయజ్ఞం గత 4 ఏళ్లలో నవ్వులపాలైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తిచేస్తామని, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని ఇచ్చిన హామీకి జగన్ తిలోదకాలిచ్చేశారు. ఫలితంగా ప్రాజెక్టులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీనినే ఇప్పుడు తెలుగుదేశం ఆయుధంగా మలచుకుంటున్నది.

జగన్ గత ఎన్నికలలో ఏ హామీలైతే ఇచ్చి అమలు చేయలేదో.. ఆ హామీలనే  ఇప్పుడు తెలుగుదేశం ఆయుధాలుగా మార్చుకుని జగన్ సర్కార్ పై ఎక్కుపెడుతున్నది.  అలా ఇప్పుడు చంద్రబాబు మొదలు పెట్టిందే ప్రాజెక్టుల సందర్శన. దానికి పెట్టుకున్న పేర్లే 'జలభగ్నమైన జలయజ్ఞం', 'భగీరథుడు చంద్రబాబు.. భస్మాసురుడు జగన్'. జగన్ అంటే చెప్పింది చేయడని సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు టీడీపీ కంకణం కట్టుకుంది. చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులెలా పరుగులు పెట్టించిందీ, ఈ 4ఏళ్లలో ప్రాజెక్టులెలా పడకేసిందీ ఇంకా జనం కళ్లముందే ఉంది. సోమవారం పోలవరం వంటి నినాదాలు ఇంకా ప్రజల చెవులలో వినిపిస్తూనే ఉన్నాయి. తాను కూడా ఒక ఇంజనీర్ గా, ఒక మేస్త్రీగా, ఒక కూలీగా సోమవారం సోమవారం పోలవరంలో అడుగుపెట్టి కాంట్రాక్టర్లను, అధికారులను పరుగులు పెట్టించిన దృశ్యాలు ఇంకా ప్రజల కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి. నీటి పారుదల శాఖను నోటి పారుదల శాఖగా మార్చి వైసీపీ మంత్రులు చెప్పిన వాయిదాల గడువులు సోషల్ మీడియాలో మారుమ్రోగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు నడుం బిగించారు. ఇంకేముందు ఈ వ్యవహారం ప్రజల మధ్యకి వెడితే   జగన్ సర్కార్ ను జనం ఛీకొట్టడం ఖాయమని భావించిన వైసీపీ శిబిరంలో కల్లోలం మొదలైంది. పోలవరానికి పట్టిన శని జగన్, రాయలసీమ ద్రోహి జగన్ అంటూ చంద్రబాబు నిప్పులు చెరుగుతుంటే వైసీపీ నేతల కళ్ళలో నెత్తుటి ధార కనిపిస్తుంది. ఆధునిక దేవాలయాల్లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను పాడుబెడితే సమాజానికే అరిష్టం అంటూ టీడీపీ నేతలు గొంతెత్తి స్లొగన్స్ ఇస్తుంటే వైసీపీ కార్యకర్తలకు ఊపిరి అందడం లేదు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా సమాజాన్ని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టులపై శీతకన్ను వేయడం లేదని టీడీపీ ప్రచారం మొదలు పెడితే వైసీపీ సమాధానం చెప్పుకోలేక హ్యాండ్సప్ అనేస్తున్నది.

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.