ప్రపంచవ్యాప్తంగా బ‌డికి బయట 78.2 మి. పిల్ల‌లు.. యు. ఎన్‌ నివేదిక

Publish Date:Jun 27, 2022

Advertisement

ఒక  కొత్త నివేదిక ప్రకారం, విద్యా సహాయం అవసరమయ్యే సంక్షోభ ప్రభావిత దేశాలలో పాఠశాల వయ స్సు పిల్లల సంఖ్య 2016 లో 75 మిలియన్ల మంది వుండ‌గా,  ప్రస్తుతం 222 మిలియన్లకు పెరిగిందని ఐక్యరాజ్యసమితి జూన్ 21, 2022న ప్రచురించిన నివేదిక  పేర్కొన్న‌ది. వారిలో, 78.2 మిలియన్లు తరచుగా దీర్ఘకాలిక సంఘర్షణలు, అత్యవసర పరిస్థితుల కారణంగా పాఠశాలకు దూరంగా ఉన్నారు. సంక్షోభం బాధిత పిల్లల సంఖ్య,  విద్య అవసరం ఉన్న కౌమారదశలోని వారు అనే విశ్లేషణ ప్రకారం, బడి బయట ఉన్న పిల్లలలో 54 శాతం మంది బాలికలు, 17 శాతం మంది క్రియాత్మక ఇబ్బందులతో బాధపడుతున్న పిల్లలు,16 శాతం మంది బలవంతంగా వేరే ప్రాంతాల‌కు త‌ర‌లించ‌బ‌డిన‌వారూ వున్నారు.

అత్యవసర పరిస్థితులు, దీర్ఘకాలిక సంక్షోభాలలో విద్య కోసం ఐక్య రాజ్య స‌మితి ప్ర‌పంచ‌ నిధి, సాయుధ పోరాటాలు, బలవంతంగా వేరే ప్రాంతాల‌కు త‌ర‌లింపులు, వాతావరణ ప్రేరిత విపత్తులు, దీర్ఘకాలిక సంక్షో భాల కారణంగా నాణ్యమైన విద్యను కోల్పోతున్న బాలికలు, అబ్బాయిల సంఖ్యను  ఎడ్యుకేషన్  కెనాట్ వెయిట్ (ఇసిడ‌బ్ల్యు)   ప్ర‌ధానంగా పేర్కొన్న అంశాలు ఎంతో ఆందోళనకరంగా ఉంది. సంక్షోభ పీడిత ప్రాం తాల్లో నివసిస్తున్న దాదాపు 119.6 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు హాజరయ్యారు  కానీ గణితం లో లేదా పఠనంలో కనీస నైపుణ్యాన్ని సాధించలేకపోయారని కనుగొన్నారు. మరో 24.2 మిలియన్లు  ప్రీ-ప్రైమ రీ, ప్రైమరీ లేదా సెకండరీ స్కూల్‌లో గణితం లేదా పఠనంలో కనీస నైపుణ్యాన్ని సాధిస్తున్నారు, అయితే ఇప్పటికీ సంక్షోభాల వల్ల ప్రభావితమయ్యారు.  వీరికి మద్దతు అవసరం అని స్ప‌ష్టం చేసింది. 84 శాతం మంది పూర్తిగా బడి బయట ఉన్న పిల్లలు లేదా 65.7 మిలి యన్లు దీర్ఘకాలిక సంక్షోభాలు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తు న్నార‌ని నివేదిక  పేర్కొంది. ఈ  65.7 మిలియన్లలో మూడింట రెండొంతుల మంది ఆఫ్ఘనిస్తాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, మాలి, నైజీరియా, సోమాలియా, ద‌క్షిణ సూడాన్, సూడాన్, పాకిస్తాన్,  యెమెన్‌లలో నివసిస్తున్నారు.

సబ్-సహారా ఆఫ్రికాలోని  పిల్లలు చ‌దువునేర్వ‌లేని  స్థితితో తీవ్రంగా దెబ్బతిన్నార‌ని లాభాపేక్షలేని సేవ్ ది చిల్డ్రన్ చేసిన మరొక నివేదిక తెలియ‌జేసింది.  శరణార్థుల కోసం ఏర్పాటైన‌ యు.ఎన్‌ హై కమిషనర్  ఇటీవలి నివేదిక ప్రకారం 2019-2020లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శరణార్థుల కోసం సెకండరీ స్థాయి విద్య లో స్థూల నమోదు 34 శాతంగా ఉంది. మహమ్మారికి ముందు, సంక్షోభ ప్రభావిత పిల్లలలో 9 శాతం మంది మాత్రమే గణితంలో కనీస నైపుణ్యాన్ని సాధించారు. సంక్షోభం-ప్రభావిత పిల్లలలో 15 శాతం మంది మాత్రమే ప్రారంభ తరగతుల్లో చదవడంలో కనీస నైపుణ్యాన్ని సాధించారని విశ్లేషణలో తేలింది. కోవిడ్‌- 19 మహమ్మారి, ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా పాఠశాలలు సుదీర్ఘకాలం మూసివేయడం వల్ల ప్రపంచ సంక్షోభం తీవ్ర మైందని నిపుణులు చెప్పారు.  సంక్షోభ తీవ్రత, క్రియాత్మక ఇబ్బందులతో ఉన్న పిల్లలు, వేరే ప్రాంతాల‌కు త‌ర‌లించ‌బ‌డిన కుటుంబాల‌  పిల్లలు, బడి బయట వున్న‌వారి శాతం సంబంధించి అందుబాటులో ఉన్న డేటాను ప్రభావితం చేసే కొత్త పద్దతిని తాజా అధ్యయనం ప్రతి పాదించింది.

యూనిసెఫ్  బ‌హుళ సూచిక  క్లస్టర్ సర్వేలు, అంతర్జాతీయ గణితం, సైన్స్ అధ్యయన డేటా బేస్‌లో అభి వృద్ధి  కోసం అంతర్జాతీయ విద్యార్థి అంచనా వివ‌రాలు కూడా అత్యవసర పరిస్థితుల్లో బడి బయట ఉన్న పిల్లల సంఖ్యను, అలాగే నేర్చుకోని వారి సంఖ్యను అంచనా వేయడానికి ఉపయోగించాలి. అందువల్ల తక్షణ విద్యా మద్దతు అవసరమ‌ని రచయి తలు సూచించారు. ఈ పద్దతి యొక్క పరిమితి ఏమిటంటే ఇది ప్రధానంగా సంక్షోభం-ప్రభావిత వ్యక్తులుగా పరిగణించబడే వ్యక్తుల నిష్పత్తిని సరిగ్గా అంచనా వేయ డంపై ఆధారపడి ఉంటుంది. అనేక పెద్ద సంక్షోభ-ప్రభావిత దేశాలలో, మూడు నుంచి నాలుగు సంవత్స రాల వయస్సు గల పిల్లలకు, ప్రాథమిక పాఠశాలకు ముందు సంవత్స రంలో ఉన్నవారికి పాఠశాల వెలు పల రేట్ల డేటా అందుబాటులో లేదని నివేదిక పేర్కొంది.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.