కడప గడపలో మసకబారుతున్న వైఎస్ కుటుంబ ప్రతిష్ఠ

Publish Date:Nov 21, 2022

Advertisement

కడప జిల్లా అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేది వైయస్ ఫ్యామిలీ.. అలాంటి జిల్లాలో ఆ కుటుంబం తన ఉనికిని కోల్పోయే పరిస్థితులు వచ్చేశాయా? అంటే సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు అవునని స్పష్టం చేస్తున్నారు. కడప లోక్‌సభ సభ్యుడు వైయస్ ఆవినాశ్ రెడ్డి.. పర్యటన సందర్బంగా ఓ మహిళ చేసిన వ్యాఖ్యల తాలూకూ  ఓ వీడియో.. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైయస్ ఫ్యామిలీకి కొత్త చిక్కులు మొదలైనాయంటూ సామాజిక మాధ్యమం వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి 2019 ఎన్నికలు అయిన కొంత కాలం వరకు ఉమ్మడి కడప జిల్లా... వైయస్ ఫ్యామిలీకి కంచుకోటగానే ఉండేది.. అయితే  వైఎస్ తనయుడు,  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత..   జిల్లాలో వైఎస్ కుటుంబంపై వ్యతిరేకత ప్రబలుతోందని నెటిజన్లు అంటున్నారు.  
 
ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు.. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య...  అంతకు కొద్ది రోజుల ముందు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో  అప్పటి విపక్ష నేత జగన్‌పై కొడి కత్తి దాడి.. అలాగే  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లి  విజయమ్మ..  సోదరి షర్మిలలు.. పక్క రాష్ట్రానికి పరుగులు తీయడం.. అదే విధంగా వివేకా కుమార్తె సునీత  తన సోదరుడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా  తన తండ్రి  హత్య కేసులో తనకు న్యాయం జరగడం లేదు, ప్రభుత్వమే ఈ హత్య కేసు దర్యాప్తును అడుగడుగునా అడ్డుకుంటోందంటూ సుప్రీంకోర్టు మెట్లక్కడం.. వంటి సంఘటనలతో పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ ప్రభ మసకబారుతోందని అంటున్నారు.  వివేకా హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి.. ఈ అత్యంత కిరాతక హత్య ఇంటి దొంగల పనేనంటూ సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడంతో జిల్లాలో వైఎస్ కుటుంబ అభిమానులు ఒక్క సారిగా ఆ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. ఇక  జిల్లాల విభజనలో భాగంగా.. అన్నమయ్య జిల్లా ముఖ్య కేంద్రం రాజంపేట కాకుండా  రాయచోటిని ఎంపిక చేయడంపై కూడా జగన్ పై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

అలాగే సొంత బాబాయి వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకే కాదు.. కోడికత్తి కేసును విచారిస్తున్న ఎన్ఐఏకు సైతం..   జగన్ ప్రభుత్వం సహకరించకపోవడంతో వీటి వెనుక ఉన్నది ఎవరో చూచాయిగానైనా అర్ధం చేసుకున్న కడప జిల్లా వాసులు జగన్ విశ్వసనీయత పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   

అదీకాక.. ఉమ్మడి కడప జిల్లాలోని పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కూడా ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని ఇప్పటికే ఓ నివేదిక జగన్ కు అందిందని చెబుతున్నారు.  ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో 175కి 175  అసెంబ్లీ స్థానాలను కైవశం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ కు సొంత జిల్లా లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని నెటిజన్లు అంటున్నారు.

By
en-us Political News

  
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.