ఏసీబీ వలలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ
Publish Date:Apr 21, 2026
Advertisement
ఏసీబీ దాడుల్లో వికారాబాద్ మహిళా పోలీసు స్టేషన్ సీఐ, ఎస్ ఐలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐ సరోజ, ఎస్ఐ రాణి లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరు ఒక వ్యక్తిగత కుటుంబ వివాదాన్ని ఆధారంగా చేసుకుని బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగి సి ఐ ఎస్ఐలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తాండూర్‌కు చెందిన బాధితుడు ఇర్షాద్ మాట్లాడుతూ.. తాండూరు ప్రాంతానికి చెందిన ఇర్షాద్ అనే వ్యక్తి భార్య కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సమస్యను తప్పుదారి పట్టించి 498ఏ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. .సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేయడమే కాకుండా కేసు పరిష్కారం పేరుతో మా తల్లిదండ్రులు, సోదరుడు, అక్కచెల్లెళ్లు కలిపి మొత్తం ఆరుగురిపై గృహహింస కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వకుండా ఉండాలంటే ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొత్తం 60,000 లంచం డిమాండ్ చేసినట్లు ఇర్షాద్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ మొత్తాన్ని 40,000కు తగ్గించి ఒప్పందం కుదిరిందనీ, తొలుత మొదటగా 20,000ను సీఐ సమక్షంలో ఎస్ఐకి బాధితుడు అందజేయగా, మిగిలిన 20,000 ఇవ్వాలని ప్రతిరోజు అడుగుతూ ఉండడంతో బాధితుడు ఏసీబీ అధికా రులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో మంగళవారం (ఏప్రిల్ 21) మిగిలిన నగదు స్వీకరిస్తున్న సమయంలో సీఐ, ఎస్ఐలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనపై రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి ట్రాప్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేసి, వారి ఆస్తులపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/womens-police-station-ci-and-si-caught-redhanded-to-acb-36-217906.html





