టి20 విమెన్ వరల్డ్ కప్.. నెదర్లాండ్స్ ను చిత్తు చేసిన టీమ్ ఇండియా

Publish Date:Jun 18, 2026

Advertisement

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నాలో   భారత క్రికెట్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం (జూన్ 17) నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన  పోరులో టీం ఇండియా 95 పరుగుల భారీ తేడాతో  విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో  టాస్ గెలిచిన నెదర్లాండ్స్  ఫీల్డింగ్ ఎంచుకుంది.  దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా   ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మల అద్భుత బ్యాటింగ్ లో కళ్లు చెదిరే ఆరంభాన్ని అందుకుంది.

వీరిరువురూ  ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు.  స్మృతి మంధాన, షెఫాలీ వర్మ తొలి వికెట్ కు కేవలం 70 బంతుల్లోనే 115 పరుగుల భారీ   భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో స్మృతి, షెపాలీలు హాఫ్ సంచరీలు సాధించారు. నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ ఇండియా.. 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత జట్టుకు ఇదే అత్యధిక స్కోరు.

210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు భారత బౌలర్ల ధాటికి  ఆరంభం నుంచే ఒత్తిడికి లోనై క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. నెదర్లాండ్స్ కెప్టెన్ బాబెట్ డి లీడే 27 బంతుల్లో 28 పరుగులు, స్టెర్రే కల్లిస్ 13 బంతుల్లో 18 పరుగులతో కాసేపు పోరాడినా జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయారు. భారత బౌలర్లలో శ్రేయా చరణి  నాలుగు వికెట్లు పడగొట్టింది.

 ఈ మ్యాచ్ ద్వారా ఐసీసీ టోర్నీల్లో అరంగేట్రం చేసిన యువ పేసర్ నందిని శర్మ రెండు వికెట్లు, షఫాలి వర్మ 2 వికెట్లు పడగొట్టారు. దీప్తికి ఒక వికెట్ దక్కింది. నెదర్ల్యాండ్స్ 17.3 ఓవర్లలో  114 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ భారీ విజయంతో టీమ్ ఇండియా పాయిట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరియు అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతూ మద్యం రవాణా కుంభకోణం కేసులో మరో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది.
మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మరోసారి ఊహించని మలుపు తిరిగింది.
తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటూనే ఉంటుంది.
బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో రెండు, విశాఖపట్నం తీరంలో రెండు చొప్పున మొత్తం నాలుగు బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని విశ్వసిస్తోంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మరియు మ్యూచువల్ ఫండ్స్ (SIP)లలో నెలకు ₹12,500 చొప్పున 30 ఏళ్లు పెట్టుబడి పెడితే ఏ పథకం ద్వారా ఎంత ఎక్కువ లాభం వస్తుందో, ద్రవ్యోల్బణం ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి గణాంకాలతో తెలుసుకోండి.
తెలంగాణ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కోడి చెరువు భూములను పవన్ కల్యాణ్ అక్రమంగా ఆక్రమించారని, స్థానిక భూ రికార్డులను కూడా తారుమారు చేశారంటూ ఆన్‌లైన్ వేదికల్లో ప్రచారం జరిగింది. వైసీపీ, తెలంగాణ రక్షణ సమితి అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణల ఆధారంగా ఈ ప్రచారం ఊపందుకుంది.
సరికొత్త 2027 పోర్షే టైకాన్ (Porsche Taycan) ఈవీ అప్‌డేట్స్ వచ్చేశాయి. టెస్లా తరహా NACS ఛార్జింగ్ పోర్ట్, డ్రైవింగ్ కిక్ ఇచ్చే 8 స్పీడ్ వర్చువల్ E Shift గేర్లు, 105 kWh భారీ బ్యాటరీ మరియు AI వాయిస్ కంట్రోల్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు అదరగొడుతోంది. ధర, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
విండోస్ మరియు లైనక్స్ సిస్టమ్స్‌లో మైక్రోసాఫ్ట్ 2011 సెక్యూర్ బూట్ కీస్ గడువు ముగుస్తోంది. జూన్ 2026 డెడ్‌లైన్ లోపు మీ కంప్యూటర్ మదర్‌బోర్డ్ సెక్యూరిటీని ఎలా అప్‌డేట్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్ గైడ్ చూడండి.
అమెరికా గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు యూఎస్‌సీఐఎస్ బిగ్ షాక్ ఇచ్చింది. జూలై వీసా బులెటిన్‌లో ఎంప్లాయ్‌మెంట్ ఆధారిత EB-2, EB-3 కేటగిరీల కోసం కఠినమైన ఫైనల్ యాక్షన్ డేట్స్ నిబంధనలను తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వేదాంత అల్యూమినియం (VAML) షేర్లు డీమెర్జర్ మరియు మార్కెట్ లిస్టింగ్ తర్వాత తొలిసారిగా లాభాల బాట పట్టాయి. కోటక్, సిటీ వంటి దిగ్గజ బ్రోకరేజ్ సంస్థలు ఈ కొత్త స్టాక్‌పై భారీ టార్గెట్లతో కొనుగోలు పిలుపునిచ్చాయి. పూర్తి వివరాలు మరియు భవిష్యత్తు అంచనాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీకి చెందిన ప్రముఖ డయాగ్నోస్టిక్ కన్జ్యూమబుల్స్ తయారీ సంస్థ ఏవియెన్స్ బయోమెడికల్స్ ఐపీఓ జూన్ 18న ప్రారంభమైంది. జూన్ 22 వరకు సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు అవకాశం ఉంది. ఈ ఐపీఓ పూర్తి వివరాలు, రిస్క్ ఫ్యాక్టర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.
విదేశీ ప్రయాణానికి ప్లాన్ చేస్తున్నారా? మీ క్రెడిట్ స్కోర్ వీసా అప్రూవల్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎలాంటి ఆర్థిక పత్రాలను పరిశీలిస్తారో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మొదటిసారి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR AY 2026-27) దాఖలు చేస్తున్నారా? కొత్త ట్యాక్స్ నిబంధనల వల్ల కొత్త ఫైలర్లు చేస్తున్న 4 ప్రధాన తప్పులు మరియు ఐటీ నోటీసుల బారిన పడకుండా ఉండటానికి నిపుణులు చెప్తున్న జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.