ఎప్పుడూ.. దిమ్మ తిరిగే ఆలోచనలు..శాశనాలతో కొరియన్లు ఊదరగొట్టే కిమ్ జోంగ్ మరో శాశనంతో.. జనాన్ని ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. తాజాగా ఆయన తీసుకున్న ఓ కీలక నిర్ణయం సంచలనం సృష్టిస్తుంది. ఇటీవల కిమ్ కుమార్తె పేరును ఎవరికి ఉండొద్దు అంటూ నిషేధం విధించారు. పదేళ్ల కిమ్ కుమార్తె 'జు ఏ' పేరు దేశంలోని ఏ బాలిక లేదా మహిళకు ఉండకూడదని తాజాగా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కిమ్ మరో ఆదేశాలతో ఆయన చర్చనీయాంశంగా మారారు.
అదేంటో గాని... ఉత్తర కొరియాలో ఆత్మహత్యలపై ఆయన నిషేధం విధించారు. ఈ మేరకు సీక్రెట్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య అనేది సోషలిజానికి వ్యతిరేకంగా దేశద్రోహంగా భావించిన కిమ్... ఆత్మహత్యను ఆపాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రేడియో ఫ్రీ ఆసియా నివేదికలో పేర్కొంది. ఉత్తర కొరియాలో గత ఏడాది కాలంలో పెరుగుతున్న ఆత్మహత్యలు పెరిగాయని తెలుసుకున్న కిమ్ జోంగ్... ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తర కొరియాలో.. ఆత్మహత్యల కేసులు 40 శాతం పెరిగాయి. అక్కడి అధికారులను ఈ విషయం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ సంఖ్యను అధికారులు ధృవీకరించలేదు. ఆత్మహత్యల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కిమ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు.
అందుకోసం అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి... ఈ ఆదేశాలు జారీ చేశారనే వాదన వినిపిస్తోంది. ఈ సమావేశంలోనే ఆత్మహత్యకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. ఉత్తర కొరియాలో పెరుగుతున్న అంతర్గత అశాంతి ప్రజల సమస్యలకు కారణమని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రతినిధి స్పష్టం చేశారు.
ఉత్తర కొరియా దేశంలో హింసాత్మక నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని సమాచారం. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ ఏడాది మాత్రమే చోంగ్జిన్ సమీపంలోని క్యోంగ్సాంగ్ కౌంటీలో 35 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయట.
ఈ సంఖ్యను నార్త్ హమ్గ్యోంగ్ సమావేశంలో కూడా ప్రదర్శించారు. ఈ కేసులలో చాలా వరకు మొత్తం కుటుంబాలు కలిసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఆత్మహత్యలపై నిషేదం విధించారు.
మీరవరూ బతకడానికి వీలగలేదు..అలా అని ఛస్తే మాత్రం..నేనూరుకోను అన్నట్టుంది సదరు కిమ్ ల వారి వ్యవహారం. నిత్యం..కొత్త కొత్త శాశనాలతో..కొరియన్లను భయభ్రాంతులకు గురిచేసే ఆయన వైఖరికి జనం ఇప్పటికే సగం చచ్చారు. ఇప్పడు .. ఆత్మహత్య లపై నిషేధంతో.. వారి పరిస్థితి..బతకాలేము..చావలేము అన్నట్టుగా ఉంది. ఇలాంటి నేతతో.. ఉత్తర కొరియా ప్రజలను ఆ దేవుడే రక్షించాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wount-allow-to-die-or-live-25-156613.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.