ఆటిజం సమస్యపై అవగాహనా బాణం ఎక్కుపెట్టాలిప్పుడు!
Publish Date:Apr 2, 2023
Advertisement
ఆటిజం అనేది శరీరంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం ద్వారా ఎదురయ్యే సమస్య. న్యూరోడైవర్సిటీ వరల్డ్ ఆటిజం అవేర్‌నెస్ డే అనేది వాస్తవానికి 1990ల చివరలో ఆస్ట్రేలియన్ సామాజిక శాస్త్రవేత్త జూడీ సింగర్ కనిపెట్టిన పదం..డైస్ప్రాక్సియా, డైస్లెక్సియా, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ మొదలైన న్యూరోమైనారిటీలలో ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ ఒకటి. ఆటిస్టిక్ వ్యక్తులు ఇతర ఇబ్బందులతో పాటు పక్షపాతాన్ని అనుభవిస్తారు. ప్రపంచ ఆటిజం అవేర్‌నెస్ డే 2023 థీమ్.. ఆటిజం గురించి అవగాహనను తీసుకురావడానికి పిలుపునివ్వడం ద్వారా సమాజంలో, పనిలో ఆటిస్టిక్ వ్యక్తులను అంగీకరించడం, వారికి మద్దతు ఇవ్వడం. ఆటిజం గురించిన అవగాహన పెంచడం, పనిలో, కళలలో ఆటిజం ఉన్నవారికి స్నేహపూర్వక విధానంతో హామీ ఇవ్వడం ద్వారా వీరికి ప్రపంచ దేశాల నుండి సమాజం వరకు సహకారాన్ని పెంచడమనే టాస్క్ తో ఈ థీమ్ నడుస్తుంది. ఈ సంవత్సరం, ఏప్రిల్ 2వ తేదీ ఆదివారం, ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వర్చువల్ ఈవెంట్ నిర్వహించబడతాయి. ఆటిజం ను జయించినవారు, దీని గురించి అవగాహనకు కృషి చేసేవారు, ఆటిజం నియంత్రణకు పాటు పడేవారు ఇందులో పాల్గొంటారు. చరిత్ర డిసెంబర్ 18, 2007న నిర్వహించిన 76వ ప్లీనరీ సమావేశంలో, ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 2వ తేదీని ప్రపంచ ఆటిజం అవేర్‌నెస్ డేగా ప్రకటించింది, దీనిని 2008 నుండి ప్రతి సంవత్సరం పాటిస్తున్నారు. ఎవరిలో ఆటిజం వచ్చే అవకాశాలు ఉంటాయంటే.. ఆటిజం సమస్యలో జన్యుశాస్త్రం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఒకేలాంటి కవలలలో, ఒక బిడ్డకు ఆటిజం ఉంటే, మరొకరికి ఆటిజం వచ్చే అవకాశం 36-95% ఉంటుందని అధ్యయనాలు కనుగొన్నాయి. ఆటిజం ఉన్న పిల్లల తోబుట్టువులకు కూడా ఈ రుగ్మత వచ్చే ప్రమాదం 2-8% ఉంటుంది. మానసిక రుగ్మతలు ఉన్న వారికి, ప్రత్యేకించి స్కిజోఫ్రెనియా వంటి ప్రభావిత రుగ్మతలు ఉన్నవారు ఆటిజం సమస్యతో ఉన్న పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. నెలలు నిండకుండానే (2500 గ్రాములు) జన్మించిన పిల్లలలో ఆటిజం ప్రమాదం 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. క్లోరిపైరిఫాస్ వంటి పురుగుమందులకు పిండం గురికావడం వల్ల కూడా ఆటిజం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది గర్భిణీ తల్లులు, ముఖ్యంగా 1వ లేదా 2వ నెలలో, వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లకు గురికావడం, వారి పిల్లలలో ఆటిజంతో సహా న్యూరోసైకియాట్రిక్ వ్యాధుల ప్రమాదాన్ని 13% పెంచుతుంది. ◆నిశ్శబ్ద.
ప్రతి సంవత్సరం ఒకో థీమ్ నిర్ణయించబడి దాని ప్రకారం ప్రణాళికలు, ఆలోచనలు, కార్యక్రమాల నిర్వహణ, టార్గెట్లు జరుగుతాయి. ఈ సంవత్సరం "Transforming the narrative: Contributions at home, at work, in the arts and in policymaking"( " కథనాన్ని మార్చడం: ఇంట్లో, పనిలో, కళలలో మరియు విధాన రూపకల్పనలో సహకారం" ). అనే థీమ్ తో ప్రజల్లోకి వెళ్లనున్నారు.
http://www.teluguone.com/news/content/world-autism-awareness-day-35-153292.html





