ఆరు గజాల నిండుదనం.. భరతజాతి నిండు గౌరవం.. ! ప్రపంచ చీర దినోత్సవం 2024..

Publish Date:Dec 21, 2024

Advertisement

 

 ‘చీరలోని గొప్పతనం తెలుసుకో, చీర కట్టి ఆడతనం పెంచుకో’ అంటూ పాటలు రాసి మరీ నేటి తరానికి చీర గొప్పతనం గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చిందేమో కానీ, అందరూ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మనలో ప్రతీ ఒక్కరం అమ్మ చీర కొంగు నీడలో పెరిగినవాళ్ళమే అన్న విషయం గుర్తొస్తుంది. అమ్మ చీర కొంగు చెమట పడితే మొహం తుడిచేది, ఎండకో వానకో గొడుగయ్యేది. ఇంకా చెప్పాలంటే  సగటు భారతీయ కుటుంబంలో ప్రతీ శిశువు చీరతో కట్టిన ఉయ్యాలలోనే జోలపాటలు వింటూ పడుకుంది. మరి భారతీయ సమాజంలో, సంస్కృతిలో లోతుగా ఇమిడిపోయిన చీర గురించి  చెప్పుకోవాల్సింది ఏముంది అనిపిస్తుందేమో..  అయితే పెద్దలు చెప్పింది పిల్లలు పాటించటం వల్లనే  ఒక తరం నుంచి ఇంకో  తరానికి ఆచారాలు, విలువలు కొనసాగుతాయి.  అలాగే  మన సంస్కృతిలో భాగమై ఉన్న చీర గొప్పతనాన్ని తెలియజేస్తూ,  వెస్టర్న్ కల్చర్ వైపు ఆసక్తి చూపుతున్న నేటి తరం ఆలోచనా విధానం మార్చాలని, తర్వాత వచ్చే   తరాలు చీరని  మర్చిపోకుండా చేయాలనే ప్రయత్నమే  ప్రపంచ చీర దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వాటిలో చీర కూడా ఒకటి.  ప్రతీ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన  వరల్డ్ శారీ డే జరుపుకుంటారు.
 
చీర ఎప్పటినుంచి ఉంది..

చీర చరిత్ర గురించి చూస్తే దీని ఆనవాళ్ళు ఒకానొకప్పుడు మన భారతదేశంలోనే గొప్ప నాగరికతగా చెప్పబడిన సింధు నాగరికత(2800-1800బి‌సి‌) కాలంలో దొరికాయి. అప్పుడిది మామూలు పొడవైన వస్త్రంలా ఉండేది. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఇది ఒక ఆర్ట్ ఫార్మ్ గా మారుతూ వచ్చింది.. చీరలు  నేసే నేతన్నలకి, చీరల్లో ఉండే  ప్రత్యేక కళకీ  గౌరవం తెలపడానికిగానూ  2020, డిసెంబర్21వ తేదీన  ప్రపంచ చీర దినోత్సవం జరుపుకోవడం మొదలపెట్టారు.  స్థానికంగా మొదలై త్వరలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

ఉద్యోమమే స్పూర్తి..

సోషల్ యాక్టివిస్టులైన శ్రీమతి సింధూర కవిటి, శ్రీ నిస్టులా హెబ్బార్..  ఈ ఉద్యమానికి నాంది పలికారు. అయితే ఈ ఉత్సవానికి తొలి అడుగు మాత్రం 2009లో పడింది. చీరల వారసత్వాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో సోషల్ యాక్టివిస్ట్  శ్రీమతి నళిని శేఖర్  దీన్ని ప్రారంభించారు.
 
శారీ డేని ఎందుకు జరుపుకోవాలి..

భారతీయుల మూలాలను గుర్తు చేస్తూ మన వారసత్వాన్ని గుర్తుచేసుకోవడం ఈ రోజు ఉద్దేశ్యం. చీర కేవలం ఏదో  ఒంటికి చుట్టుకునే వస్త్రం మాత్రమే కాదు, తరాలుగా అందించబడుతున్న భారతీయ వారసత్వమని ప్రపంచానికి చాటి చెప్పడమే శారీ డే లో ఉన్న గొప్పతనం.  చీరలు తయారు చేసే కళను కాపాడి, చేతి వృత్తుల పరిశ్రమని ప్రోత్సహించడమనే మరక ఉద్దేశ్యం కూడా ఇందులో ఉంది.

చీరలు వివిధ డిజైన్లలో అభివృద్ది చెంది, స్త్రీల వ్యక్తిత్వాన్ని, అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టట్టంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ సాంస్కృతిక సంపదను   ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో అనుసంధానం చేయటం ద్వారా  మన సంస్కృతిలోని గొప్పతనాన్ని తెలియచేస్తుంది.

చీరలో వైవిధ్యం.. ఫ్యాషన్ పరిశ్రమపై చూపిస్తున్న ప్రభావం..

భారతదేశంలోని ప్రతి ప్రాంతం దాని ప్రత్యేక శైలిని చీర ద్వారా పరిచయం చేస్తుంది. ఉత్తర ప్రదేశ్  విలాసవంతమైన బనారసీ పట్టు చీర నుండి తమిళనాడులో చేతితో నేసిన కాంచీపురం చీర వరకు. రాజస్థాన్  రంగురంగుల బంధనీ చీర నుంచి తూర్పు భారతంలోని జామ్‌దాని, ఖాదీ చీరల వరకూ ఎంతో వైవిధ్యం కలిగి ఉన్నాయి.

చీర కట్టే స్టైల్లో కూడా  ప్రతీ ప్రాంతానికి తమదైన ప్రత్యేకత ఉంది.  మహారాష్ట్రలో నౌవారి స్టైల్, గుజరాత్‌లో ముందుకు పల్లు కట్టడం, బెంగాల్ చీర కట్టు... ఇలా  చాలా వైవిధ్యం ఉంది. చరిత్రలో రాణి లక్ష్మీ బాయి లాంటి వీరనారిలు, ఇందిరా  గాంధీ వంటి మహిళలు చీరలను విభిన్న శైలుల్లో ధరించారు. సాంప్రదాయ దుస్తులు కూడా శక్తికి చిహ్నంగా నిలవగలవని నిరూపించారు.
 
చీర ఇప్పుడు తన సాంప్రదాయ హద్దులని దాటి అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో కూడా తన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రముఖ డిజైనర్లు సబ్యసాచీ, మనీష్ మల్హోత్రా, గౌరవ్ గుప్తా వంటి మోడర్న్ డిజైనర్స్ కూడా  చీరను డిఫరెంట్ స్టైల్సులో డిజైన్ చేసి ఔరా అనిపిస్తున్నారు.  
చీర ఆరు నుండి తొమ్మిది గజాల అన్‌స్టిచ్డ్ వస్త్రం కాదని, భారతదేశ  కళా నైపుణ్యం,  సంప్రదాయానికి ప్రత్యక్ష సాక్ష్యం అని గుర్తించాలి.  ఆడపిల్ల ఇంటికి వస్తే చీర పెట్టి, వారి సౌభాగ్యం కలకాలం నిలబడాలని కోరుకునే మన భారతీయ సంప్రదాయం అంతరించిపోకుండా ఉండాలన్నా, మన భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచ దేశాలకి గుర్తు చేయాలనుకున్నా, ముందు మనం మన మూలాలనుంచి  దూరం అవ్వకుండా ఉండాలి.  భారత సంప్రదాయాన్ని,  చీర వైవిధ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రతి ఒక్కరూ వరల్డ్ శారీ డే ను జపురుకోవాలి.

                                       *రూపశ్రీ.

By
en-us Political News

  
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.