ప్రకృతి సంరక్షణ దినోత్సవం రోజు ఈ ప్రమాణాలు చేద్దాం!

Publish Date:Jul 25, 2022

Advertisement

ప్రస్తుతకాలంలో మనిషి తెలిసి కొంత తెలియక కొంత చేస్తున్న తప్పు ఏదైనా ఉందంటే ప్రకృతిని కాలుష్యం చేయడం. ప్రకృతి కాలుష్యం అవడం వల్ల మనిషి చుట్టూ ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం జులై 28 వ తేదీన ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ప్రపంచమంతటా ఏర్పడుతున్న కాలుష్యం, ప్రకృతి విషయంలో మనుషులు చేస్తున్న తప్పులు, ప్రకృతిని కాపాడుకునే మార్గాలు. ప్రణాళికలు వంటివి చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.

ప్రపంచవ్యాప్త దేశాలు అన్నీ తీసుకునే ఈ నిర్ణయాల గురించి పక్కన పెడితే ఈ ప్రపంచం మీద అధిపత్యం చూపిస్తున్న మనుషులమైన మనం ప్రకృతి పరిరక్షణ కోసం ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు?? ప్రకృతిని అంతో ఇంతో మనకు తోచినంత కాపాడుకుంటే ఆ ప్రకృతి మన రేపటితరాలకు మంచి చేస్తుంది.

ప్రపంచ పర్యవరణ, ప్రకృతి సంరక్షకులు అందరికీ సూచిస్తున్న, అందరూ చేయగలిగిన కొన్ని పనులు తెలుసుకోవాల్సిందే. వాటిని పటిస్తామని ప్రమాణాలు చేసుకోవాల్సిందే.

ప్లాస్టిక్ వాడకం ఆపేయాలి!

పర్యావరణం గురించి ఆలోచించే అందరూ మొదట చెప్పేమాట ప్లాస్టిక్ వాడకం ఆపేయాలని. నిజానికి సాధారణ ప్రజలకు కూడా ఎంతో సరసమైన ధరలో అందుబాటులో ఉండటం వల్ల ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగానే ఉంది. ఈ ప్లాస్టిక్ ను తిరిగి పునర్వినియోగించే అవకాశాలు ఉన్నా అది పర్యావరణానికి నష్టం చేసేదే. దీన్ని కరిగిస్తే వాయుకాలుష్యం జరుగుతుంది. పోనీ భూమిలో కలిసిపోతుందా అంటే అదీ లేదు. 

అందుకే మనిషి తన జీవనశైలిలో ప్లాస్టిక్ ను వాడటం ఆపెయ్యాలి. బదులుగా క్లాత్ బ్యాగ్ లు, పేపర్ బ్యాగ్ లు వాడటం మొదలుపెట్టాలి.

విద్యుత్ ఆదా చెయ్యాలి!

విద్యుత్ ఉత్పత్తి నీటి ద్వారా, గాలి ద్వారా ఉత్పత్తి అవుతుంది. దీనికోసం ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. విద్యుత్ కోసం పక్కరాష్ట్రాల నుండి అప్పు తీసుకునే స్థితికి ఎన్నో రాష్ట్రాలు దిగజరిపోయాయి. విద్యుత్ ను ఆదా చేయడం మొదలుపెడితే ఖర్చు తిరుగుతుంది, దాని వృధా అరికట్టినవాళ్ళం అవుతాము. అవసరం లేని సమయంలో ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. ఇంటి పనులలో వీలైనంత వరకు సొంతంగా పని చేసుకోవాలి. చీటికీ మాటికి విద్యుత్ ఆధారిత వస్తువులు కొని క్రమంగా ఇంటిపని చేయకుండా ఉంటే బద్దకం కూడా ఎక్కువైపోయి తొందరగా డయాబెటిస్ రావడం ఖాయం.

నీటిని పొదుపు చేయాలి!

అందరికీ నీరు ఎంతో అవసరం. విద్యుత్ లేకపోతే పక్షులు, జంతువులు ఎంచక్కా బ్రతికేస్తాయి కానీ నీరు మాత్రం అన్ని జీవులకు కావాలి. ఇంట్లో కుళాయి తిప్పితే వచ్చేస్తున్న నీళ్ల గురించి చాలామందికి భయమే ఉండదు. పైగా ఇళ్లలో ఫిల్టర్ అయిన నీళ్లను వదులుతారు. అలాంటి నీళ్లు ఎంతో విలువైనవి. మనఇంట్లో మన ట్యాంక్ లో నీళ్లున్నాయని దానికి మనం డబ్బు కడతామని ఇష్టమొచ్చినట్టు వృధాచేయకూడదు. ఇల్లు చదవడం, బట్టలు ఉతకడం, వంట పాత్రలు కడగడం ఇలా వీటికోసం వాడే నీటిని పెరట్లో చెట్లకు మళ్లించాలి.

పునర్వినియోగం!

దేన్నైనాస్ అర్ పడేసేముందు తిరిగి వాడుకునే అవకాశం ఉందేమో ఆలోచించాలి. రీసైక్లింగ్ చేయడం, తిరిగి ఉపయోగించుకోవడం వల్ల వ్యర్థాలను తగ్గించవచ్చు.  చాలామంది వస్తువులను తిరిగి వాడటం అనేది షేమ్ గా ఫీలవుతారు. ఆ భావాన్ని తగ్గించుకోవాలి. ఇంట్లో ఉండే కంటైనర్లు, సీసాలు మొదలైనవాటిని మొక్కలు పెంచుకోవడానికి వేరే ఏమైనా స్టోర్ చేసుకోవడానికి వాడుకోవాలి.

అవసరం అయితే తప్ప కొత్తవి కొనకూడదు!

చాలామంది వస్తువులు పాతబడగానే కొత్తవి కొనేస్తారు. కానీ వస్తువులు చక్కగా పనిచేస్తున్నప్పుడు అలా పాతవి మార్చేయడం అవసరమా. మారుస్తున్న ఆ వస్తువుల వల్ల వాటిని తిరిగి రీసైకిల్ చేయడంలో చాలా పొల్యూట్ అయిపోతుంది. పరిశ్రమలు సెలరించే కొన్నిరకాల పాత వస్తువుల వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లుతోంది అనే విషయం ఆలోచించవు. అందుకే ప్రతిఒక్కరు ప్రకృతిని కాపాడుకోవాలి.

                                   ◆ వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.