మరో సారి ఆ పదవి చేపట్టను.. నారా లోకేష్

Publish Date:Jan 27, 2025

Advertisement

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఏ విధంగా చూసినా ఒక ప్రత్యేక నేత. ఆయన ఉన్నది ఉన్నట్లు చెబుతారు. ఎలాంటి శషబిషలూ ఉండవు. ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ ఆయన అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అరహరం ఆలోచించే నారా లోకేష్ సోమవారం (జనవరి 27) విశాఖ వచ్చారు. మంత్రి హోదాలో కాకుండా తన వ్యక్తిగత పని మీద విశాఖ వచ్చానని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇంతకీ ఆ వ్యక్తిగత పని ఏమిటంటారా.. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఒక మీడియా సంస్థ తన పత్రికలో ప్రచురించిన వార్తపై ఆయన సదరు పత్రికపై పరువునష్టం దావా వేశారు. 2019లో ఆ పత్రికలో చినబాబు చిరుతిండి… 25 లక్షలండి… అన్న శీర్షికన లోకేశ్ పై ఓ కథనం ప్రచురించింది. మంత్రి హోదాలో విశాఖ వచ్చిన సందర్భంగా ఎయిర్ పోర్టు లాంజిలో స్నాక్స్ కోసం  ఆయన ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఖర్చుచేశారన్నది ఆ పత్రిక ప్రచురించిన కథనం సారాంశం. దానిపై నారా లోకేష్ అప్పట్లోనే సదరు పత్రికకు లీగల్ నోటీసు పంపారు. దానికి సమాధానం ఇవ్వకపోగా పదే పదే అసత్య కథనాలు ప్రచురిస్తుండటంతో లోకేష్ ఆ పత్రికపై పరువునష్టం దావా వేశారు. ఆ కేసు విచారణకు ఆయన విశాఖ వచ్చారు. విచారణ వాయిదా పడింది. తిరుగు ప్రయాణం అవుతూ మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. 

ఇటీవల లోకేష్ ఉప ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం నేతలూ, శ్రేణులూ కూడా పోటీపడి లోకేష్ కు డిప్యటీ సీఎంగా ప్రమోషన్ అంటే గొంతెత్తారు. ఆ తరువాత పార్టీ ఆదేశాల మేరకు ఎవరూ ఈ విషయంపై గళమెత్తడం లేదనుకోండి. అది వేరు సంగతి. ఇప్పుడు విశాఖలో మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి లోకేష్ చాలా సంయమనంతో ఉప ముఖ్యమంత్రి పదవి అనే కాదు.. పార్టీ అధినేత చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా అహర్నిషలూ కష్టపడతా, పార్టీని బలోపేతం చేస్తానని బదులిచ్చారు. ఈ సందర్భంగానే ఆయన ఒక సంచలన విషయం చెప్పారు. ఇప్పటికే తాను రెండు సార్లుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నాననీ, మరో సారి ఆ పదవి తీసుకునే ఉద్దేశం లేదనీ చెప్పారు. అంతే కాదు ఏ వ్యక్తి అయినా వరుసగా రెండు సార్లకు మించి ఒకే పదవిలో ఉండకూడదన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు. 

By
en-us Political News

  
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.